దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు

వికీపీడియా నుండి
ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : అంటార్కిటికా (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), వాటికన్ నగరంలేదా హోలీ సీ (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), పాలస్తీనా భూభాగాలు (ఐ.రా.స. అబ్సర్వర్), పశ్చిమ సహారా (మొరాకో, పోలిసారియో ఫ్రంట్ల మధ్య వివాదంలో ఉన్నది), తైవాన్ - (చైనా రిపబ్లిక్ (తైవాన్) అనబడే దీనిని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.
ఐ.రా.స.లో వివిధ దేశాలు చేరిన దశకాలను సూచించే చిత్రపటం.

ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2007 నాటికి ఐక్య రాజ్య సమితిలో 192 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స. సాధారణ సభలో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఐ.రా.స. చార్టర్ 2వ ఛాప్టర్ 4వ ఆర్టికిల్ ప్రకారం ఏదైనా దేశానికి ఐ.రా.స. సభ్యత్వం రావాలంటే ఐ.రా.స. భద్రతా సభ ఆమోదంపై, ఐ.రా.స. సాధారణ సభ తీర్మానం జరగాలి. [1]. నియమాల ప్రకారం సంపూర్ణ స్వాధిపత్యం ఉన్న దేశాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. కాని ఐ.రా.స. ఏర్పాటు సమయంలో చేరిన నాలుగు ఆరంభ సభ్య దేశాలకు(బెలారస్, భారత దేశం, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్) అప్పటికి సంపూర్ణ స్వాతంత్ర్యం లేదు. అంతే కాకుండా భద్రతా సభ ఆమోదం ఉండాలన్న నిబంధన కారణంగా మాంటివిడియో కన్వెన్షన్ ప్రకారం స్వాధిపత్యం కలిగిన కొన్న దేశాలు కూడా, మరి కొన్ని ఐ.రా.స. సభ్య దేశాలు వ్యతిరేకించిన కారణంగా ఐ.రా.స. సభ్యత్వం కలిగి లేవు.


కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సంపూర్ణ స్వాధిపత్యం స్పష్టంగా లేని దేశాలు ఐ.రా.స. సాధారణ సభలో "పరిశీలకులు" (అబ్సర్వర్) హోదాను మాత్రం పొందగలవు. వారి ప్రతినిధులు సమావేశాలలో పాల్గొనగలరు గాని వారి వోటు హక్కు ఉండదు.

విషయ సూచిక

[మార్చు] ప్రస్తుత సభ్యులు

వివిధ సభ్యుల పేర్లు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు 51మంది సభ్య దేశాలున్నాయి. వాటిలో 49 దేశాలు ఇప్పటికీ సభ్యులుగా ఉన్నాయి. లేదా వారి సభ్యత్వం వేరే దేశాలకు సంక్రమించింది. (ఉదాహరణకు - సోవియట్ యూనియన్ సభ్యత్వం రష్యాకు సంక్రమించింది.) చెకొస్లవాకియా, యుగొస్లావియా దేశాలు విచ్ఛిన్నమైనాక వాటి సభ్యత్వం వేరేదేశాలకు సంక్రమించలేదు. చైనా రిపబ్లిక్ (తైవాన్) సభ్యత్వం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు 25 అక్టోబరు 1971న సంక్రమించింది. - చైనా (తైవాన్), కమ్యూనిస్టు చైనా అనే రండు దేశాలూ అంతకు ముందూ, తరువాతా కూడా ఉన్నాయి.


సభ్య దేశం ప్రవేశం తేదీ గమనికలు
Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 19 నవంబరు 1946
Flag of అల్బేనియా అల్బేనియా 14 డిసెంబరు 1955
Flag of అల్జీరియా అల్జీరియా 8 అక్టోబరు 1962
Flag of అండొర్రా అండొర్రా 28 జూలై 1993
Flag of అంగోలా అంగోలా 1 డిసెంబరు 1976
Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగ్వా & బార్బుడా 11 నవంబరు 1981
Flag of అర్జెంటీనా అర్జెంటీనా 24 అక్టోబరు 1945
Flag of ఆర్మేనియా ఆర్మేనియా 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 1 నవంబరు 1945
Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 14 డిసెంబరు 1955
Flag of అజర్బైజాన్ అజర్బైజాన్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of బహామాస్ బహామాస్ 18 సెప్టెంబరు 1973
Flag of బహ్రయిన్ బహ్రయిన్ 21 సెప్టెంబరు 1971
Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 17 సెప్టెంబరు 1974
Flag of బార్బడోస్ బార్బడోస్ 9 డిసెంబరు 1966
Flag of బెలారస్ బెలారస్[1] 24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of బెల్జియం బెల్జియం 27 డిసెంబరు 1945
Flag of బెలిజ్ బెలిజ్ 25 సెప్టెంబరు 1981
Flag of బెనిన్ బెనిన్[2] 20 సెప్టెంబరు 1960
Flag of భూటాన్ భూటాన్ 21 సెప్టెంబరు 1971
Flag of బొలీవియా బొలీవియా 14 నవంబరు 1945
Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of బోత్సువానా బోత్సువానా 17 అక్టోబరు 1966
Flag of బ్రెజిల్ బ్రెజిల్ 24 అక్టోబరు 1945
Flag of బ్రూనై బ్రూనై[3] 21 సెప్టెంబరు 1984
Flag of బల్గేరియా బల్గేరియా 14 డిసెంబరు 1955
Flag of బర్కీనా ఫాసో బర్కీనా ఫాసో[4] 20 సెప్టెంబరు 1960
Flag of బురుండి బురుండి 18 సెప్టెంబరు 1962
Flag of కంబోడియా కంబోడియా 14 డిసెంబరు 1955
Flag of కామెరూన్ కామెరూన్[5] 20 సెప్టెంబరు 1960
Flag of కెనడా కెనడా 9 నవంబరు 1945
Flag of కేప్ వర్డి కేప్ వర్డి 16 సెప్టెంబరు 1975
Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 20 సెప్టెంబరు 1960
Flag of ఛాద్ ఛాద్ 20 సెప్టెంబరు 1960
Flag of చిలీ చిలీ 24 అక్టోబరు 1945
Flag of చైనా చైనా 24 అక్టోబరు 1945 see Seat of China
Flag of కొలంబియా కొలంబియా 5 నవంబరు 1945
Flag of కొమొరోస్ కొమొరోస్ 12 నవంబరు 1975
Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో-కిన్షాషా[6] 20 సెప్టెంబరు 1960
Flag of కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి[7] 20 సెప్టెంబరు 1960
Flag of కోస్టారీకా కోస్టారీకా 2 నవంబరు 1945
Flag of కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్[8] 20 సెప్టెంబరు 1960
Flag of క్రొయేషియా క్రొయేషియా 22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of క్యూబా క్యూబా 24 అక్టోబరు 1945
Flag of సైప్రస్ సైప్రస్ 20 సెప్టెంబరు 1960
Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 19 జనవరి 1993 - "పాత చెకొస్లవేకియా" భాగస్వామి
Flag of డెన్మార్క్ డెన్మార్క్ 24 అక్టోబరు 1945
Flag of జిబౌటి జిబౌటి 20 సెప్టెంబరు 1977
Flag of డొమినికా డొమినికా 18 డిసెంబరు 1978
Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 24 అక్టోబరు 1945
Flag of ఈక్వడార్ ఈక్వడార్ 21 డిసెంబరు 1945
Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 24 అక్టోబరు 1945 పాత "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్"కు చెందినది
Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 24 అక్టోబరు 1945
Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 12 నవంబరు 1968
Flag of ఎరిట్రియా ఎరిట్రియా 28 మే 1993
Flag of ఎస్టోనియా ఎస్టోనియా 17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of ఇథియోపియా ఇథియోపియా 13 నవంబరు 1945
Flag of ఫిజీ ఫిజీ 13 అక్టోబరు 1970
Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 14 డిసెంబరు 1955
Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 24 అక్టోబరు 1945
Flag of గబాన్ గబాన్ 20 సెప్టెంబరు 1960
Flag of గాంబియా గాంబియా 21 సెప్టెంబరు 1965
Flag of జార్జియా జార్జియా (దేశం) 31 జూలై 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of జర్మనీ జర్మనీ 18 సెప్టెంబరు 1973 ఇంతకు ముందు "తూర్పు, పశ్చిమ జర్మనీ"లుగా ఉండేది.
Flag of ఘనా ఘనా 8 మార్చి 1957
Flag of గ్రీస్ గ్రీస్ 25 అక్టోబరు 1945
Flag of గ్రెనడా గ్రెనడా 17 సెప్టెంబరు 1974
Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 21 నవంబరు 1945
Flag of గినియా గినియా 12 డిసెంబరు 1958
Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 17 సెప్టెంబరు 1974
Flag of గయానా గయానా 20 సెప్టెంబరు 1966
Flag of హైతీ హైతీ 24 అక్టోబరు 1945
Flag of హోండూరస్ హోండూరస్ 17 డిసెంబరు 1945
Flag of హంగేరీ హంగేరీ 14 డిసెంబరు 1955
Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 19 నవంబరు 1946
Flag of భారత దేశం భారత్ 30 అక్టోబరు 1945
Flag of ఇండొనీషియా ఇండొనీషియా[9] 28 సెప్టెంబరు 1950
Flag of ఇరాన్ ఇరాన్[10] 24 అక్టోబరు 1945
Flag of ఇరాక్ ఇరాక్ 21 డిసెంబరు 1945
Flag of ఐర్లాండ్ Ireland 14 డిసెంబరు 1955
Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 11 మే 1949
Flag of ఇటలీ ఇటలీ 14 డిసెంబరు 1955
Flag of జమైకా జమైకా 18 సెప్టెంబరు 1962
Flag of జపాన్ జపాన్ 18 డిసెంబరు 1956
Flag of జోర్డాన్ జోర్డాన్ 14 డిసెంబరు 1955
Flag of కజకస్తాన్ కజకస్తాన్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of కెన్యా కెన్యా 16 డిసెంబరు 1963
Flag of కిరిబాతి కిరిబాతి 14 సెప్టెంబరు 1999
Flag of ఉత్తర కొరియా ఉత్తర కొరియా[11] 17 సెప్టెంబరు 1991 సస్పెన్షన్లో ఉన్నది
Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 17 సెప్టెంబరు 1991
Flag of కువైట్ కువైట్ 14 మే 1963
Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజ్ రిపబ్లిక్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of లావోస్ లావోస్[12] 14 డిసెంబరు 1955
Flag of లాత్వియా లాత్వియా 17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of లెబనాన్ లెబనాన్ 24 అక్టోబరు 1945
Flag of లెసోతో లెసోతో 17 అక్టోబరు 1966
Flag of లైబీరియా లైబీరియా 2 నవంబరు 1945
Flag of లిబియా లిబ్యా[13] 14 డిసెంబరు 1955
Flag of లైకెస్టీన్ లైకెస్టీన్ 18 సెప్టెంబరు 1990
Flag of లిథువేనియా లిథువేనియా 17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 24 అక్టోబరు 1945
Flag of మేసిడోనియా మేసిడోనియా[14] 8 ఏప్రిల్ 1993 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of మడగాస్కర్ మడగాస్కర్ 20 సెప్టెంబరు 1960
Flag of మలావి మలావి 1 డిసెంబరు 1964
Flag of మలేషియా మలేషియా[15] 17 సెప్టెంబరు 1957
Flag of మాల్దీవులు మాల్దీవులు 21 సెప్టెంబరు 1965
Flag of మాలి మాలి 28 సెప్టెంబరు 1960
Flag of మాల్టా మాల్టా 1 డిసెంబరు 1964
Flag of మార్షల్ దీవులు మార్షల్ దీవులు 17 సెప్టెంబరు 1991
Flag of మారిటేనియా మారిటేనియా 27 అక్టోబరు 1961
Flag of మారిషస్ మారిషస్ 24 ఏప్రిల్ 1968
Flag of మెక్సికో మెక్సికో 7 నవంబరు 1945
Flag of మైక్రొనీషియా మైక్రొనీషియా[16] 17 సెప్టెంబరు 1991
Flag of మాల్డోవా మాల్డోవా 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of మొనాకో మొనాకో 28 మే 1993
Flag of మంగోలియా మంగోలియా 27 అక్టోబరు 1961
Flag of మాంటినిగ్రో మాంటినిగ్రో 28 జూన్ 2006 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of మొరాకో మొరాకో 12 నవంబరు 1956
Flag of మొజాంబిక్ మొజాంబిక్ 16 సెప్టెంబరు 1975
Flag of మయన్మార్ బర్మా[17] 19 ఏప్రిల్ 1948
Flag of నమీబియా నమీబియా 23 ఏప్రిల్ 1990
Flag of నౌరూ నౌరూ 14 సెప్టెంబరు 1999
Flag of నేపాల్ నేపాల్ 14 డిసెంబరు 1955
Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 10 డిసెంబరు 1945
Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 24 అక్టోబరు 1945
Flag of నికరాగ్వా నికరాగ్వా 24 అక్టోబరు 1945
Flag of నైజర్ నైజర్ 20 సెప్టెంబరు 1960
Flag of నైజీరియా నైజీరియా 7 అక్టోబరు 1960
Flag of నార్వే నార్వే 27 నవంబరు 1945
Flag of ఒమన్ ఒమన్ 7 అక్టోబరు 1971
Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 30 సెప్టెంబరు 1947
Flag of పలావు పలావు 15 డిసెంబరు 1994
Flag of పనామా పనామా 13 నవంబరు 1945
Flag of పపువా న్యూగినియా పపువా న్యూగినియా 10 అక్టోబరు 1975
Flag of పరాగ్వే పరాగ్వే 24 అక్టోబరు 1945
Flag of పెరూ పెరూ 31 అక్టోబరు 1945
Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్[18] 24 అక్టోబరు 1945
Flag of పోలండ్ పోలండ్ 24 అక్టోబరు 1945
Flag of పోలండ్ పోలండ్ 14 డిసెంబరు 1955
Flag of కతర్ కతర్ 21 సెప్టెంబరు 1971
Flag of రొమేనియా రొమేనియా 14 డిసెంబరు 1955
Flag of రష్యా రష్యా[19] 24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of రవాండా రవాండా 18 సెప్టెంబరు 1962
Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 23 సెప్టెంబరు 1983
Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 18 సెప్టెంబరు 1979
Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 16 సెప్టెంబరు 1980
Flag of సమోవా సమోవా[20] 15 డిసెంబరు 1976
Flag of శాన్ మారినో శాన్ మారినో 2 మార్చి 1992
Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె‍ 16 సెప్టెంబరు 1975
Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 24 అక్టోబరు 1945
Flag of సెనెగల్ సెనెగల్ 28 సెప్టెంబరు 1960
Flag of సెర్బియా సెర్బియా 1 నవంబరు 2000 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 21 సెప్టెంబరు 1976
Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 27 సెప్టెంబరు 1961
Flag of సింగపూర్ సింగపూర్ 21 సెప్టెంబరు 1965
Flag of స్లొవాకియా స్లొవాకియా 19 జనవరి 1993 - "పాత చెకొస్లవేకియా" భాగస్వామి
Flag of స్లొవేనియా స్లొవేనియా 22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 19 సెప్టెంబరు 1978
Flag of సొమాలియా సొమాలియా 20 సెప్టెంబరు 1960
Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా[21] 7 నవంబరు 1945
Flag of స్పెయిన్ స్పెయిన్ 14 డిసెంబరు 1955
Flag of శ్రీలంక శ్రీ లంక[22] 14 డిసెంబరు 1955
Flag of సూడాన్ సూడాన్ 12 నవంబరు 1956
Flag of సూరీనామ్ సూరీనామ్ 4 డిసెంబరు 1975
Flag of స్వాజీలాండ్ స్వాజీలాండ్ 24 సెప్టెంబరు 1968
Flag of స్వీడన్ స్వీడన్ 19 నవంబరు 1946
Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 10 సెప్టెంబరు 2002
Flag of సిరియా సిరియా[23] 24 అక్టోబరు 1945 పాత "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్"కు చెందినది
Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of టాంజానియా టాంజానియా[24] 14 డిసెంబరు 1961 పాత "టాంగన్యీకా & జాంజిబార్" కు చెందినది
Flag of థాయిలాండ్ థాయిలాండ్[25] 16 డిసెంబరు 1946
Flag of తూర్పు టిమోర్ టిమోర్-లెస్టె 27 సెప్టెంబరు 2002
Flag of టోగో టోగో 20 సెప్టెంబరు 1960
Flag of టోంగా టోంగా 14 సెప్టెంబరు 1999
Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 18 సెప్టెంబరు 1962
Flag of ట్యునీషియా ట్యునీషియా 12 నవంబరు 1956
Flag of టర్కీ టర్కీ 24 అక్టోబరు 1945
Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of తువాలు తువాలు 5 సెప్టెంబరు 2000
Flag of ఉగాండా ఉగాండా 25 అక్టోబరు 1962
Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్[26] 24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9 డిసెంబరు 1971
Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్[27] 24 అక్టోబరు 1945
Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు[28] 24 అక్టోబరు 1945
Flag of ఉరుగ్వే ఉరుగ్వే 18 డిసెంబరు 1945
Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Flag of వనువాటు వనువాటు 15 సెప్టెంబరు 1981
Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా[29] 15 నవంబరు 1945
Flag of వియత్నాం వియత్నాం[30] 20 సెప్టెంబరు 1977
Flag of యెమెన్ యెమెన్ 30 సెప్టెంబరు 1947 - ఇంతకు ముందు "ఉత్తర యెమెన్", "దక్షిణ యెమెన్"లుగా ఉండేది
Flag of జాంబియా జాంబియా 1 డిసెంబరు 1964
Flag of జింబాబ్వే జింబాబ్వే 25 ఆగస్టు 1980

      Indicates original member

[మార్చు] పాత సభ్యులు

[మార్చు] చెకొస్లవేకియా

Flag of చెకొస్లొవేకియా చెకొస్లవాకియా 24 అక్టోబరు 1945లో ఐ.రా.స.లో చేరింది. 10 డిసెంబరు 1992న చెకొస్లవేకియా ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తమ దేశం 31 డిసెంబరు 1992నుండి విడిపోతున్నదని, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా దేశాలు విడివిడిగా సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంటాయని తెలిపింది. 19 జనవరి 1993లో అవి ఐ.రా.స.లో చేరాయి.

[మార్చు] తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ

Flag of తూర్పు జర్మనీ జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ (తూర్పు జర్మనీ), Flag of పశ్చిమ జర్మనీ Federal Republic of Germany (పశ్చిమ జర్మనీ)లు 18 సెప్టెంబరు 1973లో ఐ.రా.స.లో చేరాయి. 3 అక్టోబరు 1990న ఇవి రెండూ ఐక్యమయ్యాయి. అప్పటినుండి ఆ దేశం పేరు జర్మనీ.

[మార్చు] టాంగన్యీకా, జాంజిబార్

మూస:Country data Tanganyika టాంగన్యీకా 14 డిసెంబరు 1961న ఐ.రా.స.లో చేరింది. మూస:Country data Zanzibar జాంజిబార్ 16 డిసెంబరు 1963న ఐ.రా.స.లో చేరింది. ఈ రెండు దేశాలూ United Republic of Tanganyika and Zanzibar గా 26 ఏప్రిల్ 1964న ఐక్యమయ్యాయి. తరువాత ఈ ఐక్యదేశంటాంజానియా (United Republic of Tanzania)గా 1 నవంబరు 1964న పేరు మార్చుకొంది.

[మార్చు] యునైటెడ్ అరబ్ రిపబ్లిక్

24 అక్టోబరు 1945న ఈజిప్ట్, సిరియాలు ఐ.రా.స.లో ఆరంభ సభ్యులుగా చేరాయి. ఈ రెండు దేశాలూ మూస:Country data United Arab Republic సంయుక్త అరబ్ రిపబ్లిక్ (United Arab Republic) అన్న పేరుతో 21 పిబ్రవరి 1958న ఐక్యమై ఒకే సభ్యదేశంగా 13 అక్టోబరు 1961వరకు కొనసాగాయి. తరువాత సిరియా మళ్ళీ స్వతంత్ర దేశంగా తన ప్రత్యేక స్థానాన్ని తిరిగి తీసుకొంది. ఈజిప్ట్ మాత్రం United Arab Republic గా 2 సెప్టెంబరు 1971వరకు కొనసాగింది. తరువాత "ఈజిప్ట్" అన్న పాతపేరును పునరుద్ధరించుకొంది.

[మార్చు] సోవియట్ యూనియ్

మూస:Country data Soviet Union సోవియట్ యూనియన్ (USSR), 1945లో ఐ.రా.స.ని ప్రారంభించిన ఐదు దేశాలలో ఒకటి. 24 అక్టోబరు 1945నుండి ఆరంభ సభ్యదేశంగా ఉంది. 24 డిసెంబరు 1991న సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం నిశ్చయమని తెలిశాక, సోవియట్ యూనియన్ సీటు రష్యాకు సంక్రమిస్తున్నదని రష్యా ప్రెసిడెంట్ బోరిస్ యెల్త్సిన్, ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తెలియజేశాడు. Commonwealth of Independent States లోని 11 సభ్య దేశాల ఆమోదంతో భద్రతా సభలోని సోవియట్ యీనియన్ సీటు కూడా రష్యాకు వచ్చింది .

మిగిలిన సోవియట్ యూనియన్ వారసత్వ దేశాలు:

[మార్చు] ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్

మూస:Country data North Yemen యెమెన్ (ఉత్తర యెమెన్)30 సెప్టెంబరు 1947 నుండి "ముతవాక్కిలిత్ యెమెన్ రాజ్యం" (Mutawakkilite Kingdom of Yemen) అన్న పేరుతో సభ్యత్వం కలిగి ఉంది. తరువాత "యెమెన్ అరబ్ రిపబ్లిక్" (Yemen Arab Republic)గా పేరు మార్చారు. . మూస:Country data South Yemen ప్రజాస్వామ్య యెమెన్ (దక్షిణ యెమెన్) "Southern Yemen" లేదా "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ యెమెన్" గా 14 డిసెంబరు 1967న చేరింది. 22 మే 1990న ఈ రెండు దేశాలు యెమెన్ లేదా "యెమెన్ రిపబ్లిక్"గా విలీనం అయ్యాయి.

[మార్చు] యుగొస్లావియా

మూస:Country data Yugoslavia యుగొస్లావియా 24 అక్టోబరు 1945న ఆరంభ సభ్య దేశంగా ఐ.రా.స.లో చేరింది. అప్పుడు దాని పేరు "డెమొక్రాటిక్ ఫెడరల్ యుగొస్లావియా". తరువాత "సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా పేరు మార్చుకుంది. 1992లో ఈ దేశం విచ్చిన్నం అయ్యింది. అందులో భాగాలైన "సెర్బియా", "మాంటినిగ్రో" రిపబ్లిక్‌లు "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా 28 ఏప్రిల్ 1992న అవతరించాయి. సాధారణ సభ తీర్మానం A/RES/47/1 ప్రకారం 22 సెప్టెంబరు 1992న ఈ క్రొత్త దేశం పాత యుగొస్లావియా సభ్యత్వాన్ని వారసత్వంగా తీసుకోవడం ఆమోదయోగ్యం కాదు. కనుక Federal Republic of Yugoslavia (Serbia and Montenegro) వేరే సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది.

యుగొస్లావియా విచ్ఛిన్నం అయినందువలన ఏర్పడిన దేశాలన్నీ ప్రస్తుతం ఐ.రా.స. సభ్యులు:

[మార్చు] చైనా, తైవాన్‌ల సీటు

చైనా - Flag of తైవాన్ చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) - 24 అక్టోబరు 1945 నుండీ ఐ.రా.స. ప్రారంభించిన సభ్యదేశాలలో ఒకటి. అయితే చైనా అంతర్యుద్ధం కారణంగా "కూమింటాంగ్" అధీనంలో ఉన్న ప్రభుత్వం 1949లో తైవాన్‌కు వలసపోయింది. "కమ్యూనిస్టు" పాలన చైనా ప్రధాన భూభాగంలో నెలకొన్నది. Flag of చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC), 1 అక్టోబరు 1949న తమదే సంపూర్ణ చైనా అని ప్రకటించారు. కూమింటాంగ్ చైనా చాలా చిన్న దీవులలో పాలన సాగిస్తున్నా గాని, మొత్తం చైనాకు ప్రతినిధిగా ఐ.రా.స.లో 1971 వరరకు కొనసాగింది. చైనా ప్రధాన భూభాగం పై అధిపత్యం కలిగిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి మాత్రం ఐ.రా.స.లో ప్రాతినిధ్యం లేదు. 25 అక్టోబరు 1971న జరిగిన తీర్మానం (UN General Assembly Resolution 2758) "రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)కు ఉన్న ప్రాతినిధ్యాన్ని తొలగించి "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా"కు చైనా ఏకైక ప్రతినిధిగా గుర్తింపు లభించింది. దీనితో "తైవాన్"కు ఐ.రా.స.లో స్థానం తొలగిపోయినట్లే.

1990 తరువాత తమకు సభ్యత్వం (లేదా కనీసం పరిశీలక హోదా) కావాలని తైవాన్ ఎంతో ప్రయత్నించింది కాని వీటో హోదా ఉన్న చైనా అందుకు వ్యతిరేకంగా ఉన్నందున ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం పాలస్తీనా, వేటికన్‌లకు ఉన్న పరిశీలక హోదా కూడా తైవాన్‌కు లభించలేదు.

[మార్చు] పరిశీలకులు

ఈ క్రింది వాటికి అబ్సర్వర్ (పరిశీలకులు) హోదా ఉన్నది.

The sovereignty status of పశ్చిమ సహారా is in dispute between మొరాకో and the Polisario Front. Most of the territory is administered by Morocco, the remainder (the Free Zone) by the Sahrawi Arab Democratic Republic (SADR), proclaimed by the Polisario Front. The SADR is a full member of the African Union, but is neither a member nor observer of the UN.

The associated states of న్యూజిలాండ్, the కుక్ దీవులు and నియూ, while self-governing in their domestic affairs, have their foreign affairs represented by New Zealand, and are not UN members.

Many international organizations, non-governmental organizations, and entities whose statehood or sovereignty are not precisely defined, such as the యూరోపియన్ యూనియన్, the International Committee of the Red Cross, and the Sovereign Military Order of Malta, are invited to become observers at the General Assembly.

[మార్చు] వివిధ పేర్లు, గమనికలు

  1. బెలారస్ అనేది మొదట "బైలో రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్"గా ఐ.రా.స.లో చేరింది. ఐతే 1991లో ఈ దేశం సోవియట్ యూనియన్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్నది. తరువాత ఆ దేశం పేరు "బైలోరష్యా" నుండి "బెలారస్"గా 19 సెప్టెంబరు 1991 నుండి మార్చుకున్నది.
  2. బెనిన్ ముందు పేరు "డాహొమీ". 1975లో పేరు మార్చుకున్నది.
  3. బ్రూనే ప్రస్తుత నామం "బ్రూనే దారుస్సలామ్".
  4. బుర్కీనా ఫాసో క్రితం పేరు "ఎగువ వోల్టా", 1984లో పేరు మార్చుకొన్నది.
  5. Cameroon పాత పేరు "Cameroun". ఐతే 1961లో Southern Cameroonsతో విలీనం అయినాక Cameroon నామం స్థిరపడింది.
  6. The కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ పూర్వనామం "కాంగో (లెపోల్డ్విల్లి)". తరువాత 1964లో "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్" గా పేరు మార్చుకొంది. 1971లో "జైర్"గా పేరు మార్చుకుంది. మళ్ళీ 17 మే 1997లో ఇప్పటి "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్"గా పేరు మార్చికుంది.
  7. The కాంగో రిపబ్లిక్ సభ్య నామం "కాంగో". ముందుగా చేరినప్పుడు దీనిపేరు "కాంగో (బ్రజ్జావిల్లి)".
  8. Côte d'Ivoire అని పేరు మార్పు 1985లో జరిగింది. అంతకు మందు సభ్యత్వం తీసుకొన్నప్పటి పేరు "Ivory Coast".
  9. ఇండొనీషియా 20 జనవరి 1965న మలేషియతో విభేదాల కారణంగా, మలేషియాని భద్రతా సభలో అశాశ్వత సభ్య దేశంగా ఎన్నకొన్నందకు నిరసనగా, తాత్కాలికంగా ఈ.రా.స. నుండి నిష్క్రమించింది. మరలా ఐ.రా.స.లో పాల్గొనడానికి 19 సెప్టెంబరు 1966లో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. (to resume full cooperation with the United Nations and to resume participation in its activities) - మరలా సభ్యునిగా చేరమని ఐ.రా.స. ఆహ్వానించగా 28 సెప్టెంబరు 1966న సభ్యునిగా చేరింది.
  10. ఇరాన్ ప్రస్తుత సభ్యనామం "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్".
  11. ఉత్తర కొరియా: జనవరి 1, 2007 నుండి సస్పెండ్ చేయబడింది.
  12. లావోస్ సభ్యనామం "లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్".
  13. లిబ్యా సభ్యనామం "లిబ్యన్ అరబ్ జమాహ్రియా".
  14. The రిపబ్లిక్ ఆఫ్ మేసిడోనియా సభ్యనామం "గత యుగొస్లావియా మేసిడోనియా రిపబ్లిక్" (The former Yugoslav Republic of Macedonia) - గ్రీస్తో ఈ విషయమై వివాదం ఉన్నది.
  15. మలేషియా చేరినప్పటి పేరు "ఫెడరేషన్ ఆఫ్ మలేషియా". తరువాత 16 సెప్టెంబరు 1963న, సింగపూర్, సబాహ్, సరావాక్లు మలేషియా ఫెడరేషన్లో చేరిన తరువాత, దేశం పేరు "మలేషియా" అని మార్చబడింది. 9 ఆగస్టు 1965న సింగపూర్ స్వతంత్ర దేశం అయ్యింది.
  16. మైక్రొనీషియా సభ్యనామం "ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనీషియా" (Micronesia, Federated States of).
  17. మయన్మార్ పూర్వనామం "బర్మా". 1989లో పేరు మార్పిడి జరిగింది.
  18. ఫిలిప్పిన్స్ ఐ.రా.స.లో చేరినప్పటి పేరు "కామన్వెల్త్ ఆఫ్ ఫిలిప్పీన్స్" (Commonwealth of the Philippines)". 1946లో పూర్తి స్వాతంత్ర్యం పొందింది.
  19. రష్యా సభ్యనామం "రష్యన్ ఫెడరేషన్" (Russian Federation).
  20. సమోవా పాతపేరు "పశ్చిమ సమోవా" (Western Samoa). 1997లో పేరు మార్పిడి జరిగింది.
  21. దక్షిణ ఆఫ్రికా పాత పేరు "యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా" 1961లో పేరు మార్పిడి జరిగింది.
  22. శ్రీలంక పాతపేరు "సిలన్" (Ceylon). 1972లో పేరు మార్పిడి జరిగింది.
  23. సిరియా సభ్యనామం "సిరియన్ అరబ్ రిపబ్లిక్" (Syrian Arab Republic).
  24. టాంజానియా సభ్యనామం "టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్" (United Republic of Tanzania).
  25. థాయిలాండ్ మొదటిపేరు "సయామ్". 1949లో పేరు మార్పిడి జరిగింది.
  26. ఉక్రెయిన్ మొదటిపేరు "ఉక్రెయినియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్". 1991లో పేరు మార్పిడి జరిగింది.
  27. యునైటెడ్ కింగ్డమ్ సభ్యనామం "యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్" (United Kingdom of Great Britain and Northern Ireland).
  28. సభ్యనామం "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" (United States of America).
  29. వెనిజ్వెలా సభ్యనామం "బొలీవియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజ్వెలా" (Venezuela, Bolivarian Republic of).
  30. వియత్నాం సభ్యనామం "వియత్ నామ్" (Viet Nam).

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

మూస:United Nations మూస:Lists by country

మూస:Featured list

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు