నక్షత్ర ఆపిల్
| నక్షత్ర ఆపిల్ | |
|---|---|
| Chrysophyllum cainito fruit | |
| Scientific classification | |
| Kingdom: | Plantae |
| (unranked): | Angiosperms |
| (unranked): | Eudicots |
| (unranked): | Rosids |
| Order: | rosales |
| Family: | సపోటేసి |
| Genus: | Chrysophyllum |
| Species: | C. cainito |
| Binomial name | |
| Chrysophyllum cainito L. |
|
నక్షత్ర ఆపిల్ వృక్ష శాస్త్రీయ నామం Chrysophyllum cainito. నక్షత్ర ఆపిల్ ఉష్ణ మండలానికి సంబంధించిన సపోటేసి కుటుంబానికి చెందిన వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు మధ్య అమెరికా మరియు వెస్ట్ ఇండీస్ లోతట్టు ప్రాంతాలకు చెందినవి. ఈ చెట్టు వేగంగా పెరుగుతూ 20 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ చెట్టును ఆంగ్లంలో స్టార్ ఆపిల్ అంటారు, ఇంకా ఈ చెట్టును బంగారు ఆకు చెట్టు, పాల పండు అంటారు. వియత్నాంలో ఈ చెట్టును సాహిత్యపరంగా రొమ్ము పాలు అని అర్ధం వచ్చేలా పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు సతతహరితంగా, ఆల్టర్నేట్ గా సాధారణంగా అండాకారంలో 5 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు ఆకులను దూరం నుంచి చూసినప్పుడు క్రింది వైపున బంగారం రంగుతో ప్రకాశిస్తుంటాయి. ఈ చెట్టు యొక్క పూత (మిక్కిలి చిన్న పువ్వులు) ఊదా తెలుపు రంగును కలిగి తీపి వాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఈ చెట్టు స్వీయ సారవంతమైన హీర్మాఫ్రాడిటిక్ జాతి కూడా.