దేవినేని ఉమామహేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవినేని ఉమామహేశ్వరరావు
ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి
In office
2014–2019
నియోజకవర్గంమైలవరం
వ్యక్తిగత వివరాలు
జననం (1962-03-29) 1962 మార్చి 29 (వయసు 62)
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
రాజకీయ పార్టీతెలుగుదేశం
సంతానంకొడుకు - నిహార్
కూతురు -జ్ఞాతవ్య
నివాసంగొల్లపూడి,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
2014లో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపతి పుల్లా రావుతో కలసి ఓ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న దృశ్యం

దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లాకు చెందిన రైతు నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1999,2004 ఎన్నికలో నందిగామ నుంచి, 2009,2014 లలో మైలవరం నుంచి ఎన్నికైనారు.ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి జలవనరుల నిర్వహణ శాఖ మంత్రిగా పని చేశాడు. [1]

ప్రాథమిక జీవితం[మార్చు]

దేవినేని ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఉన్న కంచికచెర్ల గ్రామానికి సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు .

ఉమా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కంచికచర్ల లో , ఇంటర్మీడియట్, బీఎస్సీ లను విజయవాడ లోని ఎస్. ఆర్. ఆర్ & సి. వి. ఆర్ కళాశాలలో , మెకానికల్ ఇంజినీరింగ్ కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది .

రాజకీయ జీవితం[మార్చు]

ఉమా తన రాజకీయ జీవితాన్ని సోదరుడు మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ సహాయకుడిగా ప్రారంభించడం జరిగింది. 1999 లో కాచిగూడ లో జరిగిన రైలు ప్రమాదంలో సోదరుడు వెంకట రమణ ఆకస్మిక మరణం తో రాజకీయ వారసుడిగా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి నందిగామ నియోజకవర్గ ఉపఎన్నికల్లో విజయం సాధించి తొలి సారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోకి అడుగుపెట్టడం జరిగింది.

2004-14[మార్చు]

2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం పొందడంతో ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అటు 2004 లో నందిగామ నుంచి , 2009 లో మైలవరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉమా మహేశ్వరావు అసెంబ్లీ , ఇటు కృష్ణా జిల్లాలో పార్టీ తరుపున సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది . ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కష్ట కాలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించి జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహించే మెట్ట ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగింది .

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభిజన సమయంలో సమైక్య ఆంధ్ర కోసం విజయవాడ లో పోరాటం చేయడం జరిగింది .

2014-19[మార్చు]

2014 లో ఆంధ్రప్రదేశ్ విభిజన జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి రెండో సారి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉమా చంద్రబాబు మంత్రి వర్గం లో జలవనరుల శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించి పట్టిసీమ , పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలను అతితక్కువ కాలంలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . అంతేకాకుండా ఆంధ్రుల జీవ నాడీ పోలవరం నిర్మాణంలో పనులు వేగవంతంగా పూర్తి చేసి రికార్డు స్థాయి లో 2019 నాటికి 75 శాతం వరకు పూర్తి చేయడం జరిగింది .

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి ఓటమి చెందడం జరిగింది . దేవినేని ఉమామహేశ్వరరావుకు 2024 ఎన్నికల్లో మైలవరం టీడీపీ టికెట్ రాకపోవడంతో  విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించింది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హైదరాబాద్ కు చెందిన అనుపమ తో 1995 లో ఉమా మహేశ్వరావు వివాహం జరిగింది . వీరికి ఇద్దరూ సంతానం

మూలాలు[మార్చు]

  1. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. Andhrajyothy (29 March 2024). "దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.

https://in.linkedin.com/in/devineniu[permanent dead link]

https://qr.ae/pGJYYh