ద్రవీకృత పెట్రోలియం వాయువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
LPG cylinders.JPG

ద్రవీకృత పెట్రోలియం వాయువు (దీనిని LPG , GPL , LP గ్యాస్ , లేదా ఆటోగ్యాస్ అని కూడా పిలుస్తారు) అనేది ఒక జ్వలనశీల హైడ్రోకార్బన్ వాయువుల మిశ్రమం, దీనిని తాపన పరికరాలు మరియు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు, ఓజోన్ పొరకు నష్టాన్ని తగ్గించేందుకు క్లోరోఫ్లోరోకార్బన్‌ల స్థానంలో దీనిని ఏరోసోల్ ప్రొపెలాంట్ (ఏరోసోల్ చోదక పదార్థం) మరియు రిఫ్రిజెరాంట్ (శీతజనకం)గా ఉపయోగించడం పెరుగుతోంది.

కొనుగోలు చేసే మరియు విక్రయించే LPG రకాల్లో ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ వాయువులను కలుపుతారు, మరింత సాధారణంగా కాలాన్నిబట్టి ప్రొపేన్ C3H8 (60%) మరియు బ్యూటేన్ C4H10 (40%) వాయువుల మోతాదును నిర్ణయిస్తారు– శీతాకాలంలో అయితే ఎక్కువ ప్రొపేన్‌ను, వేసవికాలంలో అయితే బ్యూటన్‌ను ఎక్కువగా కలుపుతారు. సాధారణంగా అతికొద్ది మోతాదులో ప్రొపైలిన్ మరియు బ్యూటైలిన్ కూడా ఉంటాయి. వాయువు బయటకు వెలువడటాన్ని సులభంగా గుర్తించేందుకు గాఢమైన వాసనగల వాయువు ఈథేనేథైల్‌ను కూడా దీనికి కలుపుతారు. దీని యొక్క అంతర్జాతీయ ప్రమాణం EN 589. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, థియోఫీన్ లేదా అమైల్ మెర్సాప్టాన్‌లు కూడా గాఢమైన వాసనగల వాయువులుగా (గంధిలాలు) ఆమోదం పొందాయి.

LPG అనేది గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న అతితక్కువ కార్బన్‌ను ఉద్గారించే హైడ్రోకార్బన్ ఇంధనం, ఇది చమురు కంటే kWhకు 19 శాతం తక్కువ, బొగ్గుకంటే 30 శాతం తక్కువ, గ్రిడ్‌తో (స్తంభాల ఆధారిత) సరఫరా చేసే బొగ్గు-ఆధారిత విద్యుత్‌తో పోలిస్తే 50 శాతానికిపైగా తక్కువ CO
2
ను ఉద్గారిస్తుంది.[citation needed] ప్రొపేన్ మరియు బ్యూటేన్ మిశ్రమమైన LPG ప్రతి జౌల్‌కు బ్యూటేన్ కంటే తక్కువ కార్బన్‌ను, ప్రతి జౌల్‌కు ప్రొపేన్ కంటే ఎక్కువ కార్బన్‌ను ఉద్గారిస్తుంది.

ఉత్పత్తి మరియు నిల్వ[మార్చు]

శుద్ధి చేస్తున్న పెట్రోలియం లేదా 'తడి' సహజ వాయువు సంశ్లేషణ చెందడం ద్వారా LPG ఉత్పత్తి చేయబడుతుంది, సాధారణంగా శిలాజ ఇంధన వనరుల నుంచి దీనిని సేకరిస్తారు, ముడి చమురును శుద్ధి చేస్తున్న సందర్భంగా కూడా ఇది తయారవుతుంది లేదా భూగర్భం నుంచి వెలువడతాయి కాబట్టి, చమురు లేదా వాయువు ప్రవాహాలు నుంచి దీనిని సేకరించవచ్చు. Dr.వాల్టర్ స్నెల్లింగ్ 1910లో దీనిని తొలిసారి తయారు చేశారు, దీనిని ఉపయోగించిన మొదటి వ్యాపార ఉత్పత్తులు 1912లో కనిపించాయి. ఇది ప్రస్తుతం 3% ఇంధన అవసరాలను తీరుస్తుంది, ఎటువంటి మసి లేకుండా ఇది పూర్తిగా మండుతుంది, అతికొద్ది గంధక ఉద్గారాలకు కారణమవుతుంది, దీని వినియోగం వలన ఎటువంటి భూమి లేదా నీటి కాలుష్య ప్రమాదాలు ఏర్పడవు. LPG కాలోరిఫిక్ వాల్యూ (తాపన విలువ) 46.1 MJ/kg వద్ద ఉండగా, డీజిల్‌కు 42.5 MJ/kg, ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ (గ్యాసోలిన్)కు అయితే 43.5 MJ/kg తాపన విలువ ఉంటుంది.[1] అయితే, దీని శక్తి సాంద్రత ఒక వాల్యూమ్ యూనిట్‌కు 26 MJ/l మాత్రమే ఉంటుంది, ఇది పెట్రోల్ లేదా డీజిల్ రెండింటి కంటే తక్కువ.

సాధారణ ఉష్ణోగ్రత మరియు పీడనాలు వద్ద LPG ఆవిరైపోతుంది. ఈ కారణంగా, LPGని అధిక పీడన ఉక్కు సీసాల్లో సరఫరా చేస్తారు. నియంత్రిత ద్రవం యొక్క ఉష్ణ విస్తరణకు వీలు కల్పించేందుకు, ఈ సీసాలను పూర్తిగా నింపరు; సీసాలను వాటి యొక్క పూర్తి సామర్థ్యంలో 80% మరియు 85% మధ్య మాత్రమే నింపుతారు. బాష్పీకృత వాయువు మరియు ద్రవీకృత వాయువు పరిమాణాలు మధ్య నిష్పత్తి మిశ్రమం, పీడనం మరియు ఉష్ణోగ్రతలపై ఆధారపడి మారుతూ ఉంటుంది, ఈ నిష్పత్తి సుమారుగా 250:1 ఉంటుంది. LPG ద్రవరూపంలోకి మారే పీడన స్థాయిని దాని యొక్క బాష్ప పీడనంగా పిలుస్తారు, ఇది కూడా మిశ్రమం మరియు ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది; ఉదాహరణకు, 20 °C (68 °F) వద్ద స్వచ్ఛమైన బ్యూటేన్‌కు ఇది సుమారుగా 220 kilopascals (2.2 bar) ఉంటుంది, 55 °C (131 °F) వద్ద స్వచ్ఛమైన ప్రొపేన్‌కు బాష్ప పీడనం సుమారుగా 2.2 megapascals (22 bar) ఉంటుంది. గాలి కంటే LPG ఎక్కువ బరువు కలిగివుంటుంది, అందువలన ఇది భూమిపై భాగాల్లో ప్రవహించడంతోపాటు, నేలమాళిగల వంటి దిగువ భాగాల్లో స్థిరపడుతుంది. దీనిని సరిగా నిర్వహించనట్లయితే, ఇది జ్వలనాలు లేదా శ్వాసావరోధనలకు కారణమవుతుంది.

భారీ పరిమాణాల్లో LPGని పెద్ద ట్యాంకుల్లో నిల్వ చేయవచ్చు, అవసరమైతే దానిని భూగర్భంలో కూడా భద్రపరచవచ్చు. ప్రత్యామ్నాయంగా, గ్యాస్ సిలిండర్లను కూడా ఉపయోగించవచ్చు.

ఉపయోగాలు[మార్చు]

మోటారు ఇంధనం[మార్చు]

Lpg-connector.jpg

అంతర్ దహన ఇంజిన్‌లకు ఇంధనంగా LPGని ఉపయోగించినప్పుడు, దీనిని తరచుగా ఆటోగ్యాస్ లేదా ఆటో ప్రొపేన్‌గా సూచిస్తున్నారు. కొన్ని దేశాల్లో, 1940వ దశకం నుంచి పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా అగ్నికణ జ్వలన యంత్రాలకు (స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్లు) ఇంధనంగా ద్రవీకృత పెట్రోలియం వాయువు (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)ను ఉపయోగిస్తున్నారు. LPG-డీజిల్ ఇంధన మిశ్రమాలను ఇటీవల రెండు అధ్యయనాలు పరిశీలించాయి, ఈ మిశ్రమాల ఉపయోగం వలన పొగ ఉద్గారాలు మరియు ఇంధన వినియోగం తగ్గినట్లు, HC ఉద్గారాలు పెరిగినట్లు ఈ అధ్యయనాల్లో గుర్తించారు.[2][3] CO ఉద్గారాలపై ఈ అధ్యయనాలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చాయి, ఒక అధ్యయనం ఈ ఉద్గారాల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించగా,[2] మరొక అధ్యయనం కనిష్ట ఇంజిన్ లోడ్ వద్ద కొద్దిస్థాయి పెరుగుదలను, గరిష్ట ఇంజిన్ లోడ్ వద్ద ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించింది.[3] విషరహిత, క్షయరహిత పదార్థం కావడంతోపాటు, టెట్రా-ఈథైల్ లెడ్ లేదా ఇతర సహమిశ్రమాలు కలిగివుండకపోవడం, అధిక ఆక్టేన్ రేటింగ్ (108 RON) దీని యొక్క ప్రయోజనాలుగా చెప్పవచ్చు. పెట్రోల్ లేదా డీజిల్ కంటే పూర్తిస్థాయిలో ఇది కాలుతుంది, ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్‌ను మండించినప్పుడు వెలువడే సూక్ష్మ కాలుష్య పదార్థాలు దీనిని మండించినప్పుడు వెలువడవు.

పెట్రోల్ లేదా డీజిల్ కంటే LPG కనిష్ట శక్తి సాంద్రత కలిగివుంటుంది, అందువలన సరిసమాన ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ లేదా డీజిల్ కంటే LPGపై అనేక దేశాల ప్రభుత్వాలు తక్కువ పన్ను విధిస్తున్నాయి, పెట్రోల్ లేదా డీజిల్ కంటే LPG వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి చర్యలు చేపడతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న మోటారు ఇంధనాల్లో ప్రొపేన్ మూడో స్థానంలో ఉంది. 2008 అంచనాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల వాహనాలు ప్రొపేన్ వాయువును ఇంధనంగా ఉపయోగిస్తున్నాయి. వాహన ఇంధన రూపంలో ఏడాదికి 20 మిలియన్ టన్నులకుపైగా (7 బిలియన్ US గ్యాలన్లకుపైగా) ఈ వాయువు ఉపయోగించబడుతుంది.

శీతలీకరణం[మార్చు]

ఆఫ్-ది-గ్రిడ్ రిఫ్రిజిరేషన్ (శీతలీకరణం)ను అందించడంలో LPG క్రియాశీల పాత్ర పోషిస్తోంది, సాధారణంగా వాయు శోషణ శీతలీకరణ యంత్రంలో దీనిని ఉపయోగిస్తున్నారు.

స్వచ్ఛమైన, పొడి "ఐసోప్రొపేన్" (రిఫ్రిజెరాంట్ డిజిగ్నేటర్ R-290a ) మరియు ఐసోబ్యూటేన్ (R-600a) మిశ్రమాలు ఓజోన్ పొరకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేనంత అతి తక్కువ నష్టాన్ని కలగజేస్తాయి, అంతేకాకుండా అతితక్కువ భూతాప సంభావ్యతను కలిగివుంటాయి, సంప్రదాయ స్థిర శీతలీకరణ యంత్రాలు మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల్లో R-12, R-22, R-134a,మరియు ఇతర క్లోరోఫ్లోరోకార్బన్‌ లేదా హైడ్రోఫ్లోరోకార్బన్ రిఫ్రిజెరాంట్‌లకు ప్రయోజనాత్మక ప్రత్యామ్నాయులుగా ఇవి ఉపయోగపడతాయి.[4]

ప్రాథమికంగా జలనశీలేతర రిఫ్రిజెరాంట్‌ను ఉపయోగించేందుకు తయారు చేయబడిన ఈ వ్యవస్థల్లో జ్వలనశీల హైడ్రోకార్బన్‌లు ఉపయోగించడం వలన మంటలు లేదా పేలుడు సంభవించే సంభావ్యత బాగా ఎక్కువగా ఉంటుంది, అందువలన మోటారు వాహన ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల్లో ఇటువంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడాన్ని ఎక్కువగా నిషేధించడం లేదా నిరుత్సాహపరచడం జరుగుతోంది.[5][6][7][8][9][10][11][12]

అయితే హైడ్రోకార్బన్‌లు నింపిన వాహన ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల్లో ఇటువంటి ప్రమాదాల సంఖ్య అతి కొద్దిస్థాయిలోనే ఉండటంతో.. హైడ్రోకార్బన్ రిఫ్రిజెరాంట్‌ల వ్యాపారులు మరియు మద్దతుదారులు ఇటువంటి నిషేధాలను వ్యతిరేకిస్తున్నారు.[13][14] యూనివర్శిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్‌కు చెందిన ఒక అధ్యాపకుడి నేతృత్వంలో ప్రయాణికులు ఉండే వాహన భాగంలోకి ఆకస్మికంగా మరియు పూర్తిస్థాయిలో రిఫ్రిజెరాంట్ ప్రవేశించడం ద్వారా జరిగే నష్టం, తరువాత సంభవించిన జ్వలనం కారణంగా ఏర్పడే అత్యంత దారుణమైన పరిస్థితిని పరిశీలించేందుకు ఒక పరీక్ష నిర్వహించబడింది. కారులో ఉన్న ఆయనకు మరియు పలువురు ఇతరులకు ముఖం, చెవులు, చేతులపై చిన్నపాటి గాయాలయ్యాయి, ముందువైపు ఉన్న ప్రయాణికుల కిటికీ అద్దం పగిలిపోవడంతో పరీక్షను చూస్తున్న అనేక మంది పరిశీలకులకు చర్మం తెగి చిన్న గాయాలయ్యాయి. వీరిలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు.[15]

వంట[మార్చు]

సింగపూర్‌లో గృహ వినియోగదారులకు LPG సిలిండర్లు సరఫరాచేసే వాహనం.

2001 భారత్ జనాభా లెక్కలు ప్రకారం, 2001లో 17.5% భారతీయ గృహాలు లేదా 33.6 మిలియన్ల భారతీయ గృహాలు LPGని వంట ఇంధనంగా ఉపయోగిస్తున్నాయి.[16] దీనిని ఉపయోగిస్తున్న 76.64% గృహాలు పట్టణ భారతదేశంలోనే ఉన్నాయి, అంటే పట్టణాల్లో 48% గృహాలు దీనిని ఉపయోగిస్తుండగా, గ్రామీణ భారతదేశంలో LPGని ఉపయోగిస్తున్న గృహాలు 5.7% మాత్రమే ఉన్నాయి. LPGపై ప్రభుత్వ సబ్సిడీ అందిస్తోంది. పట్టణ మధ్యతరగతి ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, భారతదేశంలో LPG ధరల పెరుగుదల రాజకీయంగా అతిసున్నితమైన అంశంగా పరిగణించబడుతుంది.

హాంకాంగ్‌లో ఒకప్పుడు LPG బాగా ప్రాధాన్యత ఉన్న వంట ఇంధనం; అయితే భవనాలకు టౌన్ గ్యాస్ విస్తరణ పెరిగిపోవడంతో LPG 24% కంటే తక్కువ గృహాలకు సరఫరా చేయబడుతుంది.

బ్రెజిల్ పట్టణ ప్రాంతాల్లో కూడా LPG అత్యంత సాధారణ వంట ఇంధనం, దీనిని అన్ని గృహాల్లో వినియోగిస్తున్నారు. పేద కుటుంబాలు ప్రభుత్వ సాయం("వేల్ గ్యాస్") పొందుతున్నాయి, దీనిని ప్రత్యేకంగా LPG పొందేందుకు ఉపయోగిస్తారు.

సహజ వాయువుతో పోలిక[మార్చు]

సహజ వాయువు (మీథేన్) (ఇది 10.6 kWh/m3కు సరిసమానమైన 38 MJ/m3 తాపన విలువ కలిగివుంటుంది) కంటే LPG అధిక తాపన విలువ (26.1kWh/m³కు సమానమైన 94 MJ/m3) కలిగివుంటుంది, అంటే సహజవాయువు స్థానంలో LPGని సులభంగా భర్తీ చేయలేము. ఒకేవిధమైన బర్నర్ కంట్రోల్‌లను ఉపయోగించడానికి వీలు ఏర్పరిచేందుకు మరియు ఒకేవిధమైన దహన లక్షణాలు అందించేందుకు, LPGని గాలితో కలిపి సంశ్లేష సహజ వాయువు (SNG) (సింథటిక్ న్యాచురల్ గ్యాస్)ను తయారు చేస్తారు, దీనిని సులభంగా సహజవాయువు స్థానంలో ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. LPG/గాలి మిశ్రమ నిష్పత్తుల సగటు 60/40గా ఉంటుంది, అయితే LPGని తయారు చేసేందుకు ఉపయోగించిన వాయువులనుబట్టి ఇది బాగా మారుతూ ఉంటుంది. మిశ్రమం యొక్క వోబే ఇండెక్స్‌ను లెక్కించడం ద్వారా మిశ్రమ నిష్పత్తులను గుర్తిస్తారు. ఒకేవిధమైన వోబే ఇండెక్స్ కలిగిన వాయువులను పరివర్తన చెందేవిగా పరిగణిస్తారు.

అనేక ప్రభుత్వ, పారిశ్రామిక మరియు మిలిటరీ కేంద్రాల్లో LPG-ఆధారిత SNGని అత్యవసర బ్యాకప్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు మరియు అధిక డిమాండ్ సమయాల్లో తమ సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన సహజ వాయువు కొరతను తీర్చేందుకు అనేక కేంద్రాలు LPG పీక్ షేవింగ్ ప్లాంట్‌లను ఉపయోగిస్తున్నాయి. గ్యాసు సరఫరా అనుసంధానం చేయకముందు పంపిణీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే LPG-SNG వ్యవస్థాపనలను ప్రాథమిక గ్యాస్ వ్యవస్థ పరిచయాల సందర్భంగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశం మరియు చైనా (అనేక ఇతర దేశాలు) వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికే ఉన్న సహజవాయువు వ్యవస్థలను విస్తరించడానికి ముందు వినియోగదారు ఆధారాలను ఏర్పాటు చేసుకునేందుకు LPG-SNG వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నాయి.

అగ్ని ప్రమాద సంభావ్యత మరియు ఉపశాంతి[మార్చు]

చమురు శుద్ధి కర్మాగారాల్లో ఎక్కువగా కనిపించే గోళాకర గ్యాస్ కంటైనర్.

సరిపడినంత సమయం మరియు తీవ్రతతో కూడిన అగ్ని ప్రమాదాలకు పాత్రమై ఉండే LPG కంటైనర్లు బాయిలింగ్ లిక్విడ్ ఎక్స్‌పాండింగ్ వాపర్ ఎక్స్‌ప్లోజన్ (BLEVE)కు కారణమయ్యే అవకాశం ఉంది. LPG పేలుళ్ల యొక్క విధ్వంసక ప్రభావం వలన, ఈ పదార్థం ఒక ప్రమాదకరమైన వస్తువుగా వర్గీకరించబడింది.[17] అతిపెద్ద కంటైనర్లు కలిగివుండే భారీ చమురుశుద్ధి కర్మాగారాలు మరియు పెట్రోకెమికల్ ప్లాంట్‌లకు ఇది ఒక ఆందోళనకర అంశంగా ఉంది. ఇటువంటి కంటైనర్లకు ఒక ఫైర్-రిసిస్టెన్స్ రేటింగ్ను అందించే ఒక ప్రమాణాన్ని పాటించడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు. స్థూపాకారంలో మరియు క్షితిజసమాంతరంగా ఉండే కంటైనర్లను "సిగార్స్" లేదా "బుల్లెట్‌"లుగా, గోళాకరంలో ఉండే కంటైనర్లను "స్పియర్స్" అని సూచిస్తారు. భారీ, గోళాకార LPG కంటైనర్లు 15 cm ఉక్కు గోడ మందం కలిగివుంటాయి. సాధారణంగా, వీటికి పైభాగంలో, మధ్యలో ఒక ఆమోదిత పీడన ఉపశమన వాల్వ్ ఉంటుంది. వీటికి పొంచివుండే ఒక ప్రధానమైన ముప్పు ఏమిటంటే ప్రమాదవశాత్తూ హైడ్రోకార్బన్‌లు చిందడం, ఇవి బయటకు రావడం వలన LPG కంటైనర్లకు మంటలు అంటుకునే, వేడెక్కే అవకాశం ఏర్పడుతుంది, ప్రాథమిక వాయు సూత్రాలు ప్రకారం, దీని ద్వారా కంటైనర్ల ఉష్ణోగ్రత మరియు పీడనం పెరుగుతుంది. ట్యాంకు బద్దలవకుండా నిరోధించేందుకు అదనపు పీడనం బయటకు వెళ్లడానికి పైభాగంలో ఏర్పాటు చేసిన వాల్వ్ (కవాటం) ఉపయోగపడుతుంది. సరిపడినంత సమయం మరియు తీవ్రత గల మంటల వద్ద, వేడెక్కుతున్న మరియు వ్యాకోచిస్తున్న వాయువు నుంచి సృష్టించబడే పీడనం అదనపు పీడనాన్ని బయటకు పంపేందుకు ఉద్దేశించిన కవాటం యొక్క సామర్థ్యాన్ని మించిపోగలదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, బాగావ్యాకోచించిన ట్యాంకు బలవంతంగా పగిలిపోతుంది, దీని నుంచి అత్యంత వేగంతో బద్దలైన ముక్కులు చెల్లాచెదురవుతాయి, బయటకొచ్చిన ట్యాంకులోని ఉత్పత్తులు మండిపోయే అవకాశం కూడా ఉంది, ఈ పరిణామం ఇతర ట్యాంకులతోపాటు, సమీపంలో ఉన్న ఎటువంటి వస్తువులైనా సర్వనాశనం కావడానికి దారితీస్తుంది. "సిగార్‌లు" విషయంలో, మార్గమధ్యపు ప్రమాదం రెండు "రాకెట్‌"లను చెరోవైపు పంపుతుంది, రెండు భాగాలను అత్యంత వేగంగా దూసుకుపోయేందుకు వాటిలోని ఇంధనం సాయపడుతుంది, ఇంధనం ఖాళీ అయ్యేవరకు ఈ రెండు భాగాలు రాకెట్‌లు మాదిరిగా దూసుకుపోతాయి.

ఉపశాంతి చర్యల్లో ఒకటేమిటంటే, LPG ట్యాంకులను నిప్పుకు, నిప్పు అంటుకునే అవకాశం ఉన్నవాటికి దూరంగా ఉంచాలి. ఉదాహరణకు రైలు రవాణా అయితే, LPG ట్యాంకులను అనుమానించాలి, ఈ ట్యాంకులకు మధ్యలో ఇతర వస్తువులు ఉండే బోగీలను ఉంచుతారు. ఈ చర్యను ఎల్లప్పుడూ అమలు చేయలేము, అయితే ఈ సమస్యకు అతితక్కువ-వ్యయంతో కూడిన ఒక పరిష్కారం ఇది. LPG రైలు కార్లను పైభాగంలో ఉండే ఉపశమన కవాటాల ద్వారా గుర్తించడం సులభం.

కొత్త LPG కంటైనర్ల విషయంలో, సులభమైన నిర్వహణ కోసం కవాటాలు మరియు కవచాలు బయటకు కనిపించేవిధంగా వాటిని పూడ్చిపెట్టవచ్చు. అయితే వీటి విషయంలో కూడా బాగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది, ప్రాథమిక దశలో ఉన్న ఈ కంటైనర్లకు యాంత్రిక నష్టం జరిగే అవకాశం ఉంది, దీని వలన కంటైనర్లు ప్రమాదకర క్షయానికి గురికావచ్చు. పూడ్చిపెట్టిన కంటైనర్లలో, బయటకు కనిపించే భాగాలకు ఇంటుమెసెంట్ మరియు లేదా ఎండోథర్మిక్ (ఉష్ణగ్రాహక) పూతలు లేదా అగ్నినిరోధక ప్లాస్టర్‌లు వంటి ఆమోదిత ఫైర్‌ఫ్రూఫింగ్ పదార్థాలతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన భాగానికి మట్టి నుంచి కావాల్సిన భద్రత లభిస్తుంది. ఫలకాలు మరియు భాగాలకు సులభమైన ప్రవేశం కోసం స్పెషాలిటీ రిమూవబుల్ కవర్లు ఉంటాయి, సరైన నిర్వహణ మరియు పరికరం యొక్క పనితీరు కోసం వీటికి ప్రవేశం పొందాల్సిన అవసరం ఉంటుంది.

ఇవి బాగా మందమైన ఉక్కు గోడలు కలిగివున్నప్పటికీ.. వ్యాకోచం, సంకోచం, నింపడం మరియు ఖాళీ చేయడం కారణంగా LPG కంటైనర్లు గణనీయమైన చలనానికి పాత్రమై ఉంటాయి. నిర్వహణలో ఈ చలనాలు కంటైనర్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన పూడ్చివుంచే ప్రత్యామ్నాయానికి ప్రతికూలాంశంగా ఉన్నాయి, ఎందుకంటే మట్టిలో గుండా పాత్ర యోక్క బాహ్య వాటర్‌ఫ్రూఫింగ్‌కు జరిగే యాంత్రిక నష్టాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఎపాక్సీ-పూసిన జిగురుకు ఒక చిన్న రాయి గీసుకున్నా దీని ద్వారా లభించే వాటర్‌ఫ్రూఫింగ్ ప్రమాదంలోకి నెట్టబడుతుంది, దీని వలన కూడా క్షయం జరగవచ్చు.

ఇదే సమయంలో గోళాలకు పూర్తిగా పూతపూసేందుకు అకర్బన ప్లాస్టర్‌లను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలను కాగితంపై సమర్థించవచ్చు, అయితే ప్లాస్టర్లు సుదీర్ఘకాలంపాటు పని చేసే స్థితిలో ఉంచడం చాలా కష్టం. ఈ రంగంలో గతంలో అనేక తప్పిదాలు జరిగాయి, ఉక్కు పొరను ఆల్కలీన్ ప్లాస్టర్‌లను ఉపయోగించడం ద్వారా సంరక్షించవచ్చని భావన ఉండేది. సిమెంట్ రాయి ఉండటం వలన ఇటువంటి ప్లాస్టర్‌లలో క్షారత ఉంటుంది. అయితే ఈ క్షారతకు ఒక శాశ్వితమైన లక్షణమేమీ ఉండదు, అంటే అధిక నాణ్యత కలిగిన ఎపాక్సీ ప్రైమర్‌లతో వాటర్‌ఫ్రూఫింగ్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ప్లాస్టర్ యొక్క బాహ్య వాటర్‌ఫ్రూఫింగ్‌కు కొన్ని అగ్నినిరోధక ప్లాస్టర్ ప్రోత్సహాకాల అవసరం ఉంటుంది, బయటకు తెరవబడి ఉన్న ప్లాస్టర్‌లలో క్షీణించిన క్షారత ప్లాస్టర్‌ను మొదటి స్థానంలో పట్టుకొనివుంచే సిమెంట్ రాయిపై ప్రమాదకర ప్రభావం చూపుతుంది. దీనికి విరుద్ధంగా, ఇంటుమెసెంట్ మరియు ఉష్ణ గ్రాహక పూతలు సాధారణంగా ఎపాక్సీ ఆధారితంగా ఉంటాయి, అంటే ఉక్కు పొర క్షయం జరగకుండా అన్ని రకాలుగా రక్షణ ఇస్తుంది.

వీటికి అగ్నినిరోధకతను ఏర్పాటు చేయడం, అన్ని జడ అగ్ని భద్రత ఉత్పత్తులు మాదిరిగా ఉండదు, ఇది కఠినమైన లిస్టింగ్ అండ్ అప్రూవల్ యూజ్ అండ్ కాంప్లియన్స్ నిబంధనలకు పాత్రమై ఉంటుంది. LPGకి సంబంధించిన బాహ్య నిర్మాణాలు భవన నియమావళి లేదా అగ్నిమాపక నియమావళి పరిధిలోకి రాకపోవడం ఒక సమస్యగా ఉంది, అనేక LPG కంటైనర్లు ఎటువంటి అగ్నినిరోధకత లేకుండా ఇప్పటికీ మనం చూడవచ్చు, తరచుగా ఎటువంటి స్థానిక నియమావళి లేకపోవడం వలన ఇది జరుగుతుంది, బీమా తనిఖీదారు మినహా అధికారం కలిగివున్న యంత్రాంగం ఏదైనా యజమానులను సరైన ఉపశాంతి పద్ధతులను ఉపయోగించమని ఆదేశించవచ్చు. బీమా కంపెనీలు కూడా పోటీ ఇరకాటంలో ఉన్నాయి, ఇటువంటి వస్తువులు విషయంలో, అవి రేట్ల ప్రాతిపదికనే కాకుండా, తమ తనిఖీదార్ల డిమాండ్‌ల కఠినతపై కూడా ఆధారపడి పోటీ పడుతున్నాయి. LPG పాత్రల అగ్నినిరోధక పరీక్షలు వైవిధ్యభరితంగా ఉంటాయి. వాస్తవిక బహిర్గత పరీక్షను బెర్లిన్‌లోని "BAM" యొక్క బ్రౌన్స్‌ష్వైగ్ పరీక్షా కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తారు. BAM యొక్క పద్ధతి ఏమిటంటే, అది ఒక చిన్న LPG కంటైనర్‌ను హైడ్రోకార్బన్ టెస్ట్ కర్వ్‌లోకి బహిర్గతం చేస్తుంది, దీని ద్వారా అది ఫలితాలను లెక్కిస్తుంది. ఉత్తర అమెరికా పద్ధతులు UL1709 ఆధారంగా ఉంటాయి. UL1709 పరీక్షకు కచ్చితమైన సమయం/ఉష్ణోగ్రత కర్వ్‌ను ఉపయోగిస్తుంది, అయితే ఇది ఉక్కు స్తంభాలను (దూలాలు పరీక్షించలేదు) మాత్రమే పరీక్షించేందుకు పరిమితమైవుంది, అదే BAM అయితే అసలు LPG కంటైనర్‌తోనే పరీక్షను నిర్వహించి అగ్నినిరోధక ఫలితాలను కనుగొంటుంది. ఎవరు ఎటువంటి అగ్ని నిరోధక పద్ధతిని ఉపయోగించినా, లిస్టింగ్ అండ్ అప్రూవల్ యూజ్ అండ్ కాంప్లియన్స్ నియమావళికి అనుగుణంగా కంటైనర్‌ను తయారు చేయడం చాలా ముఖ్యం, అంతేకాకుండా ఎంచుకున్న వస్తువు ఉత్పత్తి ద్రువీకరణ పొందిందా లేదా అనేది కూడా చూసుకోవాలి, అసలైన పరీక్షల్లో ఎన్విరాన్‌మెంటల్ ఎక్స్‌పోజర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణ గ్రాహక మరియు ఇంటుమెసెంట్ వంటి కర్బన ఉత్పత్తుల జీవితకాలాన్ని తెలుసుకోవడంతోపాటు మరియు ఈ ఉత్పత్తి ఎంతకాలం పని చేస్తుందో లెక్కించగలగివుండాలి. UL1709 "షైన్స్" విషయంలో వీటిని గమనించాలి. వాస్తవిక అగ్ని పరీక్షకు ముందు పర్యావరణ పరీక్షలకు పూర్తిస్థాయిలో తట్టుకొని నిలబడే వస్తువును నిజానికి అత్యంత కఠినమైన ఉత్పత్తిగా పరిగణించవచ్చు. మంటలకు తగలక ముందు ఉత్పత్తి పని చేయకుండా పోయే పరిస్థితులను అధిగమించడం ఈ పరీక్షల యొక్క ఉద్దేశం. మొదట పర్యావరణ పరీక్షల్లో, తరువాత అగ్నినిరోధక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందిన ఉత్పత్తులను ఉపయోగించడం వలన, ఇదే విధమైన పరీక్ష నమూనాను అన్ని రకాలకు ఉపయోగించడం వలన తీసుకోవాల్సి జాగ్రత్త ప్రదర్శించవచ్చు. ఇదే విధంగా, ఇంటుమెసెంట్స్ కోసం DIBt మన్నిక ప్రమాణాలు కూడా విశ్వసించదగినవిగా నిరూపించబడ్డాయి. మన్నిక మరియు పర్యావరణ పరీక్షలపై నిశిత దృష్టి పెట్టడం ద్వారా అగ్ని నిరోధకత, సుదీర్ఘ మన్నిక గల కంటైనర్లను పొందవచ్చు, వీటి ద్వారా గరిష్ట పరిధి వరకు BLEVE సంభావ్యతను తగ్గించవచ్చు.

ఒక కంటైనర్ పగిలిపోతే, LPG మొదట బాగా శీతలీకరణ చెందిన ద్రవం మాదిరిగా వ్యాప్తి చెందుతుంది. ఇది సమీపంలోని దేనినైనా శీతలీకరిస్తుంది. తరువాత ఇది వాతావరణంలో వేడెక్కుతుంది, ఆపై ఒక ఆక్సిజన్-స్థానభ్రంశ వాయువుగా మారుతుంది, ఇది ప్రభావిత వ్యాసార్థంలోని జీవులన్నింటికీ ఉపిరిసలపకుండా చేస్తుంది. ద్రవరూపంలో LPG వ్యాపించిన ప్రదేశం కంటే, దాని జనించిన వాయువు వ్యాపించే ప్రదేశం అనేక వందలరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక LPG ట్యాంకు పలు చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఆక్సిజన్ స్థానభ్రంశానికి కారణమవుతుంది. ఒక దశలో ఈ వాయువు వాతావరణం చేత కరిగించబడుతుంది. ఇది తరువాత జ్వలనశీల మిశ్రమ బిందువును చేరుకుంటుంది. ఇది జరిగినప్పుడు, పలు చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించే మంటలు ఆ ప్రదేశమంతటినీ నాశనం చేస్తాయి. ఈ కారణంగా, LPG మరియు LNG కేంద్రాలకు నిశిత పర్యవేక్షణ ఉంటుంది.

జూన్ 2009లో, LPG తీసుకెళుతున్న ఒక సరుకు రవాణా రైలు ఇటలీలోని వియారెగియో రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 29 మంది పౌరులు మరణించగా, 30 మంది పౌరులు గాయపడ్డారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Horst Bauer, ed. (1996). Automotive Handbook (4th ed.). Stuttgart: Robert Bosch GmbH. ISBN 0837603331. మూస:Pn
  2. 2.0 2.1 Zhang, Chunhua; Bian, Yaozhang; Si, Lizeng; Liao, Junzhi; Odbileg, N (2005). "A study on an electronically controlled liquefied petroleum gas-diesel dual-fuel automobile". Proceedings of the Institution of Mechanical Engineers, Part D: Journal of Automobile Engineering 219: 207. doi:10.1243/095440705X6470. 
  3. 3.0 3.1 Qi, D; Bian, Y; Ma, Z; Zhang, C; Liu, S (2007). "Combustion and exhaust emission characteristics of a compression ignition engine using liquefied petroleum gas–Diesel blended fuel". Energy Conversion and Management 48: 500. doi:10.1016/j.enconman.2006.06.013. 
  4. "European Commission on retrofit refrigerants for stationary applications" (PDF). Retrieved 2009-07-30. 
  5. "U.S. EPA hydrocarbon-refrigerants FAQ". United States Environmental Protection Agency. Retrieved 2009-07-30. 
  6. కాంపెడియం ఆఫ్ హైడ్రోకార్బన్-రిఫ్రిజెరాంట్ పాలసీ స్టేట్‌మెంట్స్, అక్టోబరు 2006[dead link]
  7. "MACS bulletin: hydrocarbon refrigerant usage in vehicles" (PDF). Retrieved 2009-07-30. 
  8. "Society of Automotive Engineers hydrocarbon refrigerant bulletin". Sae.org. 2005-04-27. Retrieved 2009-07-30. 
  9. "Shade Tree Mechanic on hydrocarbon refrigerants". Shadetreemechanic.com. 2005-04-27. Retrieved 2009-07-30. 
  10. "Saskatchewan Labour bulletin on hydrocarbon refrigerants in vehicles". Labour.gov.sk.ca. 1996-01-01. Retrieved 2009-07-30. 
  11. VASA ఆన్ రిఫ్రిజెరాంట్ లీగలిటీ & అడ్వైజబిలిటీ[dead link]
  12. "Flammable Refrigerant Alert" (PDF). Retrieved 2009-07-30. 
  13. "New South Wales (Australia) Parliamentary record, 16 October 1997". Parliament.nsw.gov.au. 1997-10-16. Retrieved 2009-07-30. 
  14. "New South Wales (Australia) Parliamentary record, 29 June 2000". Parliament.nsw.gov.au. Retrieved 2009-07-30. 
  15. VASA న్యూస్ రిపోర్ట్ ఆన్ హైడ్రోకార్బన్ రిఫ్రిజెరాంట్ డెమాన్‌స్ట్రేషన్స్[dead link]
  16. "Indian Census". Censusindia.gov.in. Retrieved 2009-07-30. 
  17. ది డేంజరస్ సబ్‌స్టాన్సెస్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ అట్మాస్పియర్స్ రెగ్యులేషన్స్. జూన్ 27, 2007న సేకరించబడింది.

బాహ్య లింకులు[మార్చు]

  • ఎక్స్‌ట్రా ఫ్యూయల్ UK, నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌కు చెందిన ఒక LPG సరఫరాదారు
  • AEGPL యూరోపియన్ LPG అసోసియేషన్
  • WLPGA వరల్డ్ LP గ్యాస్ అసోసియేషన్
  • PERC ప్రొపేన్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ కౌన్సిల్
  • NPGA నేషనల్ ప్రొపేన్ గ్యాస్ అసోసియేషన్, USA
  • ది LP గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చైన్ డిస్కవర్ LP గ్యాస్, ఫ్రమ్ ఇట్స్ సోర్స్ టు యువర్ హోమ్ (గ్రాఫిక్ యానిమేషన్)
  • PGAC ప్రొపేన్ గ్యాస్ అసోసియేషన్ ఆఫ్ కెనడా
  • LPGSASA LP గ్యాస్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా
  • ప్రొపేన్ 101 ఎక్స్‌ప్లెయినింగ్ ప్రొపేన్ అండ్ LP గ్యాస్ ఫండమెంటల్స్
  • UKLPG LPG ఇన్ ది UK
  • LPG కన్స్యూమర్ ఫోరమ్ UK ఫోరమ్

| ధర | సరఫరాదారులు | వ్యవస్థాపన | ప్రత్యామ్నాయాలు

  • షెల్ షెల్ అందించే సమాచారం, ఇది UK LPG సరఫరాదారు
  • LPG Info స్వతంత్ర ఆటోగ్యాస్/LPG సమాచార వెబ్‌సైట్
  • కాలోర్ కాలోర్ అందించే సమాచారం, ఒక UK LPG సరఫరాదారు
  • రూరల్ ఫ్యూయల్ UKలో LPGకి కాలోర్ గ్యాస్ గైడ్
  • ఫ్లోగ్యాస్ ఫ్లోగ్యాస్ అందించే సమాచారం, ఒక UK LPG సరఫరాదారు
  • BP గ్యాస్ BP గ్యాస్ అందించే సమాచారం, ఇది ఒక UK LPG సరఫరాదారు