దోమాడ చిట్టబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోమాడ చిట్టబ్బాయి
వ్యక్తిగత సమాచారం
జననం(1933-05-09)1933 మే 9
మరణం2002 జూలై 2(2002-07-02) (వయసు 69)
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ సంగీతం
వాయిద్యాలునాదస్వరం

దోమాడ చిట్టబ్బాయి (మే 9, 1933,[1] - జూలై 2, 2002) ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు తూర్పు గోదావరి జిల్లా బొలిపాలెం గ్రామంలో చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు 1933 ఆగష్టు 1న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. ఈయన మేనమామ పసుపతి వెంకట్రావు చిట్టబ్బాయికి నాదస్వరాన్ని పరిచయం చేశాడు. సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు పసుపులేటి వెంకట్రావు, నేదునూరి కృష్ణమూర్తి, దాలిపర్తి పిచ్చయ్యల వద్ద నాదస్వర విద్యాభ్యాసంలో శిక్షణ పొందారు.

చిట్టబ్బాయి ఆ తర్వాత రేడియో, దూరదర్శన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రముఖ గ్రామఫోన్, రికార్డింగ్ కంపెనీలకు క్యాసెట్లు, డిస్కులు రికార్డు చేశాడు. వివిధ ప్రముఖ సంగీత కళా సంస్థలనుండి “సునాద ప్రవీణ”, “కళాసరస్వతి”, “ఆంధ్రరత్న”, “సంగీత కళాసాగర” మొదలైన బిరుదులు పొందాడు. 1990లో ఆంధ్రవిశ్వవిద్యాలయం చిట్టబ్బాయిని గౌరవ డాక్టరేటు డిగ్రీ కళాప్రపూర్ణతో సత్కరించింది. సింహాచలంలోని శ్రీవరాహ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఆస్థాన విద్వాంసునిగా ఒక దశాబ్దకాలంపాటు పనిచేశాడు. 1990 దశకం చివరలో క్రియాశీల ప్రజాజీవితంనుండి వైదొలగే ముందు శ్రీ వెంకటేశ కళాపీఠంలో కూడా పనిచేశాడు.[2] 1995లో సంగీత నాటక అకాడెమీ యొక్క కర్ణాటక వాద్య సంగీత విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.[3]

నాదస్వర వాద్యంలో ఎంతో కీర్తి గడించిన చిట్టబ్బాయి 2002 జూలై 2న పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-03-24. Retrieved 2009-06-02.
  2. Obituary - Domada Chittabbai Archived 2011-08-11 at the Wayback Machine Sify.com
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-14. Retrieved 2020-01-15.