దీపిక పడుకొనే
|
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. |
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
| Deepika Padukone | |
| జననం | జనవరి 5 1986 (వయసు 26) Copenhagen, Denmark |
| క్రియాశీలక సంవత్సరాలు | 2004–present |
| భార్య/భర్త | None |
| Filmfare Awards | |
|---|---|
| Best Female Debut 2008: Om Shanti Om Face of the Year 2008: Om Shanti Om |
|
దీపికా పడుకొనే (కన్నడ): ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ; పుట్టిన తేది జనవరి 5, 1986) భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము మరియు విద్య
పడుకొనే డెన్మార్క్ లోని కోపెన్ హగెన్ (Copenhagen)లో ఉజ్జల మరియు ప్రకాష్ పడుకోనె దంపతులకు జనవరి 5, 1986లో జన్మించింది. ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు మారినపుడు ఆమెకు కేవలం పదకొండు నెలలు.[1]ఆమె తలిదండ్రులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపురా తాలుకాకు చెందిన పడుకొనే అనే ఊరికి చెందినవారు.[2]ఆమె తండ్రి, ప్రకాష్ పడుకొనే, అంతర్జాతీయ ఖ్యాతిగల బ్యాడ్మింటన్ ఆటగాడు మరియు తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్. పడుకొనేకి 1991లో పుట్టిన అనిష అని ఒక చెల్లి మరియు 1993లో పుట్టిన ఆదర్శ అని తమ్ముడు ఉన్నారు.[3]
పడుకొనే బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆమె బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువులు పూర్తి చేసింది.[4]హైస్కూల్లో ఉన్నపుడు ఆమె తన తండ్రిలానే రాష్ట్రస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడింది. అలాగే, తన తండ్రి బ్యాడ్మింటన్ క్లబ్‌లో సభ్యురాలు.[5]కానీ, తన కెరీర్‌ని ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మలచుకోవడంపై ఆసక్తి లేకపోవడం మరియు తన ఐసిఎస్ఇ (ICSE) పరిక్షలపై దృష్టితో దాన్ని వదిలేసింది.[6]
[మార్చు] కెరీర్
[మార్చు] మోడలింగ్
కాలేజీ రోజుల్లో ఉండగా పడుకొనే మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది.[7]కొద్ది సంవత్సరాల్లో, ఆమె ప్రముఖ ఉత్పత్తులైన [[లిరిల్] (Liril), డాబర్ (Dabur), లాల్ పౌడర్, క్లోసప్ టూత్ పేస్టు, మరియు లిమ్కాలకి మోడలింగ్ చేసింది. ఇండియా రిటైల్ జ్యువెలరీ షో యొక్క ఆభరణములకు "బ్రాండ్ అంబాసిడర్"గా కూడా వ్యవహరించింది.[ఆధారం కోరబడినది]మేబెల్లిన్ (Maybelline) అనే కాస్మెటిక్స్ కంపెనీ ఆమెను అంతర్జాతియ అధికార ప్రతినిధిగా నియమించుకుంది.[ఆధారం కోరబడినది]
అయిదవ వార్షిక కింగ్ ఫిషర్ (Kingfisher) ఫ్యాషన్ అవార్డులలో ఆమెకు "మోడల్ అఫ్ ది ఇయర్" అవార్డు లభించింది.[ఆధారం కోరబడినది]కొన్నాళ్ళలోనే, కింగ్ ఫిషర్ స్విం సూట్ కాలెండరు 2006కి ఒక మోడల్‌గా తీసుకునబడింది మరియు ఐడియా జీ ఫ్యాషన్ అవార్డులలో రెండు ట్రోఫీలు గెలిచింది: "ఫిమేల్ మోడల్ అఫ్ ది ఇయర్ - (కమర్షియల్ అసైన్ మెంట్స్)" మరియు "ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్".[ఆధారం కోరబడినది]పదుకొనె కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ (Kingfisher Airlines), ఆ తరువాత లేవి స్ట్రాస్ (Levi Strauss) మరియు టిస్సోట్ ఎస్ ఎ (Tissot SA) లకు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకొనబడింది.[8]
[మార్చు] నటన
మోడలింగ్‌లో విజయవంతమైన తరువాత, పదుకొనె నటన వైపు దృష్టి సారించింది. ఆమె హిమేష్ రేషమ్మియా తీసిన స్వతంత్ర ఆల్బం ఆప్ కా సురూర్ (Aap Kaa Surroor)లోని నాం హై తేరాఅనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్‌ని మొదలుపెట్టింది.
2006లో, పడుకొనె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన బాలీవుడ్ (Bollywood) చిత్రం ఓం శాంతి ఓం (Om Shanti Om)లో నటించింది.[9][10]ఆ సినిమాలో ఆమె 1970లలో సినీతార శాంతిప్రియగాను ఆ తరువాత అచ్చం శాంతి ప్రియని పోలి ఉండే సంధ్య అనే యువతిగాను చూపించ బడింది. ఆమె ప్రదర్శనకు గాను సానుకూల స్పందన లభించి, ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు (Filmfare Best Female Debut Award) సంపాదించి పెట్టింది. ఆలానే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి (Filmfare Best Actress)కి గాను నామినేట్ అయింది. ఇండియాఎఫ్ఎం (indiaFM)కి చెందిన తరణ్ ఆదర్శ్ (Taran Adarsh) ఇలా అన్నాడు, "ఒక పెద్ద స్టార్ అవడానికి దీపికకు అన్ని అర్హతలు ఉన్నాయి - వ్యక్తిత్వం, కనిపించే తీరు, ఇంకా ఆమె ఎంతో ప్రతిభావంతురాలు కూడా."యస్ ఆర్ కె తో కలిసి ఒకే ఫ్రేములో నిలబడటం మరియు దాన్ని సరిగ్గా చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఆమె వస్తుంటే స్వచ్ఛమైన చిరుగాలి వస్తున్నట్టుగా ఉంటుంది!"[11]
ఆ తరువాత పదుకొనె సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) సినిమా బచ్నా ఏ హసీనో (Bachna Ae Haseeno) (2008) లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)తోనూ మరియు వార్నర్ బ్రదర్స్ (Warner Bros.)-బాలీవుడ్ కలిసి తీసిన, జనవరి 16, 2009లో విడుదల అయిన చాందిని చోవ్క్ టు చైనా (Chandni Chowk To China)లోనూ కనిపించింది. జనవరి 2009 గాను, ఆమె ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) సినిమా లవ్ ఆజ్ కల్ (Love Aaj Kal)లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)తో కలిసి చేస్తుంది.
[మార్చు] అవార్డులు మరియు నామినేషన్లు
[మార్చు] ఫిల్మ్ ఫేర్ అవార్డులు
విజేత
- 2008: ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు (Filmfare Best Female Debut Award); ఓం శాంతి ఓం (Om Shanti Om)[12]
- 2008: సోనీ హెడ్ అండ్ శోల్డర్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్ అవార్డు; ఓం శాంతి ఓం (Om Shanti Om)[12]
- నామినేట్ అయినది
[మార్చు] స్టార్ స్క్రీన్ అవార్డులు
విజేత
- 2008: స్టార్ స్క్రీన్ అవార్డు ఫర్ మోస్ట్ ప్రోమిసింగ్ న్యూకమర్ - ఫిమేల్ ; ఓం శాంతి ఓం [14]
- 2008: స్టార్ స్క్రీన్ అవార్డు జోడి నెంబర్ 1 (Star Screen Award Jodi No. 1) షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తో పాటు; ఓం శాంతి ఓం [14]
[మార్చు] జీ సినీ అవార్డులు (Zee Cine Awards)
విజేత
- 2008: జీ సినీ అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ (Zee Cine Award for Best Female Debut); ఓం శాంతి ఓం (Om Shanti Om)[15]
నామినేట్ అయ్యెను
- 2008: జీ సినీ ఉత్తమ నటి అవార్డు - ఫిమేల్ (Zee Cine Award for Best Actor - Female); ఓం శాంతి ఓం (Om Shanti Om)[16]
[మార్చు] ఐ ఐ యఫ్ ఎ అవార్డులు (IIFA Awards)
విజేత
- 2008: ఐ ఐ యఫ్ ఎ అవార్డులు' బెస్ట్ డెబ్యుటంట్ (ఫిమేల్); ఓం శాంతి ఓం (Om Shanti Om)[17]
నామినేట్ అయ్యెను
[మార్చు] స్టార్ డస్ట్ అవార్డులు (Stardust Awards)
నామినేట్ అయ్యెను
- 2008: స్టార్ డస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో - ఫిమేల్ (Stardust Superstar of Tomorrow - Female); ఓం శాంతి ఓం (Om Shanti Om)[19]
[మార్చు] అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు
విజేత
- 2008: అప్సర ఫిల్మ్ & టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు ' బెస్ట్ ఫిమేల్ డిబట్; ఓం శాంతి ఓం (Om Shanti Om)[20]
[మార్చు] ఇతర అవార్డులు
- 2007: స్టార్స్' సబ్సే ఫేవరేట్ కౌన్ అవార్డులు, సబ్సే ఫేవరేట్ నయీ హీరోయిన్; ఓం శాంతి ఓం (Om Shanti Om)[21]
- 2007: ఎచ్ టి కేఫ్ ఫిల్మ్ అవార్డులు, బెస్ట్ న్యూకమర్ అవార్డు (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[22]
- 2008: రీబక్ జూమ్ గ్లాం అవార్డులు, గ్లాం డెబ్యూటంట్ (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[23]
- 2008: అన్యుఅల్ సెంట్రల్ యురోపియన్ బాలీవుడ్ అవార్డులు, బ్రేక్ త్రూ రోల్ (ఫిమేల్) ; ఓం శాంతి ఓం (Om Shanti Om)[24]
[మార్చు] ఫిల్మోగ్రఫీ
| సంవత్సరము | సినిమా | పాత్ర | ఇతరములు | |
|---|---|---|---|---|
| 2006 | ఐశ్వర్య (Aishwarya) | ఐశ్వర్య | కన్నడ (Kannada) సినిమా | |
| 2007 | ఓం శాంతి ఓం (Om Shanti Om) | శాంతిప్రియ సంధ్యా (స్యాండీ) |
డబుల్-విన్నర్, ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డిబట్ అవార్డు (Filmfare Best Female Debut Award) & సోనీ హెడ్ అండ్ శోల్డర్స్ ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు (Filmfare Best Actress Award)కి నామినేట్ అయింది. |
|
| 2008 | బచ్నా ఏ హసీనో (Bachna Ae Haseeno) | గాయత్రి | ||
| rowspan="3" | 2009 | చాందిని చోవ్క్ టు చైనా (Chandni Chowk To China) | సఖి/మ్యావ్ మ్యావ్ | ద్విపాత్రాభినయం |
| బిల్లు (Billu) | ఆమెకు లానే | లవ్ మేరా హిట్ హిట్ పాటలో ప్రత్యేక ప్రదర్శన | ||
| లవ్ ఆజ్ కల్ (Love Aaj Kal) | మీరా | చిత్రీకరణలో ఉంది |
[మార్చు] ఇతరములు
- ↑ A smashing success. Newindpress.com. తీసుకొన్న తేదీ: 2005-06-24.
- ↑ http://www.daijiworld.com/chan/music_view.asp?m_id=4
- ↑ ‘I’m completely charmed by Ranbir’. Times of India (Chaturvedi, Vinita). తీసుకొన్న తేదీ: 2008-08-29.
- ↑ http://entertainment.oneindia.in/celebrities/star-profile/deepika-padukone-profile-040907.html
- ↑ Transcript of LIVE CHAT with Model, Deepika Padukone at 12 noon on Thursday, March 3, 2005 in Mumbai. Indiatimes.com. తీసుకొన్న తేదీ: 2005-03-03.
- ↑ Deepika Padukone - Biography. DeepikaPadukone.com. తీసుకొన్న తేదీ: 2008-04-12.
- ↑ Smash hit on the ramp. Indiatimes.
- ↑ Buy Deepika Padukone's pair of jeans. oneindia.com.
- ↑ Box Office 2007. BoxOffice India.com. తీసుకొన్న తేదీ: March 7, 2008.
- ↑ Overseas Earnings (Figures in Ind Rs). BoxOffice India.com. తీసుకొన్న తేదీ: March 7, 2008.
- ↑ Adarsh, Taran (November 7, 2007). Movie Review: Om Shanti Om. IndiaFM. తీసుకొన్న తేదీ: 2007-12-18.
- ↑ 12.0 12.1 Bollywood Hungama News Network (February 23, 2008). Winners of 53rd Fair One Filmfare Awards. IndiaFM. తీసుకొన్న తేదీ: 2008-02-23.
- ↑ Bollywood Hungama News Network (February 6, 2008). Nominees - 53rd Annual Filmfare Awards. IndiaFM. తీసుకొన్న తేదీ: 2008-02-06.
- ↑ 14.0 14.1 IBNLive.com (January 10, 2008). Taare... sweeps Screen Awards, but Chak De named best film. CNN-IBN. తీసుకొన్న తేదీ: 2008-01-10.
- ↑ Bollywood Hungama News Network (April 27, 2008). Winners of the Zee Cine Awards 2008. IndiaFM. తీసుకొన్న తేదీ: 2008-04-27.
- ↑ Nijjar, Lucky (March 29, 2008). ZEE Cine Awards nominations list announced. Biz Asia. తీసుకొన్న తేదీ: 2008-04-01.
- ↑ And the award goes to.... IBNLive (June 9, 2008). తీసుకొన్న తేదీ: 2008-06-08.
- ↑ Bollywood Hungama News Network (April 16, 2008). Nominations for the IIFA Awards 2008. IndiaFM. తీసుకొన్న తేదీ: 2008-06-08.
- ↑ IndiaFM News Bureau (December 25, 2007). Nominations for Max Stardust Awards 2008. IndiaFM. తీసుకొన్న తేదీ: 2007-12-31.
- ↑ PTI (March 31, 2008). 'Chak De..' has a field day at Producers Guild Awards. The Hindu. తీసుకొన్న తేదీ: 2008-04-01.
- ↑ Indiantelevision.com Team (December 24, 2007). SRK is Star Gold's 'Sabsey' favourite hero. Indiantelevision.com. తీసుకొన్న తేదీ: 2007-12-24.
- ↑ Kotwani, Hiren (December 30, 2007). Starry debut for HT Café Film Awards. Hindustan Times. తీసుకొన్న తేదీ: 2007-12-31.
- ↑ TNN (January 16, 2008). Deepika:2008 Glam Debutante. The Times of India. తీసుకొన్న తేదీ: 2008-01-15.
- ↑ IANS (March 11, 2008). OSO sweeps Central European Awards. Sify. తీసుకొన్న తేదీ: 2008-03-11.
[మార్చు] ఇది కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దీపిక పడుకొనే పేజీ