ద్వైతం

వికీపీడియా నుండి

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.

సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.


1. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి

 : స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము  రెండు విధములు

2. ద్వా విధౌ పురుషో లోకే! క్షరశ్చాక్షర ఏవచ! క్షర సర్వాని భూతాని ! కూటస్తోక్షర ఉచ్యతె!!

 : లోకములొ పురుషులు రెండు రకాలు. నాశనము చెందేవారు. నాశనము లేనివారు.
    ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.

శ్రీమన్మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడ వ్యవహరిస్తారు.

మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి

1. జీవ - దేవ బేధము

2. జీవ - జీవ బేధము

3. జీవ - జడ బేధము

4. జడ - దేవ బేధము

5. జడ - జడ బేధము

మాధ్వ దర్షనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.

1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.

అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు. ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష, గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).


2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.

3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.


4. నేను జీవుడను, హరి కన్న భిన్నుడను, హరి సేవ వలననే తరించెదను (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి)


5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం


6. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనే 3 ప్రమాణములు (ఈ 3 ప్రమాణముల చేత పై సూత్రములు నిర్ధారింపబడినవి)


7. అఖిల వేదముల చేత తెలియ చేయ బడినవాడు ఆ హరి ఒక్కడే.



"http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%88%E0%B0%A4%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు