నటాలీ పోర్ట్‌మన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నటాలీ పోర్ట్‌మన్
Natalie Portman at TIFF 2009.jpg
Portman at the 2009 Toronto International Film Festival
జననం Natalie Hershlag
(మూస:Lang-he)
(1981-06-09) జూన్ 9, 1981 (వయస్సు: 33  సంవత్సరాలు)
జెరూసలెం, ఇజ్రాయెల్
వృత్తి నటి
క్రియాశీలక కాలం 1994–present

నటాలీ పోర్ట్‌మన్ (అసలు పేరు నటాలీ హెర్ష్‌లాగ్ ; జననం జూన్ 9, 1981) ఇజ్రాయెల్ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి. 1994లో విడుదలైన చిన్న సినిమా (ఎక్కువ భాగం ప్రధాన స్టూడియోల్లో నిర్మించబడిన సినిమా) లెయోన్ ‌లో (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ సినిమాను ది ప్రొఫెషనల్‌ గా పిలుస్తారు) ఆమె మొదటిసారి నటించింది. స్టార్ వార్స్ ప్రీక్వెల్ ట్రైలాజీలో పాడ్మె అమిడాలా పాత్ర పోషించడం ద్వారా ఆమె విస్తృతమైన ఖ్యాతిని ఆర్జించింది.[1] "నేను నటిని కాకపోయినా, ఇంతకంటే మెరుగైన స్థితిలో ఉండేదానని" ఒక సందర్భంలో పోర్ట్‌మన్ వ్యాఖ్యానించింది,[2] స్టార్ వార్స్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె హార్వర్డ్ కళాశాలలో మనస్తత్వ శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది.[3]

2001లో, పోర్ట్‌మన్ న్యూయార్క్స్ పబ్లిక్ థియేటర్‌ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన చెఖోవ్ యొక్క ది సీగల్ నాటకంలో నటించింది, ఈ నాటకంలో ఆమెతోపాటు మెరిల్ స్ట్రీప్, కెవిన్ క్లైన్ మరియు ఫిలిప్ సీమౌర్ హాఫ్‌మన్‌లు కూడా నటించారు.[1] 2005లో, క్లోజర్ చలనచిత్రంలో నటించినందుకుగానూ, ఉత్తమ సహాయక నటి విభాగంలో పోర్ట్‌మన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. మే 2008లో జరిగిన, 61వ వార్షిక కేన్స్ చలనచిత్ర వేడుకల్లో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా ఆమె వ్యవహరించింది, దీని ద్వారా ఈ వేడుకల న్యాయనిర్ణేతల మండలికి ఎంపికయిన అతిపిన్నవయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందింది.[4] పోర్ట్‌మన్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం, ఈవ్ , 2008లో జరిగిన 65వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్ర వేడుక ల్లో లఘుచిత్ర పోటీ విభాగంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైంది.[5]

ప్రారంభ జీవితం[మార్చు]

ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో పోర్ట్‌మన్ జన్మించింది.[6][7] ఆమె తండ్రి, అవ్నెర్ హెర్ష్‌లాగ్ ఒక ఇజ్రాయెలీ వైద్యుడు, ఆయన రీప్రొడక్టివ్ ఎండోక్రినాలజీ వైద్య నిపుణుడు.[8][9] అమెరికాకు చెందిన ఆమె తల్లి షెల్లీ స్టీవెన్స్ గృహిణి, ప్రస్తుతం ఆమె పోర్ట్‌మన్ ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.[8] పోర్ట్‌మన్ యొక్క తల్లితరపు పూర్వీకులు ఆస్ట్రియా మరియు రష్యాకు చెందిన యూదులు, ఆమె తండ్రితరపు పూర్వీకులు పోలాండ్ మరియు రొమేనియా నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చిన యూదులు. ఆమె తాత (తండ్రితరపు) తల్లిదండ్రులు ఆష్విట్జ్‌లో మరణించారు మరియు రొమేనియాలో జన్మించిన ఆమె తాతమ్మ రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటీష్‌ యంత్రాంగంలో గూఢచారిణిగా పనిచేసింది.[10]

పోర్ట్‌మన్ తల్లిదండ్రులు ఒహియో రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని ఒక యూదు విద్యార్థి కేంద్రం వద్ద తొలిసారి కలిశారు, ఆ సమయంలో ఇక్కడ ఆమె తల్లి టిక్కెట్లు విక్రయిస్తుంది. తరువాత ఆమె తండ్రి ఇజ్రాయెల్ తిరిగి వెళ్లాడు, అయితే ఇద్దరి మధ్య బంధం మాత్రం కొనసాగింది, కొన్నేళ్ల తరువాత, ఆమె తల్లి ఇజ్రాయెల్ వెళ్లిన సందర్భంగా ఇరువురూ వివాహం చేసుకున్నారు. 1984లో, పోర్ట్‌మన్‌కు మూడేళ్ల వయస్సులో, వారి కుటుంబం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తరలివచ్చింది, ఇక్కడ ఆమె తండ్రి వైద్య శిక్షణ పొందాడు. వారి కుటుంబం మొదట వాషింగ్టన్ డి.సి.లో నివసించింది, ఇక్కడి ఛార్లస్ ఈ. స్మిత్ జెవిష్ డే స్టూల్‌లో పోర్ట్‌మన్ చదువుకుంది, అయితే 1988లో ఆమె కుటుంబం కనెక్టికట్‌కు వెళ్లింది, తరువాత 1990లో న్యూయార్క్‌ లోని లాంగ్ ఐలాండ్‌లో వారి కుటుంబం శాశ్వత నివాసం ఏర్పరుచుకుంది.[1] పోర్ట్‌మన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, "నేను అమెరికాను నిజంగానే ప్రేమిస్తున్నప్పటికీ... నా మనస్సు ఎప్పుడూ జెరూసలేంలోనే ఉంటుంది. అక్కడ ఉంటే తనకు ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొంది."[10] ఏకైక సంతానం కావడంతో, తల్లిదండ్రులకు ఆమె చాలా ప్రేమగా చూసుకునేవారు,[1] ఆమె తల్లిదండ్రులు తరచూ ఆమెతో ప్రీమియర్ షోల్లో కనిపిస్తుంటారు.

విద్య[మార్చు]

మత భావాలు కలిగిన కుటుంబంలో తాను పెరగలేదని చెబుతున్నప్పటికీ,[11] పోర్ట్‌మన్ యూదుల ప్రాథమిక పాఠశాల, న్యూయార్క్‌లోని గ్లెన్ కోవ్‌లో ఉన్న సోలోమన్ షెష్టర్ డే స్కూల్‌లలో చదువుకుంది. ఆమె సైసెట్ హై స్కూల్ అనే ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పట్టభద్రురాలైంది.[1] ఉన్నత పాఠశాల చివరి పరీక్షలకు చదువుకునేందుకు పోర్ట్‌మన్ స్టార్ వార్స్: ఎపిసోడ్ I ప్రీమియర్ షోకు హాజరు కాకపోవడం గమనార్హం.[12]

జూన్ 2003లో, పోర్ట్‌మన్ మనస్తత్వ శాస్త్రంలో బ్యాచులర్స్ డిగ్రీతో హార్వర్డ్ కళాశాల నుంచి పట్టభద్రురాలైంది. హార్వర్డ్‌లో ఉన్నప్పుడు, మనస్తత్వ ప్రయోగశాలలో అలెన్ డెర్‌షోవిట్జ్ వద్ద పరిశోధక సహాయకురాలిగా పోర్ట్‌మన్ పనిచేసింది (అతను ది కేస్ ఫర్ ఇజ్రాయెల్‌ లో ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు). హార్వర్డ్‌లో చదువుకుంటున్నప్పుడు, లోవెల్ హౌస్‌లో ఆమె నివాసం ఉండేది,[13] ఈ సందర్భంగా ఇజ్రాయెల్ వ్యతిరేక వ్యాసానికి స్పందనగా హార్వర్డ్ క్రిమ్సన్‌ కు ఆమె లేఖ రాసింది.[14]

2004 వసంతకాలంలో హీబ్రూ యూనివర్శిటీ ఆఫ్ జెరూసలేంలో ఆమె గ్రాడ్యుయేట్ కోర్సులు చదివింది.[11] మార్చి 2006లో, తీవ్రవాదం, తీవ్రవాద వ్యతిరేక పోరాటం అంశాలపై జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ కోర్సుకు ప్రత్యేక అధ్యాపకురాలిగా వెళ్లింది, ఇక్కడ ఆమె వి ఫర్ వెండెట్టా అనే తన చిత్రంపై మాట్లాడింది.[15]

హీబ్రూ[16] మరియు ఆంగ్లం ద్విభాషా ప్రావీణ్యతతోపాటు, పోర్ట్‌మన్ [17] ఫ్రెంచ్,[18] జపనీస్,[18] జర్మన్,[19] మరియు అరబిక్ భాషలను కూడా నేర్చుకుంది.[20]

విద్యార్థినిగా, పోర్ట్‌మన్ ప్రొఫెషినల్ సైంటిఫిక్ జర్నల్స్‌లో ప్రచురితమైన రెండు పరిశోధక పత్రాలకు సహ-రచయితగా వ్యవహరించింది. 1998నాటి ఉన్నత పాఠశాల పరిశోధక పత్రం, "ఎ సింపుల్ మెథడ్ టు డిమాన్‌స్ట్రేట్ ది ఎంజైమాటిక్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ షుగర్," ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్‌లోకి ప్రవేశం పొందింది.[21] హార్వర్డ్‌లో మనస్తత్వ శాస్త్రం చదువుతున్న సందర్భంగా, 2002లో, ఆమె "ఫ్రాంటల్ లోబా యాక్టివేషన్ డ్యురింగ్ ఆబ్జెక్ట్ ఫెర్మానెన్స్" అని పిలిచే ఒక జ్ఞాపకశక్తి అధ్యయనంలో పాలుపంచుకుంది.[22]

వృత్తి[మార్చు]

ప్రారంభ కృషి[మార్చు]

4 ఏళ్ల వయస్సులో పోర్ట్‌మన్ నృత్య పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించింది[1] మరియు స్థానిక బృందాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. 10 ఏళ్ల వయస్సులో, రెవ్లాన్ ప్రతినిధి ఒకరు ఆమెను చైల్డ్ మోడల్ కావాలని కోరాడు,[1][23] అయితే నటనపై దృష్టి సారించేందుకు ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించింది. ఒక మేగజైన్ ఇంటర్వ్యూలో, పోర్ట్‌మన్ మాట్లాడుతూ.. ఇతర పిల్లలతో పోలిస్తే నేను కొంచెం ప్రత్యేకంగా ఉన్నాను. నాకు విజయం సాధించాలనే బలమైన కోరిక ఉండేది, నేను దేనిని ఇష్టపడతానో మరియు నాకు ఏది కావాలో నాకు తెలుసు, దాని కోసం నేను తీవ్రంగా శ్రమించాను. బాల్యంలో నేను చాలా గాంభీరంగా ఉండేదానినని పేర్కొంది."[24]

పోర్ట్‌మన్ తన పాఠశాల సెలవుల్లో రంగస్థల ప్రదర్శనలకు వెళ్లేది. 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఆమె రూత్‌లెస్! గాత్ర పరిశీలనకు హాజరైంది, ఒక పాఠశాల నాటకంలో ప్రధాన పాత్ర పొందేందుకు హత్య చేసేందుకు సిద్ధపడే ఒక బాలిక కథతో ఈ నాటకం రూపొందింది, లారా బెల్ బండీలో ప్రత్యామ్నాయ పాత్రకు ఆమె ఎంపికైంది.[11] 1994లో, లుక్ బెసోన్ రూపొందించిన చలనచిత్రం, లెయోన్ (ది ప్రొఫెషినల్‌ గా కూడా పిలుస్తారు)లో మధ్య వయస్కుడైన హంతకుడి (హిట్‌మాన్)కి మిత్రురాలిగా మారే బాలిక పాత్రకు నటి అన్వేషణలో భాగంగా జరిగిన గాత్ర పరిశీలనలో ఆమె ఎంపికైంది. ఇందులో నటించే అవకాశం దక్కిన వెంటనే, ఆమె తన అవ్వ మొదటి పేరు "పోర్ట్‌మన్"ను తన పేరులోకి స్వీకరించింది, గోప్యత కోసం ఆమె ఈ పేరును పెట్టుకుంది;[1] ఈ సినిమా యొక్క డైరెక్టర్స్ కట్ DVD (ప్రత్యేకంగా కూర్చిన చిత్రరూపం)లో మాత్రం ఆమె పేరు నటాలీ హెర్ష్‌లాగ్‌గానే కనబడుతుంది. నవంబరు 18, 1994న లెయెన్ విడుదలైంది, ఆ సమయంలో ఆమె వయస్సు 13 సంవత్సరాలు. అదే ఏడాది ఆమె డెవెలపింగ్ అనే లఘుచిత్రంలో నటించింది, ఇది టెలివిజన్‌లో ప్రసారమైంది.

1995–1999[మార్చు]

1990వ దశకం మధ్యకాలంలో, పోర్ట్‌మన్ హీట్ , ఎవిరివన్ సేస్ ఐ లవ్ యు , మరియు మార్స్ ఎటాక్స్! చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించింది, అంతేకాకుండా బ్యూటిఫుల్ గర్ల్స్ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది.[1] విలియం షేక్‌స్పియర్ యొక్క రోమియో + జూలియట్ చలనచిత్రంలో జూలియట్ పాత్రకు ఆమె ప్రధాన పోటీదారుగా ఉంది, అయితే ఈ చిత్ర నిర్మాతలు ఈ పాత్రకు ఆమె వయస్సు సరిపోదని భావించారు.[23] 1997లో, ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ పుస్తకం ఆధారంగా నిర్మించిన బ్రాడ్‌వే చిత్రంలో పోర్ట్‌మన్ అన్నే ఫ్రాంక్ పాత్ర పోషించింది. ఎనీవైర్ బట్ హియర్ చలనచిత్రంలో ఆమె మొదట ప్రధాన పాత్రను తోసిపుచ్చింది, ఇందులో ఒక శృంగార సన్నివేశం ఉన్న కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది, అయితే దర్శకుడు వాయ్నే వాంగ్ మరియు నటి సుసాన్ సారాన్డోన్ కథను మళ్లీ రాయాలని డిమాండ్ చేశారు; కొత్తగా రాసిన స్క్రిప్ట్‌ను పోర్ట్‌మన్‌కు చూపించడంతో, ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది.[1] 1999లో ఈ చలనచిత్రం విడుదలైంది, ఎన్ ఆగస్ట్ పాత్రలో తన నటనకుగానూ, ఆమెకు ఉత్తమ సహాయ నటి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ దక్కింది.[25] సాలోన్ విశ్లేషకురాలు మేరీ ఎలిజబెత్ విలియమ్స్ ఆమె నటనను "అద్భుతంగా ఉన్నట్లు" వర్ణించింది మరియు "ఆమె వయస్సులోని మిగిలిన నటీమణులకు భిన్నంగా, ఆమె మత్తెక్కించేటట్లు లేదా గడుసుగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడింది."[26] 1990వ దశకం చివరి కాలంలో, స్టార్ వార్స్ ఫ్రీక్వెల్ ట్రైలాజీలో పాడ్మే ఎమీడాలా పాత్రను పోర్ట్‌మన్ పోషించింది. తొలి భాగం, ది ఫాంతోమ్ మెనాస్ , 1999 ప్రారంభంలో విడుదలైంది.[1] వేర్ ది హార్డ్ ఈజ్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు సంతకం చేసింది, ఈ సినిమాలో ఆమె యవ్వనంలో ఉన్న తల్లి పాత్రను పోషించింది.

2000–2005[మార్చు]

వేర్ ది హార్ట్ ఈజ్ చిత్రంలో నటించిన తరువాత, పోర్ట్‌మన్ మనస్తత్వ శాస్త్రంలో బ్యాచులర్స్ డిగ్రీ చదివేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయ కళాశాలలో చేరింది.[1] 1999లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చదువుపై దృష్టి పెట్టేందుకు స్టార్ వార్స్ ప్రీక్వెల్స్ మినహా, వచ్చే నాలుగేళ్లపాటు తాను మరే ఇతర సినిమాల్లో నటించనని వెల్లడించింది.[27] జూన్-సెప్టెంబరు 2000లో వేసవి విరామం సందర్భంగా, పోర్ట్‌మన్ సిడ్నీలో జరిగిన Star Wars Episode II: Attack of the Clones చలనచిత్ర షూటింగ్‌లో పాల్గొంది, దీనితోపాటు లండన్‌లో అడిషనల్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరైంది. జులై 2001లో, న్యూయార్క్ సిటీ పబ్లిక్ థియేటర్‌ ఆధ్వర్యంలో రూపొందిన చెఖోవ్ యొక్క ది సీగల్ నాటకంలో ఆమె నటించింది, దీనికి మైక్ మికోల్స్ దర్శకత్వం వహించాడు; ఇందులో ఆమె నైనా పాత్ర పోషించింది, మెరైల్ స్ట్రీప్, కెవిన్ క్లైన్, మరియు ఫిలిప్ సీమౌర్ హోఫ్‌మాన్‌లు కూడా ఇందులో నటించారు.[1] ఈ నాటకం సెంట్రల్ పార్క్‌లోని డెలాకార్ట్ థియేటర్‌లో ప్రదర్శించబడింది.[28] ఇదే ఏడాది, 2002 కామెడీ జూలాండర్‌ లో అతిథి పాత్రలు పోషించిన అనేక మంది చలనచిత్ర ప్రముఖుల్లో ఆమె కూడా ఒకరు. కోల్డ్ మౌంటైన్ చిత్రంలో జూడ్ లా మరియు నికోలే కిడ్‌మన్‌లకు సహనటిగా పోర్ట్‌మన్ ఒక చిన్నపాత్రలో నటించింది.[1]

2004లో, పోర్ట్‌మన్ చిన్న సినిమాలైన గార్డెన్ స్టేట్ మరియు క్లోజర్‌ లలో కూడా నటించింది.[1] సన్‌డాన్స్ చలనచిత్ర వేడుకల్లో గార్డెన్ స్టేట్ ఒక అధికారిక చిత్రంగా ఎంపికైంది, అంతేకాకుండా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్‌ల విభాగంలో బెస్ట్ ఫస్ట్ ఫీచర్‌ అవార్డును గెలుచుకుంది. క్లోజర్‌ లో ఎలిస్‌గా నటనకు గుర్తింపుగా పోర్ట్‌మన్ సహాయక నటి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతోపాటు, అకాడమీ అవార్డుల ఉత్తమ సహాయక నటి విభాగంలో నామినేషన్ పొందింది.[29][30]

చివరి స్టార్ వార్స్ ప్రీక్వెల్, Star Wars Episode III: Revenge of the Sith మే 19, 2005న విడుదలైంది. ఇది ఆ ఏడాదికి దేశంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది,[31] మరియు పీపుల్స్ ఛాయిస్ అవార్డుల్లో ఫేవరెట్ మోషన్ పిక్చర్‌గా ఎంపికైంది. 2005లో, పోర్ట్‌మన్ ఫ్రీజోన్ మరియు దర్శకుడు మిలోస్ ఫార్మాన్ యొక్క గోయాస్ గోస్ట్స్ చలనచిత్రాల్లో నటించింది. ఆమె ఒక గోయా చిత్తరువులో ఉన్న రూపం కలిగివుండటంతో, ఫార్మన్ ఆమె సినిమాల్లో దేనినీ చూడకుండానే ఈ నటితో సమావేశానికి విజ్ఞప్తి చేశాడు.[32]

2006–ఇప్పటివరకు[మార్చు]

2009 టొరంటో అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో పోర్ట్‌మన్

మార్చి 4, 2006న పోర్ట్‌మన్ శాటర్‌డే నైట్ లైవ్‌ లో కనిపించింది,[33] సంగీత అతిథి ఫాల్ అవుట్ బాయ్ మరియు ప్రత్యేక అతిథి నటుడు డెన్నిస్ హేస్‌బెర్ట్‌లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఒక SNL డిజిటల్ షార్ట్‌లో,[34] క్రిస్ పార్నెల్‌తో ఒక బూటకపు ఇంటర్వ్యూ సందర్భంగా, ఆమె తననితాను ఒక కోపిష్టి గ్యాంగ్‌స్టా రాపర్ (వైకింగ్ వేషంలో ఆమె యొక్క ఫ్లావర్ ఫ్లావ్-ఎస్క్యూ పార్టనర్‌గా ఆండీ శాంబెర్గ్‌తో)గా చిత్రీకరించుకుంది, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాట్ మరియు కొకైన్ వంటి మాదకద్రవ్యాలకు బానిసగా ఉన్నప్పుడు తాను మోసం చేశానని చెప్పింది.[35] "నటాలీస్ రాప్" అనే పేరు గల పాట- ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర చిత్రణలతోసహా - 2009లో ది లోన్లీ ఐస్‌ల్యాండ్ యొక్క ఆల్బమ్ ఇన్‌క్రెడిబాడ్‌ లో విడుదలయ్యాయి.[36] మరో చిత్రణలో, ఆమె ఒక బార్ మిడ్జ్‌వాకు వెళుతున్న రెబెక్కా హెర్ష్‌లాగ్ (ఆమె అసలు పేరు) అనే విద్యార్థిగా నటించింది మరియు ది నీడ్లర్స్ (సాలీ అండ్ డాన్‌గా కూడా ఇది గుర్తింపు పొందింది, ఈ జంట విడాకులు తీసుకుంటుంది) చిత్రణలోని ఒక భాగంలో సంతానసాఫల్య నిపుణురాలిగా (తన తండ్రి వృత్తి) కూడా ఆమె కనిపించింది.

వి ఫర్ వెండెట్టా 2006 ప్రారంభంలో విడుదలైంది. పోర్ట్‌మన్ ఇందులో ఇవెయ్ హమ్మండ్ పాత్ర పోషించింది, ప్రధాన పాత్ర V చేత రహస్య పోలీసుల నుంచి రక్షించబడే ఒక యువ మహిళ పాత్ర ఇది. పోర్ట్‌మన్ ఈ పాత్ర కోసం ఒక వాయిస్ కోచ్ వద్ద శిక్షణ పొందింది, దీని కోసం ఆంగ్ల యాసలో మాట్లాడటం నేర్చుకుంది మరియు ఈ పాత్రలో ఆమె గుండు చేయించుకొని నటించడం బాగా చర్చనీయాంశమైంది.[37]

వి ఫర్ వెండెట్టా చలనచిత్రంతో రాజకీయ సంబంధం గురించి మరియు ఈ చలనచిత్రంలో రహస్య ప్రభుత్వ-వ్యతిరేక గ్రూపుతో చేతులు కలిపే తన పాత్ర గురించి పోర్ట్‌మన్ మాట్లాడుతూ.."ఇది చెడ్డ పాత్ర మరియు మీకు ఇష్టంలేని పనులు చేసే పాత్ర" మరియు "ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించడానికి, నేను ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వ్యక్తిని కావడం ప్రధాన కారణం, ఎందుకంటే నా చిన్న వయస్సు నుంచి తీవ్రవాదం మరియు హింసాకాండ అనే అంశాలు నా రోజువారీ జీవితపు సంభాషణల్లో భాగంగా ఉండేవి." ఈ చలనచిత్రం "స్పష్టమైన మంచి లేదా చెడు ప్రకటనలు ఉండవని ఆమె తెలిపింది. ప్రేక్షకుల సొంత అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నంలో ఇది వారిని కావాల్సిన స్థాయిలో గౌరవిస్తుంది.".[38]

2006లో గోయాస్ గోస్ట్స్ మరియు ఫ్రీ జోన్ రెండు చిత్రాలు పరిమితంగానే విడుదలయ్యాయి. బాలల చిత్రం మిస్టర్ మాగోరియమ్స్ వండర్ ఎంపోరియం లో పోర్ట్‌మన్ నటించింది, ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2006లో ప్రారంభమైంది, నవంబరు 2007లో విడుదలైంది; "ఒక బాలల చిత్రం చేయడంపై తనకు చాలా ఆసక్తి ఉందని ఆమె పేర్కొంది."[37] 2006 చివరి భాగంలో, పోర్ట్‌మన్ ది అదర్ బోలెయన్ గర్ల్ అనే చిత్రంలో నటించింది, ఇది ఒక చారిత్రక కథ, ఇందులో ఆమె అన్నే బోలెయన్ పాత్ర పోషించింది; ఇందులో ఎరిక్ బానా మరియు స్కార్లెట్ జోహాన్సన్ సహ-నటులు. బ్లెండర్ మేగజైన్ ఆమెను చలనచిత్ర మరియు TV నటుల్లో హాటెస్ట్ వుమన్‌గా గుర్తించింది.[39]

2006లో, ఆమె వాంగ్ కార్-వాయ్ రూపొందించిన ప్రయాణంతో ముడిపడిన సినిమా మై బ్లూబెర్రీ నైట్స్‌ లో నటించింది. ఇందులో పోషించిన జూదగత్తె లెస్లీ పాత్ర ద్వారా ఆమె పలువురి ప్రశంసలు అందుకుంది, ఎందుకంటే "ఈ సినిమాలో ఆమె ఒక అనాథ లేదా ఒక బాల రాజకుమారిగా నటించలేదు, ఎదిగిన సంపూర్ణ మహిళగా ఇందులో కనిపించింది... అయితే ఆమె తన కనిపించే తీరుపై ఎటువంటి సరిహద్దులను పరిమితం చేయలేదు... ఏకకాలంలో వన్నెలు వొలకబోయడం మరియు బల్లపై జూదగాడిని ఎత్తిపొడవడానికి ఆమె తన ఆహార్యాన్ని ఉపయోగించింది."[40] ది సింప్సన్స్ 18వ సీజన్‌కు చెందిన "లిటిల్ బిగ్ గర్ల్" ఎపిసోడ్‌లో బార్ట్ సింప్సన్ యొక్క స్నేహితురాలు డార్సీకి పోర్ట్‌మన్ గాత్రదానం చేసింది.[41] మైకెల్ గోండ్రీ దర్శకత్వం వహించిన 2007 ఆల్బమ్ ఆల్బమ్ మెమొరీ ఆల్మోస్ట్ ఫుల్‌ లోని పాల్ మెక్‌కార్ట్నీ యొక్క "డాన్స్ టునైట్" మ్యూజిక్ వీడియోలో ఆమె కనిపించింది.[42] వెస్ ఆండర్సన్ లఘుచిత్రం హోటల్ చెవాలియర్‌ లో పోర్ట్‌మన్ సహనటిగా, జాసన్ ష్వార్జ్‌మన్‌కు జంటగా నటించింది, ఇందులో ఆమె తొలిసారి వివస్త్ర సన్నివేశంలో కనిపించింది.[43] మే 2008లో, 61వ వార్షిక కేన్స్ చలనచిత్ర వేడుకల న్యాయనిర్ణేతల కమిటీలో చోటు దక్కించుకున్న అతి పిన్నవయస్కురాలిగా పోర్ట్‌మన్ గుర్తింపు పొందింది,[4] మరియు 2009లో, ఆమె బ్రదర్స్ అనే నాటకీయ చిత్రంలో టాబే మాగైర్ మరియు జేక్ గైలెన్‌హాల్‌లకు జంటగా నటించింది, 2004నాటి ది సేమ్ నేమ్ అనే డానిష్ చిత్రం దీని మాతృక.[44]

థోర్ ఆధారంగా కెన్నెత్ బ్రానాగ్ తెరకెక్కిస్తున్న చలనచిత్రంలో పోర్ట్‌మన్ జేన్ ఫాస్టర్ పాత్రలో నటిస్తోంది.[45] డారెన్ అరోనోఫ్‌స్కై యొక్క బ్లాక్ స్వాన్‌ లో ఆమె ఒక అనుభవజ్ఞురాలైన నృత్య కళాకారిణి పాత్రను పోషిస్తోంది[46]. 2010 నవల ఆధారిత ప్రైడ్ అండ్ ప్రీజ్యుడిలస్ అండ్ జాంబీస్ చలనచిత్రంలో పోర్ట్‌మన్ ఎలిజబెత్ బెన్నెత్ పాత్ర పోషిస్తోంది, రిచర్డ్ కెల్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చలనచిత్రానికి ఆమె నిర్మాత కూడా కావడం గమనార్హం.[47]

వ్యక్తిగత జీవితం[మార్చు]

బాల్యం నుంచి పోర్ట్‌మన్ శాకాహారి[48] మరియు 2009లో, జొనాథన్ సాఫ్రాన్ పోయెర్ యొక్క ఈటింగ్ యానిమల్స్ పుస్తకం చదివిన తరువాత ఆమె సంపూర్ణ శాకాహారిగా మారింది,[49] అంతేకాకుండా ఆమె జంతు హక్కుల మద్దతుదారుగా కూడా ఉంది. ఆమె జంతుసంబంధ ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉండటంతోపాటు, ఉన్ని, ఈకలు లేదా చర్మంతో తయారు చేసిన దుస్తులు కూడా ధరించదు. "నా యొక్క కాలిజోళ్లు అన్నీ టార్గెట్ మరియు స్టెల్లా మెక్‌కార్ట్నీ నుంచి కొనుగోలు చేసినవేనని," ఆమె తెలిపింది.[50] ఉన్ని-వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇచ్చేందుకు 2009లో ఏదో ఒక సందర్భంలో PETA పబ్లిక్ సర్వీస్ ప్రకటనలో నటి ఎలీసా సుర్సారాతో కలిసి పోర్ట్‌మన్ కూడా కనిపిస్తుందని ప్రచారం జరిగింది.[51] 2007లో, ఆమె తన సొంత కాలిజోళ్ల బ్రాండ్ వెగాన్‌ను ప్రారంభించింది.[52]

2006 బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో వి ఫర్ వెండెట్టాను ప్రదర్శిస్తున్న పోర్ట్‌మన్.

2007లో, నటాలీ పోర్ట్‌మన్ ఒక డాక్యుమెంటరీ చిత్రం, గొరిల్లాస్ ఆన్ ది బ్రింక్ చిత్రీకరణ జాక్ హన్నాతో కలిసి ర్వాండాకు వెళ్లింది. తరువాత, ఒక నామకరణ కార్యక్రమంలో, పోర్ట్‌మన్ ఒక గొరిల్లా శిశువుకు గుకీనా అనే పేరు పెట్టింది, ఈ పేరుకు "ఆడేందుకు" అనే అర్థం వస్తుంది.[53] బాల్యం నుంచి పోర్ట్‌మన్ పర్యావరణ కారణాల మద్దతుదారుగా ఉంది, బాల్యంలో ఆమె ఒక పర్యావరణ పాటలో మరియు వరల్డ్ పాట్రోల్ కిడ్స్‌గా తెలిసిన నృత్యం బృందంలో పాలుపంచుకుంది.[54] వన్ వాయిస్ మూమెంట్‌లో కూడా ఆమె సభ్యురాలు.[55]

పోర్ట్‌మన్ 2004 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జాన్ కెర్రీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంది మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది. 2004 మరియు 2005 సంవత్సరాల్లో, పేద దేశాల్లో మహిళల-ఆధ్వర్యంలో వ్యాపారాలకు ఆర్థిక సాయం చేసే సూక్ష్మ-రుణాలను ప్రోత్సహించే సంస్థ FINCA ఇంటర్నేషనల్ ప్రచారకర్తగా ఆమె ఉగాండా, గ్వాటెమాలా మరియు ఈక్వడార్‌లలో పర్యటించింది.[56] ఫిలాడెల్ఫియాలో జరిగిన లైవ్ 8 కచేరీలో వేదికవెనుక నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మరియు PBS కార్యక్రమం ఫారిన్ ఎక్స్ఛేంజ్ విత్ ఫరీద్ జకారియా, లో పాల్గొన్న సందర్భంగా సూక్ష్మఆర్థికరుణాల గురించి చర్చించింది.[57] అతిధేయుడు ఫరీద్ జకారియా మాట్లాడుతూ.. తాను "సాధారణంగా ఫాషన్ కారణాల విషయంలో ప్రముఖలకు భిన్నంగా ఉంటానని చెప్పాడు," అయితే ఈ విభాగంలో పోర్ట్‌మన్‌ను కూడా చేర్చాడు, ఎందుకంటే "పోర్ట్‌మన్‌కు ఆమె గురించి పూర్తి తెలుసని వ్యాఖ్యానించాడు."[58] ఏప్రిల్ 29, 2007న ABC ఆదివారం ఉదయం కార్యక్రమం దిస్ వీక్ విత్ జార్జి స్టెఫానోపౌలస్ ఎపిసోడ్, "వాయిసెస్" విభాగంలో,' పోర్ట్‌మన్ మాట్లాడుతూ.. తాను FINCAతో సంయుక్తంగా చేస్తున్న కృషిని మరియు ఇది తృతీయ ప్రపంచ దేశాల్లో మహిళలకు మరియు పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని వివరించింది.[59] 2007 చివరి భాగంలో, పోర్ట్‌మన్ అనేక విశ్వవిద్యాలయాలకు పర్యటనలు నిర్వహించింది, వీటిలో హార్వర్డ్, UCLA, UC బెర్క్లే, స్టాన్‌ఫోర్డ్, ప్రిన్స్‌టన్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం, మరియు కొలంబియా ఉన్నాయి, సూక్ష్మరుణాల ప్రభావంతో వారిలో స్ఫూర్తి నింపేందుకు మరియు తమ కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు సాయపడే గ్రామీణ బ్యాంకింగ్ ప్రచారంలో పాలుపంచుకునేలా వారిని ప్రోత్సహించేందుకు ఆమె ఈ పర్యటనల ద్వారా కృషి చేసింది.[60]

2008 డెమొక్రటిక్ ప్రాథమిక ఎన్నికలు సందర్భంగా, పోర్ట్‌మన్ అధ్యక్ష అభ్యర్థిగా సెనెటర్ హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ఇచ్చింది, అయితే ఒబామాను కూడా అధ్యక్షుడిగా ఇష్టపడతానని తెలిపింది. అంతేకాకుండా మెక్‌కెయిన్ అంటే కూడా తనకు ఇష్టమేనని పేర్కొంది. అయితే అతని యొక్క యుద్ధ విధానంతో తాను విభేదిస్తానని తెలిపింది - ఇది వాస్తవానికి చాలా పెద్ద సవాలు - అయితే నా దృష్టిలో అతను చాలా నీతివంతుడైన వ్యక్తి అని పేర్కొంది."[61] తరువాత సాధారణ ఎన్నికల సందర్భంగా ఆమె ఒబామా తరపున ప్రచారం చేసింది.[62]

మరణం తరువాత జీవితం అనే అంశంపై, ఆమె మాట్లాడుతూ: "నాకు దానిపై విశ్వాసం లేదని స్పష్టం చేసింది. నేను ఇదే జీవితమని విశ్వసిస్తాను మరియు ఇదే ఉత్తమైన జీవన మార్గమని నమ్ముతున్నాను."[10] ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది యూదులు ఉన్నారని నేను భావిస్తున్నాను మరియు నా బిడ్డలను యూదు మత సంప్రదాయాలతో పెంచడమంటే తనకు ఇష్టమని పోర్ట్‌మన్ తెలిపింది: "నేను నా బిడ్డలను యూదు సంప్రదాయాలతో పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తాను, అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా జీవిత భాగస్వామి వచ్చే వ్యక్తి మంచివాడై ఉండాలి."[63]

వోగ్ అనే ఫ్యాషన్ మేగజైన్ మే 2002నాటి సంచికలో, పోర్ట్‌మన్ నటుడు/సంగీత కళాకారుడు లూకాస్ హాస్ మరియు సంగీత కళాకారుడు మోబీ తనకు సన్నిహిత మిత్రులని వెల్లడించింది.[64] అమెరికన్ జానపద గాయకుడు దేవేంద్ర బన్హార్త్[65] యొక్క "కార్మెన్సిటా" అనే పాటకు సంబంధించిన వీడియోలో నటించిన తరువాత, పోర్ట్‌మన్‌కు అతడితో అనుబంధం ఏర్పడింది, అయితే వీరు సెప్టెంబరు 2008లో విడిపోయారు.[66]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

చలనచిత్రం మరియు టెలివిజన్[మార్చు]

2008)

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1994 లెయోన్ మటిల్డా (ది ప్రొఫెషనల్‌ గా గుర్తిస్తారు)
"డెవెలపింగ్" నైనా 23-నిమిషాల లఘుచిత్రం
1995

హీట్

లారెన్ గుస్టాఫ్‌సన్
1996 బ్యూటిఫుల్ గర్ల్స్ మార్టీ
ఎవ్రీవన్ సేస్ ఐ లవ్ యూ లారా డాండ్రిడ్జ్
మార్స్ ఎటాక్స్! టఫీ డాల్
1999 Star Wars Episode I: The Phantom Menace పాడ్మే అమిడాలా
ఎనీవేర్ బట్ హియర్ ఏన్ ఆగస్ట్
2000 వేర్ ది హార్ట్ ఈజ్ నోవాలీ నేషన్
2001 జూలాండర్ స్వపాత్ర కామియో
2002 స్టార్ వార్స్ రెండవ అంకం: అటాక్ ఆఫ్ ది క్లోన్స్ పాడ్మే అమిడాలా
2003 కోల్డ్ మౌంటైన్ సారా
2004 గార్డెన్ స్టేట్ సమంతా
క్లోజర్ ఎలిస్ అయర్స్/జేన్ జోన్స్ ఉత్తమ సహాయనటిగా - చలనచిత్ర విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు
ఉత్తమ సహాయనటిగా శాన్‌డియాగో ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ఉత్తమ సహాయనటిగా అకాడమీ అవార్డు నామినేషన్
సహాయ పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు నామినేషన్
ఉత్తమ సహాయనటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు నామినేషన్
ఉత్తమ సహాయనటిగా లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు నామినేషన్
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు నామినేషన్
ఉత్తమ సహాయనటిగా-చలనచిత్ర విభాగంలో శాటిలైట్ అవార్డు నామినేషన్
2005 స్టార్ వార్స్ మూడవ అంకం: రివెంజ్ ఆఫ్ ది సిత్ పాడ్మే అమిడాలా
ఫ్రీ జోన్ రెబెక్కా ఏప్రిల్ 2006లో అమెరికాలో పరిమిత సంఖ్యలో థియేటర్లలో మాత్రమే విడుదలైంది
2006 వి ఫర్ వెండెట్టా ఏవా హామ్మండ్
పారిస్, జెట్'ఎయిమ్ ఫ్రాన్సిన్
గోయాస్ గోస్ట్స్ ఇనెస్ బిల్బాట్వా & ఎలీసియా
2007 మై బ్లూబెర్రీ నైట్స్ లెస్లీ
ది డార్జిలింగ్ లిమిటెడ్ జాక్ యొక్క మాజీ ప్రియురాలు
"హోటల్ చెవాలియర్" జాక్ యొక్క మాజీ ప్రియురాలు ది డార్జిలింగ్ లిమిటెడ్‌ కోసం 13-నిమిషాల నిడివిగల ప్రచార వీడియో
మిస్టర్ మాగోరియమ్స్ వండర్ ఎంపోరియం మోలీ మహనీ
ది అదర్ బోలెయన్ గర్ల్ అన్నే బోలెయన్
2009 న్యూయార్క్, ఐ లవ్ యు రిఫ్కా
బ్రదర్స్ గ్రేస్ కాహిల్
2010 లవ్ అండ్ అదర్ ఇంపాజిబుల్ పర్స్యూట్స్ ఎమీలియా గ్రీన్‌లీఫ్[67]
హెషెర్

నికోల్ నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది

యువర్ హైనెస్

నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది

బ్లాక్ స్వాన్ నైనా

నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది

2011 థోర్ [45] జేన్ ఫోస్టర్ చిత్రీకరణలో ఉంది

రంగస్థల ప్రదర్శనలు[మార్చు]

ఏడాది నిర్మాణం పాత్ర గమనికలు
1994 రూత్‌లెస్!!
1997 ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ అన్నే ఫ్రాంక్
2001 ది సీగల్

పురస్కారాలు[మార్చు]

గెలిచినవి[మార్చు]

నామినేషన్లు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 "Natalie Portman". Inside the Actors Studio. episode 1101. season 11. 2004-11-21. Bravo. http://www.bravotv.com/Inside_the_Actors_Studio/guest/Natalie_Portman.
  2. D'Angelo, Jennifer (2002-05-23). "Cerebral Celebs Give Up Screen for Studies". FOXNews.com (Fox News Channel). సంగ్రహించిన తేదీ 2008-01-24. 
  3. Poole, Oliver (2002-04-23). "Star Wars actress tells of her own battle with fame". The Daily Telegraph. సంగ్రహించిన తేదీ 2009-03-28. 
  4. 4.0 4.1 "Natalie Portman in Cannes". Bauer-Griffin. 2008-05-21. 
  5. "Rappoport to host Venice Fest - will screen Coen's 'Burn After Reading'". Variety. 2008-08-13. 
  6. Michael Kane. "Portman Bold ... and Bald ... in 'V for Vendetta'". FOX News. సంగ్రహించిన తేదీ 2007-10-18. 
  7. "A 'Garden State' Of Mind". CBS News. సంగ్రహించిన తేదీ 2007-10-18. 
  8. 8.0 8.1 "Starwars.com". Natalie Portman. Archived from the original on 2008-02-01. సంగ్రహించిన తేదీ 2006-05-08. 
  9. "IGN Films". Comic-Con 2005: IGN Interviews Natalie Portman. సంగ్రహించిన తేదీ 2006-06-22. 
  10. 10.0 10.1 10.2 Chris Heath. "The Private Life of Natalie Portman". Rolling Stone. సంగ్రహించిన తేదీ 2006-05-11. 
  11. 11.0 11.1 11.2 Lynn Hirschberg (Holyday 2007). "Screen Goddess: Natalie Portman". The New York Times Style Magazine. 
  12. Stella Papamichael. "Natalie Portman interview". BBC. సంగ్రహించిన తేదీ 2006-05-01. 
  13. "The Harvard Crimson :: News :: Housing Frenzy Welcomes Freshmen". 
  14. "Natalie Portman Strikes Back". 
  15. Mary-Lea Cox (March 31, 2006). "Hollywood Star Leads Columbia Class in Discussion of Political Violence". Columbia News. సంగ్రహించిన తేదీ 2006-04-25. 
  16. "5 facts about Natalie Portman". Something Jewish. 2002-05-15. సంగ్రహించిన తేదీ 2006-05-09. 
  17. "Biography for Natalie Portman". IMDb. 
  18. 18.0 18.1 David Letterman (host) (1997-11-24). "Natalie Portman". The Late Show. CBS.
  19. "Natalie Portman Shows Off Her German Skills". femalefirst.co.uk. సంగ్రహించిన తేదీ 2006-05-09. 
  20. Bachorz, Boris (May 20, 2005). "'Free Zone': movie on Mideast without borders". ezilon.com. సంగ్రహించిన తేదీ 2006-05-09. 
  21. Hershlag, Natalie; Ian Hurley and Jonathan Woodward (October 1998), "A Simple Method To Demonstrate the Enzymatic Production of Hydrogen from Sugar", Journal of Chemical Education 75 (10): 1270 
  22. Baird, Abigail A.; Kagan, J.; Gaudette, T.; Walz, K.A.; Hershlag, Natalie; Boas, D.A. (August 2002), "Frontal Lobe Activation During Object Permanence: Data from Near-Infrared Spectroscopy" (PDF), NeuroImage (Academic Press) 16 (4): 1120–1126, doi:10.1006/nimg.2002.1170 
  23. 23.0 23.1 James Ryan (February 25, 1996). "UP AND COMING: Natalie Portman; Natalie Portman (Not Her Real Name)". The New York Times. 
  24. Ariel Levy (November 2005). "Natalie Portman Will Change Your Life". Blender. 
  25. "Golden Globe winners". BBC NEWS. 2000-01-24. 
  26. Mary Elizabeth Williams (1999-11-12). "Anywhere But Here". Salon. 
  27. Pat O'Brien (host) (1999-08-24). "College Queen". Access Hollywood.
  28. Ben Brantley (2001-08-13). "Streep Meets Chekhov, Up in Central Park". The New York Times. 
  29. "Academy Award Database: Natalie Portman". Academy of Motion Picture Arts and Sciences. సంగ్రహించిన తేదీ 2008-03-01. 
  30. "Golden Globe Award Database: Natalie Portman". Hollywood Foreign Press Association. సంగ్రహించిన తేదీ 2008-03-01. 
  31. "2005 Domestic Grosses". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2009-09-15. 
  32. "Goya's ghosts". Age. 2006-11-10. 
  33. ""Saturday Night Live" Natalie Portman/Fall Out Boy (2006)". 
  34. "MSN". 
  35. "Video of Portman's appearance on Saturday Night Live". 
  36. "'SNL' Star Andy Samberg Recruits T-Pain, Justin Timberlake, Norah Jones For New Album". 
  37. 37.0 37.1 "ComingSoon.net". Natalie Portman: From A(midala) to V. సంగ్రహించిన తేదీ 2006-03-13. 
  38. "Anarchy in the UK! JoBlo.com talks to V for Vendetta star Natalie Portman". JoBlo.com. సంగ్రహించిన తేదీ 2006-03-16. 
  39. Mike Errico (February 2007). "Hottest Women of ... Film and TV!". Blender. 
  40. Richard Corliss; Mary Corliss (2007-05-16). "Blue Skies and Blueberry Nights". TIME. 
  41. "Portman and Bana flirting with Boleyn film". Reuters. 2006-06-21. సంగ్రహించిన తేదీ 2006-06-21. 
  42. Liz Corcoran (2007-05-24). "Natalie Portman Stars in New Paul McCartney Video". PEOPLE. 
  43. "Want to See Nat Naked?". Sky News. 2007-09-28. సంగ్రహించిన తేదీ 2007-09-28. 
  44. Siegel, Tatiana (2007-10-02). "Natalie Portman to star in 'Brothers'". Variety. సంగ్రహించిన తేదీ 2007-10-03. 
  45. 45.0 45.1 "Natalie Portman joins the cast of `Thor'". Associated Press. 2009-07-13. సంగ్రహించిన తేదీ 2009-07-04. 
  46. బ్లాక్ స్వాన్ సెట్‌లో నటాలీ పోర్ట్‌మన్ యొక్క తొలి ఛాయాచిత్రాలు
  47. Micheal Flemming (2009-12-11). "Natalie Portman to slay zombies". Variety. సంగ్రహించిన తేదీ 2009-12-11. 
  48. McLean, Craig (2007-11-25). "More than meets the eye". Observer. 
  49. Natalie Portman (2009-10-28). "Jonathan Safran Foer's Eating Animals Turned Me Vegan". Huffington Post. సంగ్రహించిన తేదీ 2009-10-28. 
  50. PETA ఫాటల్ ఫ్యాషన్ పోర్ట్‌మన్ సేస్ 'నో' టు ఫుర్, లెదర్ అండ్ ఫెదర్స్ అక్టోబరు 30న సేకరించబడింది
  51. Sana, Elena (2008-07-04). "Lucas and Sursara Fight the Fur, do PETA with Portman" (Reprint from Ecorazzi). Ecorazzi.com. సంగ్రహించిన తేదీ 2008-07-10. 
  52. "Natalie Portman's vegan shoe line". China Daily. 2007-12-26. 
  53. Ileane Rudolph (October 26, 2007). "Natalie Portman Braves the Jungle's Species". TV Guide. 
  54. ""CBS Late Show with David Letterman"". 2006-03-14. సంగ్రహించిన తేదీ 2008-04-13. 
  55. అధికారిక వెబ్‌సైట్
  56. "Celebrating 20 Years of Village Banking". villagebanking.org. సంగ్రహించిన తేదీ 2006-05-01. 
  57. "In Focus: Natalie Portman and Microfinance". foreignexchange.tv. సంగ్రహించిన తేదీ 2006-05-01. 
  58. Press, Joy (August 16, 2005). "The Interpreter". The Village Voice. 
  59. "Voices, Funnies, and In Memoriam". ABC News. May 3, 2007. 
  60. "FINCA in the News". సంగ్రహించిన తేదీ 2008-01-06. 
  61. Levy, Ariel (2008-03-05). "The Natural". Elle. సంగ్రహించిన తేదీ 2009-11-25. 
  62. "Obama's presidential campaign is getting help in Toledo this weekend". 2008-10-12. 
  63. "Help find Natalie a Jewish man". Ynetnews. 2006-07-10. 
  64. Eve MacSweeney (May 2002). "Planet Natalie". Vogue. సంగ్రహించిన తేదీ 2006-03-15. 
  65. ""Trans World News: Natalie Portman Dating Devendra Barnhart"". 2008-04-10. సంగ్రహించిన తేదీ 2008-04-12. 
  66. ""Devendra Barnhart splits with Natalie Portman"". 2008-09-25. సంగ్రహించిన తేదీ 2009-07-03. 
  67. "Natalie Portman falls in 'Love'". Variety. 2008-10-27. సంగ్రహించిన తేదీ 2008-10-29. 

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.