ధనురాసనము
వికీపీడియా నుండి
ధనురాసనము (సంస్కృతం: धनुरसन) యోగాలో ఒక విధమైన ఆసనము. ఈ ఆసనం ధనుస్సు లేదా విల్లు ను పోలి ఉండటం వల్ల దీనిని ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం మరియు శలభాసనం అను రెండాసనాల సమన్వయం.
పద్ధతి [మార్చు]
ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని అలాంటి వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి.
- పద్దతి 1 :
- గడ్డం నేలపై ఆనించి భుజాలను ఆనుకుని ఉండేలా చూసి పాదాలను కొంచం ఎడంగా ఉంచాలి.
- కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి.
- గాలి సాదారణంగా పీల్చుకోవాలి .
- కాళ్ళను మెల్లిగా వెనుకకు వంచాలి.
- చేతులతో చీలమండలాలను గట్టిగా పట్టుకోవాలి.
- తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి.
- దీర్గంగా గాలి పీల్చుకోవాలి.పది సెకనులు పీల్చుకోవాలి.
- కనీసం 3 సెకనులు తరవాత గాలి మెల్లగా వదలాలి.
- 15 సెకనులు పూర్తిగా గాలి వదలాలి.
- కాళ్ళు మెల్లగా వెనుకకు వదలాలి.
- క్రమంమంగా మోకాళ్ళు, బొటన వ్రేళ్ళు దగ్గరకు చేర్చాలి.
- పద్దతి 2:
- బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి.
- కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది.
- తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఉపయోగాలు [మార్చు]
సూచన [మార్చు]
ధనురాసనం సమర్ధవంతంగా వేయాలంటే భుజంగాసనాన్ని, శలభాసనాన్ని మొదట చక్కగా అభ్యాసం చేయాలి.
|
|||||||||||