ద్రవాభిసరణం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Effect of different solutions on blood cells
Plant cell under different environments

ఒక విలీన ద్రావణం నుంచి ఒక గాడ ద్రావణం ఒక అర్థపారదర్శకపు పొరచేత వేరుచేయబడినపుడు విలీన ద్రావణం నుంచి నీరు గాఢ ద్రావణంలోకి ప్రవహించడాన్ని ద్రవాభిసరణం (Osmosis) అంటారు. ఇది ఒక విధమైన భౌతిక చర్య.

అర్థపారగమ్యపు పొర[మార్చు]

ఒక ద్రావణంలోని రెండు అనుఘటకాలలో (ద్రావితం లేదా ద్రావణి) ఏదో ఒకదానిని మాత్రమే తన ద్వారా పోనిచ్చే పొరను అర్థపారగమ్యపు పొర (semipermeable membrane) అంటారు. ఇటువంటి పొరలలో చాలా రకాలున్నాయి. సెల్లోఫేన్ కాగితాలు, జంతువుల తిత్తులు, జంతుకణపొరలు, వృక్షకణపొరలు ఇందుకు భౌతిక ఉదాహరణలు. కాపర్ ఫెర్రో సయనైడ్, ప్రష్యన్ బ్లూ, కాల్షియమ్ ఫాస్ఫేట్ లు అనే రసాయన సంయోగ పదార్ధాలు రసాయనిక పారగమ్యపు పొరలకు ఉదాహరణలు.

ద్రవాభిసరణ పీడనం[మార్చు]

Semipermeable membrane

ఒక విలీన ద్రావణం, గాడ ద్రావణం నుంచి అర్థపారదర్శకపు పొరచేత చేరుచేయబడినప్పుడు సమతాస్థితి (Equilibrium) దశ వద్ద ఏర్పడిన జలస్థితిక పీడనం (Hydrostatic pressure) సంఖ్యాపరంగా ద్రవాభిసరణ పీడనానికి (Osmotic pressure) సమానంగా ఉంటుంది. కాబట్టి గాఢ ద్రావణంలోకి ద్రావణి (నీరు) ప్రవహించడానికి ద్రవాభిసరణ పీడనం కారణమని, ద్రావణం పైన ఏర్పడిన జలస్థితిక పీడనం లోపలి ప్రవాహాన్ని నివారిస్తుందని తెలుస్తుంది. ఫలితంగా ద్రవాభిసరణ పీడనం జలస్థితిక పీడనానికి సమానమైనపుడు ద్రావణిలోనికి ప్రవహించడం ఆగిపోతుంది.

వైద్యశాస్త్రంలో[మార్చు]

  • డయాలిసిస్ అనే ప్రక్రియలో రక్తం లోని మలినాలను తొలగించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.
  • స్ఫీరోసైటోసిస్ అనే రక్తహీనతలో రక్తకణాల త్వచం యొక్క నిర్మాణ లోపం ములంగా అవి తొందరగా పగిలిపోతాయి.