దేవాంతకుడు (1960)
| దేవాంతకుడు (1960) | |
| దర్శకత్వం | సి.పుల్లయ్య |
|---|---|
| నిర్మాణం | సి.హెచ్. సుబ్బారావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, యస్వీ రంగారావు, కె.రఘురామయ్య |
| సంగీతం | అశ్వత్థామ |
| నిర్మాణ సంస్థ | భార్గవి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
దేవాంతకుడు తెలుగులో విడుదలైన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. మనిషి నరకానికి వెళ్ళటం, యమునితో గొడవ పడటం చిత్రకథ. అదే తరహాలో తర్వాత యమగోల, యమలీల, యముడికి మొగుడు, యమదొంగ మొదలైన చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంలో యముడిగా ఎస్వీ రంగారావు, దేవాంతకుడిగా ఎన్టీ రామారావు నటించారు. గో గోంగూర పాట ఇందులోని హిట్ గీతం.
1980లో చిరంజీవి హీరోగా మరొక దేవాంతకుడు సినిమా వచ్చింది. అయితే అది సోషియో ఫాంటసీ చిత్రం కాదు.
[మార్చు] పాటలు
01. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము రాసి ఇప్పించుమా (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
02. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి మహి ఒక్కసారిగా (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
03. ఇలలో లేదోయి హాయీ ఇచటే గలదోయి వెదికినను అపురూప మధురాల - పి.లీల - రచన: ఆరుద్ర
04. ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) - కె. రఘురామయ్య - రచన: ఆరుద్ర
05. కలగంటినమ్మా కలికి చిత్రలేఖా కలలోని చెలికాడు కడు అందగాడు - ఎస్. జానకి
06. గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకొ - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
07. జగమంతా మారినది జవరాల నీ వలనా జగమంత - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
08. దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) - కె. రఘురామయ్య - రచన: ఆరుద్ర
09. ధర్మదేవతనగు నా ధర్శనంభు చేసుకొంటివి (పద్యం) - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
10. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి తెల్లగుర్రమెక్కి (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
11. నీవెవరో నేనెవరో నెలతా ఇదేమి లోకమో - ఎస్. జానకి,పి.బి.శ్రీనివాస్
12. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల
13. పూరయ మమకామం గోపాల..వారం వారం వందన - కె.రఘురామయ్య
14. భూ: భువర్లోకాల పురమునందున నిన్ను తాళమేసిన (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
15. శాంతాకారం భుజగశయనం పద్మనాభం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
16. శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల - కె. రఘురామయ్య
17. శ్రీదేవి సిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా - పి.లీల బృందం
[మార్చు] వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)