దుగోంగ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | దుగోంగ్ (Dugong)[1]
Temporal range: Early Eocene–Recent
పరిరక్షణ స్థితి
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: క్షీరదాలు
క్రమం: సిరేనియా
కుటుంబం: Dugongidae
Gray, 1821
ఉప కుటుంబం: Dugonginae
Simpson, 1932
జాతి: Dugong
Lacépède, 1799
ప్రజాతి: D. dugon
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ద్వినామీకరణం
Dugong dugon
(Müller, 1776)
Natural range of D. dugon.

దుగోంగ్ (ఆంగ్లం: Dugong) (దుగోంగ్ దుగోన్ ) అనేది ఒక సముద్రపు క్షీరదం. ఇది మనాటీస్ తో కలిపి సైరేనియా ఆర్డర్‌కు చెందిన నాలుగు జాతులలో ఒకటి. ఇది ఒకప్పటి భిన్నత్వం కలిగిన కుటుంబమైన దుగొంగిడే కు చెందిన సజీవ ప్రతినిధి. దీని ఆధునిక సంబంధి అయిన స్టెల్లర్స్ సి కౌ (హైడ్రోమాలిస్ గిగాస్ ) 18వ శతాబ్దంలో నాశనమునకు గురైయింది. ఇండో-పసిఫిక్[3] సముద్ర తీరంలో ఉన్న 32 దేశాల చుట్టూరా ఉన్న నీటిలో జీవించే సైరేనియన్లలో దుగోంగ్ ఏకైక జాతి. ఎక్కువ శాతం దుగొంగులు ఆస్ట్రేలియాకు ఉత్తర దిశగా ఉన్న నీటిలో, షార్క్ బే మరియు మారిటాన్ బే మధ్యలో ఉంటాయి.[4] మిగతా అన్ని మనాటీలు మంచినీటిని కొంత మేరకు ఉపయోగిస్తున్నాయి కాని దుగోంగ్ మొక్కల పై మాత్రమే ఆధారపడే సముద్ర క్షీరదం.[3]

ఆధునిక సైరేనియన్ల వలె దుగొంగులకు కూడా చీలరూపముగా ఉన్న శరీరము ఉంటుంది. దీనికి పై రెక్కలు గాని వెనుక కాళ్ళు గాని ఉండవు అయితే తెడ్డు-వలె ఉండే ముందు కాళ్ళు కలిగియుండి ఈదుటకు అనుకూలంగా ఉంటుంది. ఇది కొండిలాటి, డాల్ఫిన్‌కు వలె ఉన్న తోక కలిగి ఇతర మనాటీలకంటే భిన్నంగా ఉండటామే కాక ఎకైకత కలిగిన పుర్రె మరియు దంతాలు కలిగియుంటుంది.[5] దుగోంగ్ తన గ్రాసము కొరకు ఎక్కువగా సముద్రపుగడ్డి పై ఆధారపడుతుంది. దీనివల్ల అది ఈ గడ్డి ఎక్కువగా దొరికే తీరప్రాంతాలకే కట్టుబడి ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువగా దుగోంగ్ సమూహాలు విశాలమైన, లోతట్టు మరియు సురక్షిత ప్రాంతాలైన అఖాతాలలో, రావిచెట్టు వంటి ఒక రకమైన చెట్ల ద్వారాల్లో మరియు పెద్ద ద్వీపముల యొక్క గాలికెదురుతట్టు తీరాలలో ఉంటాయి.[3] దీని ముక్కు కోన కింది వైపుకు వంగి ఉంటుంది. ఇలా ఉండటం దానికి గడ్డిని మేయుటకు మరియు నీటి అడుగు భాగములో ఉన్న గడ్డిని పెకలించుటకు ఉపయోగపడుతుంది.

మాంసము మరియు నూనె కొరకు దుగోంగ్ ఎన్నో వేల సంవత్సరాలు వేటాడబడింది. [6] అయితే ఈ దుగోంగ్ యొక్క వేట దాని శ్రేణిలో గొప్ప సాంస్కృతిక విశేషము కూడా కలిగియుంది.[7] ప్రస్తుతము దుగోంగ్ యొక్క జనాభా తగ్గడమే కాకుండా విఛేదము చేయబడింది మరియు అవి అంతరించిపోవుటకు దగ్గరగా ఉన్నాయి.[3] IUCN, ఈ దుగోంగ్ జాతిని అంతరించుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్న జాతిగా నిర్ణయించగా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేర్జర్డ్ స్పీసీస్ వారు ఈ జాతి యొక్క ఉత్పత్తుల క్రయ విక్రయాదుల పై నియంత్రణ లేక నిషేధం విధించింది. చట్టబద్దంగా చాలాా దేశాలలో ఈ శ్రేణుల యొక్క రక్షణ చేస్తున్నప్పటికీ, ఈ జాతి జనాభా యొక్క క్షయమునకు కారణాలు మానవ జనితమైనవి. వీటిలో ముఖ్యమైనవి వేట, స్థావరములు తగ్గుట మరియు చేపల వేటకు సంబంధించిన చావులు.[8] 70 సంవత్సరాలు లేదా అంతకు మించిన ఆయువు కలిగియుండటం మరియు పునరుత్పత్తి త్వరితంగా లేకుండుట వలన ఈ దుగోంగ్ ఇటువంటి ఉపద్రవాలకు గురి అవుతుంది.[3]. దుగొంగ్‌ లకు తుఫానులు, పరాన్నజీవులు మరియు ప్రాకృతికంగా వాటిని దోచుకునే సొరచేపలు, ప్రాణాంతక తాడిమీనులు మరియు మొసళ్ళ వల్ల ముప్పు ఉంది.[8]

ఎటిమాలజీ మరియు టాక్సానమీ[మార్చు]

దుగోంగ్ ను మొదటిగా ముల్లర్ 1776లో ట్రైఖేఖస్ దుగోన్ [9] గా విభజించి దానిని మనాటీ జీనస్ లోకి వర్గీకరించాడు. ఈ జీనస్ ను అంతకు మునుపే లిన్నాయస్ గా నిర్వచించాడు.[10] దుగొంగు ఒక ప్రత్యేకమైన జాతిగా లాసేపేడ్[11] ద్వారా వర్గీకరించబడింది. తరువాత దీన్ని తన కుటుంబంలో గ్రే[12] వర్గీకరించాడు. సింప్‌సన్ చే ఉపకుటుంబములో వర్గీకరించబడింది.[13]

దుగోంగ్ అనే పేరు టాగలాగ్ పదమైన దుగోంగ్ నుండి తీసుకొనబడింది. ఈ తాగాలాగ్ పదము మలయ్ పదమైన దుయుంగ్ నుండి ఉద్భవించింది. ఈ రెంటికి " లేడి ఆఫ్ ది సి" అని అర్ధము.[14] దీనికి ఉన్న ఇతర ప్రాంతీయ పేర్లు "సి కౌ", "సి పిగ్" మరియు సి కామెల్".[8]

నిర్మాణము మరియు ఆకృతికి సంబంధించిన శాస్త్రము[మార్చు]

అడ్డంకితో కూడిన దుగోంగ్ (లామేన్ ద్వీపము, ఎపి, వన్వాటు)

దుగోంగ్ యొక్క శరీరము పెద్దది మరియు చేపవలె ఆకారము కలిగి ఉంటుంది. మందపాటి, మెత్తని చర్మము కలిగి ఉంటుంది. ఇది పుట్టినప్పుడు పీల క్రీం రంగులో ఉండి ఆ తరువాత వయసుతో బాటు పై భాగమున గాఢమైన రంగును సంతరించుకుంటుంది. అలాగే కింద భాగంలో వయసుతో పాటు రంగు గోధుమ రంగుకు మారి అటు పిమ్మట గాఢమైన ఊదా రంగుకు మారుతుంది.[15] వీటి శరీరము అక్కడక్కడ చిన్నపాటి వెంట్రుకలను కలిగి ఉంటుంది. ఈ లక్షణము మిగతా సైరేనియన్లలో కూడా కనిపిస్తుంది. ఈ రోమాలతో స్పర్శ ద్వారా పరిసరాల యొక్క స్థితి గతులను తెలుసుకుంటాయని ఒక అంచనా.[16] దుగొంగుకు తెడ్డు-వంటి ముందు కాళ్ళు ఉంటాయి. ఇవి కదలికలకు మరియు తినుటకు ఉపయోగపడుతాయి. కొండి వలె ఉన్న తోక నిలువు కదలికలతో చలనమునకు ఉపయోగపడుతుంది. వీటికి కూడా ఏనుగులకు ఉన్నట్టుగానే ముందర కాళ్ళకు కొద్దిగా ముందుకు చన్నులు ఉంటాయి. అమెజోనియన్ మనాటీ మాదిరిగానే దుగొంగుకు కూడా ముందు కాళ్ళకు గోళ్ళు ఉండవు.

మనాటీలవలె కాకుండా దుగొంగుల పళ్ళు నిరంతరంగా అడ్డంగా పంటి మార్పు ద్వారా పెరగవు.[17] దుగొంగుకు రెండు ముందరిపండ్లు (కోరలు) యవ్వనము వరకు కింది వైపునకు పెరుగుతాయి. ఆ తరువాత మగ దుగొంగులలో అవి చొచ్చుకు వస్తాయి. ఆ దుగొంగుల కోరలు కిందివైపుకు పెరుగుట కొనసాగుతాయి. కొన్ని సార్లు జీవిత కాలంలో అవి ప్రేమాక్సిల్ల దంతాల యొక్క మూలాలకు తగిలి చొచ్చుకు వస్తాయి.[6] దుగొంగుల యొక్క పూర్తి దంత సూత్రము:మూస:DentalFormula

ఇతర సైరేనియన్ల మాదిరిగా, దుగొంగులు పాఖియోస్టాసిస్ అనుభవిస్తాయి. ఈ స్థితిలో వాటి ఛాతి ఎముకలు మరియు ఇతర పెద్ద ఎముకలు ఎక్కువగా ఘనముగా ఉండి మూలగ కొద్దిగా గాని అసలు లేకుండా గాని ఉంటాయి. ఈ భారీ ఎముకలు జంతు ప్రపంచంలో,[18] నే సాంద్రత ఎక్కువ కలిగిన ఎముకలు. బల్లాస్ట్ వలె పనిచేస్తూ, సైరేనియన్లు నీటి ఉపరితలానికి కొద్దిగా కింద ఉండటానికి ఉపయుక్తంగా ఉంటాయి.[19]

దుగొంగులు సాధారణంగా మానాటీల కంటే చిన్నవి (అమజోనియన్ మనాటీ తప్ప). ఇవి సుమారుగా పెద్దవయ్యాక 2.7mft}} పొడుగుని మరియు 50to|300|kg|lb}} బరువుని చేరుకుంటాయి.[20] పెద్ద దుగొంగు యొక్క పొడుగు అరుదుగా 3mft}} మించుతుంది, మరియు ఆడ దుగొంగులు మగ దుగొంగుల కంటే పెద్దవిగా ఉంటాయి.[6] అతి పెద్ద దుగొంగు ఆడది. ఇది పశ్చిమ భారతం వైపు ఉన్న సౌరాష్ట్ర తీరంలో కనిపించింది. దీని కొలత 4.03mft}} మరియు బరువు 018kglb}}.[21]

పంపిణీ[మార్చు]

దస్త్రం:DugongAreaMoretonBay.jpg
మార్టన్ బే ప్రాంతంలోని దుగోంగ్ యొక్క ఆహారము తీసుకొను స్థలము
ఈజిప్ట్, మార్సా ఆలం లోని సముద్రపు అడుగుభాగంలో ఉన్న దుగోంగ్

దుగోంగ్ యొక్క మిగిలిన జనాభా చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు అవి ఎండ మెండుగా ఉండే ప్రాంతాలైన దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రముల పరిసర ప్రాంతాలలో ఎక్కువగా ఉండేవి.[citation needed] వాటి చారిత్రిక శ్రేణి కొన్ని రకముల సముద్రపుగడ్డితో సంబంధితమైనదిగా నమ్ముతారు.[3] 10,000 లేదా అంతకు మించి సమూహాలు ఆస్ట్రేలియా కు చెందిన గ్రేట్ బారియర్ రీఫ్ పైనా, షార్క్ బే వద్ద మరియు న్యూ గయానా కు దక్షిణమున ఉన్న టోర్రెస్ స్ట్రెయిట్ లోనూ ఉన్నాయి. 1970 కంటే ముందు, విస్తారమైన జనాభా మొజాంబిక్ మరియు కెన్యా తీర ప్రాంతాలలో ఉన్నాయని అనుకున్నారు కాని ఇవి క్షీణించి పోయినవి. పలావు లో కూడా కొద్ది జనాభా ఉంది. 2003, జనవరి 22న, ఒక దుగోంగ్ (బరువు 300 కేజీలు, పొడవు 2 మీ) టాంజానియా తీర ప్రాంతంలో దొరికింది.[citation needed]

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లోని మోర్టాన్ బే దుగొంగులకు ఉన్న ఎన్నో ఆవాసాలలో ఒకటి. ఇది శుభ్రమైన, స్వచ్చమైన నీటిని తగినంత లోతుతో కలిగియుంటుంది. దీనికి తోడు సరియైన ఆహారము మరియు వెచ్చదనము కొరకు సముద్రములో ప్రవేశించగలిగే వీలు కూడా ఉంటుంది. సముద్రపు అలల తాకిడి యొక్క ప్రభావము దుగొంగు తీరప్రాంతానికి చేరే ఖచ్చిత సమయము మరియు పర్యటనల సంఖ్య పై ఉంటుంది. దుగొంగులు పెద్ద సోరచేపల నుండి రక్షణ పొందటానికి తీరానికి వస్తాయి. 200 చ.కి.మీ. వైశాల్యం గల మానవ సంచారము మరియు కాలక్షేపము గల ప్రదేశం దుగొంగుల భవిష్యత్తుకు ముఖ్యమైనది. ఈ ప్రదేశం మిగిలిన సమూహాలను పరిరక్షించే విధానాలను పరిశోదించుటకు అనువైనది.

దుగొంగుల యొక్క కొంత జనాభా ఈ క్రింది ప్రాంతాలో కూడా కనిపిస్తాయి: స్త్రేయిట్స్ ఆఫ్ జోహోర్ (మలేషియా లోని జోహోర్ ను మరియు సింగపూర్ ను విభజించేది), ఫిలిపైన్స్ రాష్ట్రాలైన పాలవాన్, రోమ్బ్లాన్, గ్యుమరస్ మరియు డావో ఓరియంటల్ లలో, పాకిస్తాన్ సమీపంలోని అరేబియన్ సముద్రం లో మరియు ఈజిప్ట్ రాష్ట్రాలైన మర్సా ఆలం లోని మర్సా అబూ దబాబ్ వద్ద ఎర్ర సముద్రంలో కనిపిస్తాయి. మిగిలిన పర్షియన్ గల్ఫ్ దుగొంగుల జాతి సంఖ్య మరింతగా తగ్గి అపాయానికి గురి అవుతున్నాయని తెలుస్తోంది. U.S. మరియు ఇరాక్ ల మధ్య తరచుగా జరుగుతున్న పోరుల వల్ల ఎక్కువ మొత్తంలో నూనె సముద్రము పై చిందడం దీనికి కారణం. ప్రస్తుతము పెర్షియన్ గల్ఫ్ లోని దుగొంగుల సంఖ్య 7,500ల సమీపంలో ఉన్నా కూడా వాటి వాస్తవ పరిస్థితి తెలియడం లేదు.[22]

అంతరించిపోవు దశలో ఉన్న ఈ దుగొంగులు 50 లేక అంతకు తక్కువగా ఒకినావా పరిసర ప్రాంతాలలో కనబడుతాయి.[23]

ఆవరణశాస్త్రము మరియు జీవిత చరిత్ర[మార్చు]

మేయుట[మార్చు]

ముందు కాళ్ళలోని ఎముకలు వయసుతో పాటు కరుగుతాయి

సముద్రపు గడ్డిని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నందున దుగొంగ్లను సి కౌ లుగా వ్యవహరిస్తారు. దుగొంగుల యొక్క ఖచ్చితమైన ఆహారపు అలవాట్ల వలన ఆయా సముద్రపు గడ్డి క్షేత్రాలు ఎప్పటికప్పుడు కోతకు గురౌతున్నాయి. మనాటీస్ వలె కాకుండా దుగోంగులు సముద్రపు అడుగుభాగం లోనే ఉంటాయి. ముక్కు కొనలతో సముద్రము అడుగుభాగంలో గోతులు తీసి సముద్రపు గడ్డిని పెకిలించటం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ కారణం వల్ల, మానటీల యొక్క ముక్కుల కంటే దుగోంగుల కండరాలు కలిగిన ముక్కు వంకీలు తిరిగి ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని మోరిటాన్ బేకు చెందిన దుగోంగులు తమకు నచ్చిన గడ్డి దొరకనప్పుడు పోలిఖీట్స్ వంటి ఇన్వర్టిబ్రేట్లను తిని బ్రతుకుతాయి. కాబట్టి వీటిని ఆమ్నివోరస్ అంటారు.[24] అవి త్రాగు నీరు కోసం ఏ మంచినీటి వనరుకైనా వెళతాయి. ఈ మంచి నీటి వనరులు లేకపోయినట్టైతే వాటి మనుగడ కష్టముగా ఉండేది. ఈ మంచి నీటి వనరుల సంఖ్య క్రమముగా తగ్గుతున్నది. దుగోంగ్ జనాభా కూడా క్షీణించబోతుందని సూచించబడుతోంది.[citation needed]

పునరుత్పత్తి[మార్చు]

ఈస్ట్ టైమర్ నుండి దుగోంగ్ తల్లి మరియు బిడ్డ
Dugong.jpg

దుగొంగులు గర్భం దాల్చిన తరువాత 13 నెలలకు ఒక బిడ్డకు జన్మనిస్తాయి. ఆ బిడ్డ రెండు సంవత్సరముల వరకు పెంచబడుతుంది. అది మిగతా క్షీరదాల కంటే ఎక్కువ వయసుకు అంటే 8 నుండి 18 సంవత్సరాలలోపు ఈడుకు వస్తుంది. దుగొంగుల ఆయువు పరిమాణాము ఎక్కువైనప్పటికీ అంటే అవి యాభై కానీ అంతకు మించి సంవత్సరాలు కాని బతికినా కూడా ఆడ దుగొంగులు తమ జీవితకాలంలో కొన్ని సార్లు మాత్రమే బిడ్డలకు జన్మనిస్తాయి. ఇవి తమ బిడ్డల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తాయి.[25]

మానవ జీవితంలో ప్రాముఖ్యత[మార్చు]

ప్రాచీన అన్యోన్యచర్య[మార్చు]

ఐపొహ్ యొక్క గ్యు తాంబాన్ - దుగోంగ్ నియోలితిక్ కుడ్య చిత్రపటము

మలేషియా లోని పేరాక్ రాష్ట్రంలోని ఐపొహ్ నగరంలో తాంబన్ గుహలో దుగోంగ్ యొక్క 5,000 సంవత్సరాల కిందటి చిత్రపటము ఉంది. దీనిని నియోలితిక్ ప్రజలు వేశారు. ఈ చిత్రపటాన్ని లె.ఆర్.ఎల్.రాలింగ్స్, 1959లో సాధారణంగా తిరుగుతున్నపుడు కనుగొన్నారు.

2009లో ఉమ్ అల్-క్యువైన్ (UAE) లో ఫ్రెంచ్ దేశపు పురావస్తుశాఖ వారు జరిపిన పరిశోధనలలో దుగొంగుల యొక్క 40 అస్థిపంజరాలు కనుగొన్నారు. 5140 BP (ఐలెట్ ఆఫ్ అకాబ్)

రినైసన్స్ మరియు బరోక్ యుగాలలో, దుగొంగులు తరచుగా ఉందెర్కేమ్మర్స్ లో ప్రదర్శింపబడేవి. అవి ఫిజి మెర్మేయిడ్ లుగా స్లయిడ్ షో లో ప్రదర్శింపబడేవి.

దుగొంగులు లేక సి కోల యొక్క చర్మమును చాలా మంది[26] భవనమునకు కప్పుటకు ఉపయోగించాలనుకున్నారు. ఈ భవంతి ఓల్డ్ టెస్టమెంట్ యొక్క చిన్న ప్రార్ధనా స్థలము అయిన టాబర్నకల్ కు సంబంధించింది. దీని ప్రస్తావన హోలీ బైబిల్ పుస్తకమైన ఎక్సోడస్ లో ఉంది. బుక్ ఆఫ్ లేవిటైకస్ (11:12) ప్రకారము, ఇస్రాయిల్ ప్రజలకు "నీటిలో ఉంటూ రెక్కలు మరియు పొలుసులు లేని ఎ జంతువినా అసహ్యకరమైనది".

దుగొంగుల చెర[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఆరు దుగొంగులు మాత్రమే ఖైదు చేయబడ్డాయి. జపాన్, మీ లోని టొబా కు చెందిన టొబా అక్వేరియంలో రెండు దుగొంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరొక దుగొంగు గ్రేసి అనే పేరుతో సింగపూర్ లోని అండర్ వాటర్ వరల్డ్ లో ఉంటుంది. నాల్గవది మత్స్యకారుల బారి నుండి సంరక్షించబడి సి వరల్డ్ ఇండోనేషియా[27]లో ఉంచబడినది. చివరి రెండు దుగొంగులు (పదేళ్ళ వయసు గల మగ దుగొంగు పేరు పిగ్ కాగా నాలుగు ఏళ్ల వయసు గల ఆడ దుగొంగు పేరు వురు) ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ కు చెందిన గోల్డ్ కోస్ట్ పైఉన్న సి వరల్డ్ ఉంచబడ్డాయి. కాని 2008 డిసెంబరు నెలలో వాటిని సిడ్నీ అక్వేరియం కు తరలించారు.[28]

సంరక్షణ[మార్చు]

దుగొంగులు వాటి మాంసము మరియు కొవ్వు కొరకు వేటాడబడేవి.[citation needed] దుగొంగులు గ్రాసమునకై ఆధారపడే సముద్రపుగడ్డి, వ్యవసాయ మరియు పారిశ్రామిక వ్యర్ధాలతో ఏర్పడే యుట్రోఫికేషన్ బారినపడే బెడద ఉంది. ఈ దుగొంగుల యొక్క వ్యర్ధాలు ఇతర సముద్ర జీవాలకు ప్రధాన ఆహారము అవుతుంది. లోతట్టు ప్రాంతాలలోని నీటి పై ఆధారపడే వాటి అలవాట్ల వల్ల దుగొంగులు ఎక్కువగా నీటి మోటారు వాహనాల వల్ల గాయపరచబడటం కాని చంపబడటం కాని జరుగుతుంది. వీటి పెద్ద ఆకారము వల్ల వీటిని చంపి తినే జీవాలు తక్కువ. వీటిలో సొరచేపలు, ప్రాణాంతక తాదిమీనులు మరియు ఉప్పునీటి మొసళ్ళు ఉంటాయి.

U.S. మరియు జాపాన్ ప్రభుత్వాలు ఒకినావా, నాగో కౌంటి లోని హేనోకోకు సమీపంలోని కోరల్ రీఫ్ పై కొత్త సైన్య శిబిరాలను ఏర్పాటు చేయదలిచాయి. ఈ ప్రణాళికకు ఒకినావా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైయ్యింది. వారి అభిప్రాయం ప్రకారం దీని వల్ల దుగొంగుల నివాసమైన స్థానిక వాతావరణానికి చేటు కలుగుతుంది.[citation needed] అధికారులు వారి వైమానిక సైన్య అభివృద్ది ప్రణాళికలను పునః ప్రారంభించడంతో గ్రీన్‌పీస్ ఒక అడుగు ముందుకేసి ఒకినావాలో సైన్య విస్తరణలను 2007 వేసవిలో వ్యతిరేకించింది.[29]

పాపా న్యూ గయాన సమీప నీటి వనరులలో స్థానికులు దుగొంగులను మరియు వాటిని వేటాడే సోరచేపల లాంటి ప్రాణులను కూడా వేటాడుతారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • సైరేనియన్స్ యొక్క అభివృద్ధి క్రమం
 • దుగోంగ్ (వీబుల్ యొక్క కార్టూన్)
 • డ్యుగోంగ్

సూచనలు[మార్చు]

 1. మూస:MSW3 Sirenia
 2. Marsh, H. (2008). Dugong dugon. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 29 December 2008.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 మార్ష్ మొదలైనవారు 2002. దుగోంగ్: దేశాలు మరియు ఆధీన ప్రదేశాలకు స్థితిగతుల సమాచారము మరియు కార్యక్రమముల ప్రణాలికలు IUCN.
 4. లవ్లేర్ మొదలైనవారు. 2002. గ్రేట్ బారియర్ రీఫ్ లో దుగొంగులు : జ్ఞానము యొక్క ప్రస్తుత స్థితి. ది గ్రేట్ బారియర్ రీఫ్ వరల్డ్ హెరిటేజ్ ఏరియా కొరకు CRC.
 5. మఎర్స్, P. 2002. దుగొంగిడే. యునివర్సిటీ ఆఫ్ మిచిగాన్, మ్యుసియం ఆఫ్ జువాలజీ. 10 మార్చి 2007న పునరుద్ధరించబడింది.
 6. 6.0 6.1 6.2 మార్ష్, హెలెన్. ఆస్ట్రేలియా లోని జంతుజాలము: వాల్యూం 1B మామలియా: చాప్టర్ 57 దుగొంగిడే. CSIRO. ISBN 978-0-644-06056-1.
 7. స్పీషీస్ దుగోంగ్. కన్సర్వేషన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. దుగోంగ్ జాతులు . కన్సేర్వేషన్ మానేజ్మెంట్ ఇన్స్టిట్యుట్.
 8. 8.0 8.1 8.2 రీవేస్ మొదలైనవారు. 2002. ప్రపంచపు సముద్రపు క్షీరదాల కొరకు నేషనల్ అడుబాన్ సొసైటి గైడ్ . నొప్ఫ్ ISBN‌ 0-7195-5756-9, పిపి 77-81.
 9. దుగోంగ్ దుగోన్. ది పేల్‌బయాలజి డేటాబేస్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 10. త్రైఖీఖస్ ది పేల్‌బయాలజి డేటాబేస్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 11. దుగోంగ్. ది పేల్‌బయాలజి డేటాబేస్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 12. దుగొంగిడే. ది పేల్‌బయాలజి డేటాబేస్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 13. దుగొంగినే. ది పేల్‌బయాలజి డేటాబేస్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 14. విన్జేర్, జేన్నిఫెర్. 2000. పేరులో ఏముంది: మనాటీలు మరియు దుగొంగులు. స్మిత్సోనియన్ నేషనల్ జువలాజికల్ పార్క్. 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 15. Fox, David L. (1999). "ADW: Dugong dugon: Information". Animal Diversity Web. University of Michigan Museum of Zoology. సంగ్రహించిన తేదీ 2007-04-29. 
 16. Reep, R.L. et al. (2002). "Tactile Hairs on the Postcranial Body in Florida Manatees: A Mammalian Lateral Line?". Brain, Behavior and Evolution 59: 141–154. doi:10.1159/000064161. 
 17. సెల్ఫ్-సల్లివన్, కారిన్. సైరేనియా యొక్క ఆవిర్భావము. www.sirenian.org. 10 మార్చి 2007న పునరుద్ధరించబడింది.
 18. Waller et al. 1996. సముద్రజీవనము: సముద్ర వాతావరణము యొక్క సంపూర్ణ గైడ్ . స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ ISBN 1-85635-093-2 pp.190–232
 19. Myers, Phil (2000). "ADW: Sirenia: Information". Animal Diversity Web. University of Michigan Museum of Zoology. సంగ్రహించిన తేదీ 2007-05-13. 
 20. దుగోంగ్ . IFAW. 25 ఫిబ్రవరి 2007లో తిరిగి పొందబడింది.
 21. వుడ్, జంతు వాస్తవాలు మరియు చేష్టలకు సంబంధించిన గిన్నీస్ బుక్. స్టర్లింగ్ పబ్ కో ఐఎన్సి (1983), ISBN 978-0-85112-235-9
 22. "Case Study". American.edu. సంగ్రహించిన తేదీ 2009-07-10. 
 23. Galvin, Peter. "Saving the Okinawa dugong". Center for Biological Diversity web site. Center for Biological Diversity. సంగ్రహించిన తేదీ 2008-05-15. 
 24. బెర్ట, అన్నాలిస, జేమ్స్ ఎల్.సుమిచ్, కిట్ ఎం.కోయక్స్: సముద్రపు క్షీరదాలు: అభివృద్ధి బయాలజీ , ఆంస్టర్డాం: ఎల్సేవియర. ISBN 0-07-223174-2
 25. Anderson, Paul K. (1984). Macdonald, D., ed. The Encyclopedia of Mammals. New York: Facts on File. పేజీలు. 298–299. ISBN 0-87196-871-1. 
 26. చాలాా మంది అభిప్రాయపడ్డారు : ఈ.రుపెల్ (రుపెల్ మరియు ల్యుకర్ట్, 1828, 1831) అరాబిక్ పదమైన తుకాష్ (దుగోంగ్) ను తబాష్ కు సమానార్ధం గల పదంగా చూసారు. (హీబ్. బైబిల్ ఆయన వాటికి హేలికోర్ టబర్నకులి ఆపాదించారు రోతాస్చర్ యొక్క దుగోంగ్ పేజీ (ఆంగ్లము) "మేర్మైడ్" స్క్రోల్ డౌన్ టు బాటం ఆఫ్ ది పేజ్, ఆఖరి వాక్యము ----ఆయన జువాలజిస్ట్ మరియు టాక్సోనమిస్ట్ గా కీర్తి కొరకు చూడండి చిత్రాలు: ఫనేరోఫ్తాల్మస్ స్మరాగ్దినస్: రుపెల్ మరియు ల్యుకర్ట్, 1828 మరియు హెక్సాబ్రాంకస్ పల్చేల్లస్ : మొదటి పేజీ: టాక్సోనమిక్ నోట్స్: ఈ తెగ ఇలా జాబితాలో ఉంది హెక్సాబ్రాంకస్ సాన్గ్యునియస్ (రుపెల్ మరియు ల్యుకర్ట్, 1831); ఇంకా (దుగొంగుల లేక సి కౌల యొక్క చర్మాన్ని టాబర్నికల్ కప్పుటకు ఉపయోగిస్తారు అనుకునే వాళ్ళలో)--- ది ఎడిటర్స్ ఆఫ్ ఈస్టన్ బైబిల్ డిక్షనరీ , బాద్జర్, 1823-1894; అల్ఫ్రెడ్ ఎలీ డే , బాద్జర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా, 1815 ; ది ఎడిటర్స్ ఆఫ్ ది కాతోలిక్ ఎన్సైక్లోపీడియా , "టాబర్నికల్", 1915; బైబిల్ యొక్క వివిధ ఆంగ్ల అనువాదాల ఎడిటర్స్, NIV 1978, JPS తెనాఖ్ 1985, REB 1989, WEB 1997, ది హెర్ట్జ్ పెంటాత్యుచ్ . అయినప్పటికీ జనసంమతమైన 20th c. అకేడమిక్ అభిప్రాయము ప్రకారము తహాష్ యొక్క అర్ధము దుగోంగ్ గా అస్థిరము (ది ఐడెన్టిటి ఆఫ్ తహాష్ "రిమేయిన్స్ అబ్స్క్యుర్") ఇన్ ఎన్సైక్లోపీడియా జుడైక , రెండవ సంచిక. .తహాష్ 2000; చూడండి తహాష్: వివిధ అభిప్రాయాల కొరకు ఇతర బిబ్లికల్ అనువాదాలు చూడండి. ఇది కూడా చూడండి తహాష్:దుగోంగ్ కూడా చూడండి. టాబర్నికల్ కప్పుటకు వీటి వాడకం గురించిన చర్చలకు.
 27. "Discover a New World at SeaWorld Indonesia - Dugong". Seaworldindonesia.com. 2005-03-16. సంగ్రహించిన తేదీ 2009-07-10.  [dead link]
 28. "Dugongs in Sydney Aquarium". Sydneyaquarium.com.au. సంగ్రహించిన తేదీ 2009-07-10.  [dead link]
 29. "Take Action: Save the dugongs | Greenpeace International". Greenpeace.org. 2003-03-17. సంగ్రహించిన తేదీ 2009-07-10.  [dead link]

బాహ్య లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=దుగోంగ్&oldid=1187235" నుండి వెలికితీశారు