దీనదయాళ్ ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ
దీనదయాళ్ ఉపాధ్యాయ
భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1916-09-25)25 సెప్టెంబరు 1916
నాగ్లా చంద్రభాన్(మథుర), ఉత్తరప్రదేశ్
మరణం ఫిబ్రవరి 11, 1968(1968-02-11) (వయసు 51)
రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్
మతం హిందూ మతం

దీనదయాళ్ ఉపాధ్యాయ (Hindi: पण्डित दीनदयाल उपाध्याय) రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త . పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గర 'నగ్ల చంద్రభాన్' అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు.

1952లో భారతీయ జన సంఘ్ లొ చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య మరియు లక్నొ దినపత్రిక 'స్వదేశ్'లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం , శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో 'చంద్రగుప్త మౌర్య' నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినాడు.

భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు.[1]

మూలాలు[మార్చు]