దుబాయ్
| ఎమిరేట్ ఆఫ్ దుబాయి إمارة دبيّ |
|||
| రాత్రివేళ దుబాయి దృశ్యం | |||
|
|||
| Coordinates: | |||
|---|---|---|---|
| ఎమిరేట్ | దుబాయి | ||
| ప్రభుత్వము | |||
| - అమీర్ | షేక్ ముహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ | ||
| వైశాల్యము [1] | |||
| - మెట్రో | 4,114 km² (1,588.4 sq mi) | ||
| జనాభా (2006)[2][3] | |||
| - సాంద్రత | 345.65/km2 (895.2/sq mi) | ||
| - మెట్రో | 14,92,000 | ||
| కాలాంశం | దుబాయి ప్రామాణిక కాలం (UTC+4) | ||
| వెబ్‌సైటు: Dubai Emirate Dubai Municipality |
|||
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు ఎమిరేట్స్ లలో దుబాయ్ (ఆంగ్లము - Dubai, అరబిక్ - دبيّ ), ఒకటి. మిగిలినవి అబుధాభి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీగా పిలిచే ఇది ఆ దేశంలోని ప్రధాన అభివృద్ది కలిగిన పట్టణము. దుబాయ్ భారతీయులకు అందునా ఆంధ్రులకు చిరపరచితమైన పట్టణము. ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు కలరు. దుబాయ్ గురించిన ఏదో ఒక వార్త తెలుగు పత్రికలలో, చానెళ్లలో ప్రతిరోజూ కనిపిస్తుంటుంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
డిసెంబర్ 2 1971 న అబుధాబి మరియు మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయితో కలసి యునైటెడ్ ఎమిరేట్స్ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి.
[మార్చు] భౌగోళికం
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దుబాయ్ పర్సియన్ గల్ఫ్ సముద్రతీరము వెంబడి కలదు. ఈ పట్టణము సముద్రమునకు దాదాపు సమానమైన ఎత్తుకలిగి ఉన్నది. దుబాయ్ యొక్క సరిహద్దులు దక్షణాన అబుదాభి, ఉత్తర తూర్పుగా షార్జా, దక్షణౌత్తరంగా ఒమన్, పశ్చిమాన అజమాన్, తూర్పుగా రస్ అల్ ఖైమా, దుబాయ్ పట్టణాన్ని కొంత చుట్టినట్టుగా హత్తా పర్వతశ్రేణి.
[మార్చు] జనగణన
2006 జనాభా లెక్కలననుసరించి దుబాయ్ యొక్క జనాభా 1,422,000. పురుషులు, 1,070,000. స్త్రీలు 349,000. దుబాయ్ యొక్క అధిక జనాభా ఆసియా వారు ( దాదాపు 85%. ఇందులో భారతీయులు 51%, పాకిస్తానీయులు 16%, బంగాలీలు 9%, పిలిప్పీనీయులు 3% ). మొత్తం ఎమిరేట్స్ యొక్క జనాభాలో 71% ఆసియా వారే ఉన్నారు).
దుబాయ్ పట్టణంలో ప్రధాన భాష అరబిక్. అరబిక్ కాకుండా పర్షియన్, మళయాళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, ఉర్దూ, బెంగాలీ అధికంగా మాట్లాడుతారు.
[మార్చు] ఆర్థికము
దుబాయ్ ప్రసిద్ద టూరిస్ట్ స్పాట్. ఇక్కడ ఉన్న జబెల్ అలి పోర్ట్ జబల్ అలి 1970 లో నిర్మింపబడినది. ఇది ప్రపంచంలోనే మనుషులతో నిర్మింపబడిన అతిపెద్ద పోర్ట్. దుబాయ్ మీడియా, కంప్యూటర్, సమాచార రంగాలలో కూడా అభివృద్ది కలిగిన నగరం. టెకమ్ అని పిలువబడే ( TECOM Dubai Technology, Electronic Commerce and Media Free Zone Authority) లో భాగంగా ఇక్కడ కల దుబాయ్ ఇంటర్నెట్ సిటీ (Dubaai Internet City) , దుబాయ్ మీడియా సిటీ (Dubai Media City), నాలెడ్జ్ విలేజ్(Knowledge Willage, దుబాయ్ ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ సెంటర్ (Dubai International Financial Centre (DIFC) మొదలగునవి కలవు. ఇంటర్ నెట్ సిటీలో ప్రముఖ సంస్థలైన ఇ యమ్ సి కార్పోరేషన్ (EMC Corporation), ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation), మైక్రోసాప్ట్ కార్పొరేషన్ ([:en:[Microsoft|Microsoft]]), , ఐ బి యమ్ (IBM), వంటివి కలవు. మీడియా సిటీలో ప్రముఖ సంస్థలైన ఎమ్ బి ఎమ్ (MBC), సి ఎన్ ఎన్ (CNN), రైటర్స్ (Reuters), మరియు అసోసియేటెడ్ ప్రెస్ (AP) వంటివి కలవు.
[మార్చు] రవాణా
దుబాయ్ యొక్క ప్రధాన రవాణాలు విమానం, బస్సు. ఇక్కడ రైలు సౌకర్యం ఇంతవరకూ అంటే 2007 వరకూ లేదు. నిర్మాణములో ఉన్న ట్రాక్ 2008 సంవత్సరంలో మొదలవుతుంది.
దుబాయ్ నగరానికి ప్రధాన రహదారి హేక్ జాయద్ రోడ్. ఇది మొత్తం ఆరు+ఆరు పన్నెండు లైనుల రోడ్. ఈ రహదారిపై వాహనాలకు సిటీలోపల 120, సిటీ బయట 140 కిలోమీటర్ల వేగం వరకూ పరిమితి కలదు. ఈ రహదారికి కంప్యూటరు అనుసంధానము కలిగిన టాల్ గేట్స్ (వీటిని సాలిక్(Salik road toll అని పిలుస్తారు) రెండు చోట్ల కలవు. డబ్బు చెల్లించే పద్దతిలో కాక వాహనము ముందు భాగమున ఒక ట్యాగ్ అతికించి ఉంచుతారు, వారికి ఒక అకౌంటు ఉంటుంది, అందులోనుండి వాహనం టోల్ గేట్ నుండి ప్రయాణించినపుడు డబ్బు మినహాయింపబడుతుంటుంది . ఎంత వేగంలో వెళ్ళే వాహనాన్నయినా టోల్ గేట్ దగ్గర కల స్కానర్ కెమెరాలు ట్యాగులను స్కాన్ చేస్తాయి.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Area of "Dubai emirate", includes artificial islands.
- ↑ "Statistics Centre: Dubai emirate population is 1,422,000", UAE Interact: UAE Ministry Of Information and Culture, 2006-08-30
- ↑ Density of "Dubai emirate"
- ↑ OnlineWeather Portal. UAEInteract.com. Retrieved 5/1/2007
[మార్చు] బయటి లింకులు
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- దుబాయ్ travel guide from Wikitravel
- Ansar Burney Trust - human rights organisation operating in Dubai
- dubai.ae - Official Website of Dubai Government
- DTCM - Dubai Government Department of Tourism and Commerce Marketing
- Sheikh Mohammed - Official website of the ruler of Dubai
- Dubai Municipality - Official website
- Dubai Electricity & Water Authority - Official website
- "Dubayy", Encyclopædia Britannica, 2005 - Reference source for historical information
- "Boom town" - The Guardian, 13 February 2006
- Urbanization of Dubai at NASA Earth Observatory
