నగేష్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| నగేష్ | |
![]() |
|
| జన్మ నామం | గుండూ రావు |
| జననం | సెప్టెంబరు 27 1933 |
| మరణం | 2009 (వయసు 75) చెన్నై |
| క్రియాశీలక సంవత్సరాలు | 1958- 2008 |
| భార్య/భర్త | రెజీనా [1] |
సి.కె.నగేష్ (జ: సెప్టెంబర్ 27, 1933 — మ: జనవరి 31, 2009) దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు. పలు తమిళ, తెలుగు, మళయాళ చిత్రాలలో నటించాడు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారాయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తుంటారు.
విషయ సూచిక |
బాల్యం [మార్చు]
ఈయన పూర్వ నామం గుండూరావు. 1933, సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రం, తుమకూరు జిల్లా టిప్టూరు తాలూకాలో చెయ్యూరు అనే ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు రుక్మిణమ్మ, కృష్ణారావు.[2]. చిన్నప్పుడే తాను ఏదో ఒక రంగంలో తన ప్రతిభను నిరూపించుకొన్నాకనే తిరిగి వస్తానని చెప్పి మద్రాసుకు వచ్చేశాడు. చెన్నైలో వెస్ట్ మాంబళంలో ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిలో ప్రముఖ తమిళ రచయిత వాలి, తమిళ నటుడు శ్రీకాంత్ లతో కలిసి ఉన్నాడు. తరువాత కొద్ది కాలానికి భారతీయ రైల్వేలలో చిన్న ఉద్యోగాన్ని చేపట్టాడు. కానీ అది అంతగా సంతృప్తినివ్వకపోవడంతో దానిని వదిలేశాడు.
నటి జీవితము [మార్చు]
నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తాడు. ప్రముఖ నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిళి ఆయన నటించిన మొదటి చిత్రం. ఆయన నటించిన చివరి చిత్రం, కమల్ హాసన్ పది పాత్రలు పోషించిన దశావతారం. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో సుమారు 1000 సినిమాలలో నటించిన ఘనత ఆయనది. నగేష్ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం సర్వర్ సుందరం . ఇది 1964లో విడుదలైంది. ఇందులో ఆయనే కథానాయకుడు. కె.ఆర్. విజయ కథానాయిక.
నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- సర్వర్ సుందరం (1964/1966) - సుందరం
- దేవత (1965)
- కన్నెపిల్ల (1966)
- కోటీశ్వరుడు (1970)
- కలవారి కుటుంబం (1972)
- పాపం పసివాడు (1972) - విమాన చోదకుడు
- సోగ్గాడు (1975) - సన్యాసిరావు
- మనుషులంతా ఒక్కటే (1976) - గణపతి
- సావాసగాళ్ళు (1977)
- వేటగాడు (1979)
- కొండవీటి సింహం (1981) - సీతాపతి
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- జస్టిస్ చౌదరి (1982)
- శ్రీరంగనీతులు (1983)
- వసంత గీతం (1984)
- కారు దిద్దిన కాపురం (1986) - మన్మధరావు
- ఇంద్రుడు చంద్రుడు (1989)
- విచిత్ర సోదరులు (1989)
- దళపతి (1992) - పంతులు
- బృందావనం (1992)
- మేడమ్ (1994)
- శుభాకాంక్షలు (1997)
- తొలిప్రేమ (1998)
- తమ్ముడు (1999)
- దశావతారం (2008)
ఒడిదుడుకులు [మార్చు]
తన హాస్యంతో ప్రేక్షక లోకాన్ని నవ్వించిన నగేష్ జీవితంలో పలు కష్టాలను అనుభవించాడు. నటుడిగా స్థిరపడిన తర్వాత తను సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. ఒక థియేటర్ కూడా నిర్మించాడు. ఎమ్జీఆర్ తో అభిప్రాయ భేధాలు వచ్చాక నగేష్ కి ఇబ్బందులు మొదలయ్యాయని తమిళ చిత్ర వర్గాలు అంటుంటాయి. సరిగ్గా అప్పుడే వ్యాపారం కూడా దెబ్బతిన్నది. అయితే మళ్ళీ ఎమ్జీఆర్ తో కలిశాక కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఎప్పుడూ కష్టాల్ని బయటకు చెప్పుకునేవాడు కాదు. నేను ఓ ఖరీదైన కారు కొన్నాను. అందులో మా అమ్మ రుక్మిణమ్మను ఎక్కించుకుని తిప్పాను. అలా తిప్పుతుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఆ క్షణాలే నన్ను ఎక్కువగా బాధ పెట్టాయి అంటాడు నగేష్.
కుటుంబం [మార్చు]
75 ఏళ్ళు జీవించిన నగేష్ కు ఇద్దరు కుమారులు. ఒకరు ఆనంద్ బాబు మరొకరు రమేష్ బాబు. వీరిలో ఆనంద్ బాబు నటుడు. ఆయన భార్య 2006లో చనిపోయింది.. అస్వస్థత కారణంగా ఆయన చెన్నైలోని తన స్వగృహంలో జనవరి 31, శనివారం రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నగేష్ పేజీ
