దొంగలు బాబోయ్ దొంగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగలు బాబోయ్ దొంగలు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం ఘట్టమనేని కృష్ణ, రాధ, అంజలి దేవి
నిర్మాణ సంస్థ తిరుమూర్తి & శశిరేఖ ఫిల్మ్స్
భాష తెలుగు

దొంగలు బాబోయ్ దొంగలు 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రాధ, అంజలి దేవి నటించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

కథ[మార్చు]

రామలక్ష్మణులిద్దరూ కవల పిల్లలు. తల్లి శిక్షణలో రాముడు మంచి బాలుడిగా పెరిగి ఎలెక్ట్రానిక్స్ ప్రొఫెసర్‌గా మంచి పేరు తెచ్చుకుంటాడు. తల్లికి, సోదరుడికి దూరమై తండ్రి వద్ద పెరిగిన కృష్ణ తండ్రిలాగే దొంగగా తాగుబోతుగా తయారవుతాడు. కవల పిల్లలయినందుకేనేమో కృష్ణుడు తాగితే రాముడికి కూడా మత్తు వస్తుంది. అదే రీతిగా కృష్ణుడి చేష్టలు రాముడిపై ప్రభావం చూపుతుంది. ధన దాహం కల దామోదరం మిత్రుడు దుర్గాప్రసాద్ ఆధీనంలో ఉన్న అపార ధనరాశులను హస్తగతం చేసుకోవాలను కుంటాడు. అది పసిగట్టిన ప్రసాద్ దామోదరం చేత పిస్టల్ దెబ్బ తిని ధనాన్ని దాచిన భూగృహంలోకి పారిపోగానే యాంత్రిక ఎలెక్ట్రానిక్ తలుపు మూసుకుపోతుంది. విదేశాలనుండి తిరిగి వచ్చిన ప్రసాద్ కూతురు సత్య ద్వారా తలుపు తెరిచే రహస్యం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్న దామోదరం, తండ్రిని పోగొట్టుకున్న కృష్ణ ద్వారా తన పనిని సాధించాలనుకుంటాడు. సత్యతో రాముడికి, తండ్రికి దూరంగా పెరుగుతున్న దామోదరం కూతురు స్వరాజ్యంతో కృష్ణుడికి పరిచయాలు ఏర్పడతాయి. కవలల కలయిక, తలుపులు తెరుచుకునే విధానం, ఎలెక్ట్రానిక్ యంత్రమానవులు, కారు చేసే విన్యాసాలు తరువాతి కథ[1].

పాటల జాబితా[మార్చు]

1: తాగిన మైకంలో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జీ.ఆనంద్, రచన: కొసరాజు

2: ఓయీ మగడా, గానం.పులపాక సుశీల , రచన: సి.నారాయణ రెడ్డి

3: ఒసోసి కుర్రదాన , గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , రచన: గోపీ

4: నీలోన నాలోన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల , రచన: ఆరుద్ర

5: నేనంటే నే ఏమో అన్నావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ., రచన: సి.నారాయణ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. కె.రంగారావు (14 December 1984). "చిత్రసమీక్ష:దొంగలు బాబోయ్ దొంగలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 7 November 2018.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]