దూర విద్య

వికీపీడియా నుండి
Mergefrom.svg
దూర విద్య (యాంత్రిక అనువాదం) వ్యాసమును, ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)

దూర విద్య అనగా విద్యార్ధులు తమ నివాసంలోనే వుంటూవిద్య నేర్చుకోవడం. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలు, దృశ్య శ్రవణ సాధనాలు, అప్పుడప్పుడు సంపర్క తరగతులు వాడుతారు. మొట్టమొదటగా 1960 లో ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎయిర్ అనే సంస్ధని దూర విద్యకోసం స్ధాపించారు. భారత దేశంలో 1962లో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లో 1982 లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యని ప్రవేశ పెట్టాయి. చదువు మధ్యలో ఆపిన వారికి, ఉద్యోగాలు చేస్తూ పై చదువులపై అసక్తి కలవారికి, తక్కువ ఖర్చు తో చదువుకోనాలసుకొనే వారికి ఇదిచాలా ఉపయోగం.

విషయ సూచిక

[మార్చు] ప్రాధమిక విద్య

ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ [1] 14 సంవత్సరాలు నిండిస బాల బాలికలకు, ఎలాంటి విద్యార్హత లేకుండా 10 వతరగతి చదివే అవకాశం కలిగిస్తున్నది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్[2]ద్వారా, సెకండరీ, సీనియర్ సెకండరీ కోర్సులు చేయవచ్చు.

[మార్చు] ఉన్నత విద్య

[మార్చు] బోధన పద్ధతి

ఉదాహరణగా డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము వారు సాధారణంగా వాడే పద్ధతులు (వారానికి)

  • * 12 నుండి 16 గంటలు కోర్సు పుస్తకాలు (స్వయం బోధనా పద్దతిలో ముద్రించబడిన పుస్తకాలు)
  • ఆరు నుండి ఎనిమిది గంటలు దగ్గరిలో గల విద్యా కేంద్రములో సలహా సంసర్గ తరగతులు
  • 30 నిముషాలు రేడియో పాఠాలు (హైద్రాబాద్ ఎ రేడియో స్టేషన్ ఉ 7.25 నుండి 7.55 వరకు, మధ్యమ మరియు పొట్టి తరంగాల ద్వారా)
  • 2 నుండి 3 గంటలు దృశ్య, శ్రవణ లేక శ్రవణ పద్ధతులద్వారా చదువు (సోమ నుండి శుక్ర ఉ 5.30 నుండి 6.00 వరకు దూరదర్శన్ సప్తగిరి, మన టివిలో 9.30 నుండి 10.30 (వారపురోజులు), సా 4.00 నుండి 5.00 మరల ప్రసారం), గ్యాన దర్శన్ రాత్రి 10.30 నుండి 11.00)
  • దూర శ్రవణ (tele conf)సమావేశాలు (సా 2.00 నుండి 3.00 దూరదర్శన్ సప్తగిరి)

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=దూర_విద్య&oldid=564466" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె