దేవ్‌గఢ్ (ఒడిశా)

వికీపీడియా నుండి
(దేవగఢ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవగఢ్
—  పట్టణం  —
దేవగఢ్ is located in Odisha
దేవగఢ్
దేవగఢ్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా దేవగఢ్
జనాభా (2011)
 - మొత్తం 52,390
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 768108,768109
Vehicle registration OD-28
UN/LOCODE IN DEB
Nearest city(s) Sambalpur, Rourkela & Bhubaneswar
వెబ్‌సైటు http://deogarh.nic.in[1]

దేవగఢ్ ఒడిషా రాష్ట్రం లోని పట్టణం. 1994 జనవరి 1 న సంబల్పూర్ జిల్లా నుండి విభజించి ఏర్పాటు చేసిన దేబగర్ జిల్లాకు ఇది ముఖ్యపట్టణం.

భౌగోళికం[మార్చు]

దేవగఢ్ 21°32′N 84°44′E / 21.53°N 84.73°E / 21.53; 84.73 వద్ద, [2] సముద్రమట్టం నుండి 192 మీ. ఎత్తున ఉంది.

దేవగఢ్ పట్టణం NH-6లో సంబల్పూర్ నగరానికి తూర్పున 90 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి నెం.6 అంతర్-ప్రాంతీయ వాణిజ్యానికి ప్రధాన మార్గం.

రవాణా[మార్చు]

1. వైమానిక: దేవగఢ్ కు సమీపంలో ఉన్న విమానాశ్రయాలు భువనేశ్వర్‌ (265 కి.మీ.), రాయ్‌పూర్ (376 కి.మీ.), ఝార్సుగూడా (98 కి.మీ.) .

2. రైలు: దేవగఢ్‌కు సమీప రైలు స్టేషన్లు సంబల్‌పూర్‌ (90 కి.మీ.), హౌరా-ముంబై మార్గం లోని రూర్కెలా-జార్సుగూడ సెక్షన్‌ లోని బమ్రా (103 కి.మీ.), ఝార్సుగూడా (98 కి.మీ.), రూర్కెలా (115 కి.మీ.)

3. రోడ్డు: ముంబయి - కోల్‌కతా NH6 ( AH46 లో భాగం), రాయ్‌పూర్ - చండీఖోలే NH200 లు పట్టణం గుండా పోతున్నాయి. నగరం సంబల్పూర్ నుండి 90 కి.మీ., రూర్కెలా నుండి 115 కి.మీ. భువనేశ్వర్ నుండి 265 కి.మీ. దూరంలో ఉంది.

జనాభా వివరాలు[మార్చు]

జనగణన ప్రకారం, [3] దేవగఢ్ జనాభా 52,390. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. దేవగఢ్ సగటు అక్షరాస్యత 67%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల్లో అక్షరాస్యత 74% కాగా, స్త్రీలలో ఇది 59%. పట్టణ జనాభాలో 12% మంది 6 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు.

మూలాలు[మార్చు]

  1. "Deogarh district".
  2. Falling Rain Genomics, Inc - Debagarh
  3. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?