నపుంసకుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని నపుంసకులు అంటారు. వీరిని వ్యవహారంలో హిజ్రా, కొజ్జా , గాండు, పేడి అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. భిక్షాటన మరియు వ్యభిచారం వీరి ప్రధాన వృత్తులు.

చరిత్ర[మార్చు]

భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడినది. పాండవ వనవాసములో అర్జునుడు బృహన్నల్ల గా నపుంసకుడి వేషధారణలో జీవిస్తాడు. అలాగే భీష్ముడు మహాభారత యుద్ధములో ఒక నపుంసకుడితో పోరాడడానికి నిరాకరిస్తాడు.

గోవా లోని ఒక నపుంసకుడు

జీవన విధానము[మార్చు]

హిజ్రాలు సమూహాలుగా జీవిస్తారు. వీరికి సామాజిక ఆదరణ కరువవడంతో అందరూ కలసి ఒకే గృహ సముదాయములో జీవిస్తారు. వీరి ఇంటికి పెద్దగా ఒకరిని ఎన్నుకొంటారు. వీరిని దీదీ గా వ్యవహరిస్తారు. డబ్బు సంపాదన వీరు అడ్డుకోవడం బలవంతపు వసూళ్ళ రీతిలో ఉంటుంది. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో తమకు గత్యంతరము లేక ఈ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తున్నదని వీరి వాదన. ఇంకొందరు వబిచారవృత్తి స్వీకరిస్తారు. ఈవిధముగా చేసేవారు సాధారణముగా తమ అంగాలను శస్త్రచికిత్స ద్వారా మార్చుకొంటారు. వీరు గుద రతి ని అవలంభించడముతో పరోక్షముగా అనేక సుఖ వ్యాధుల బారిన పడుతుంటారు. వయసు మళ్ళిన నపుంసకుల్లో మరణం ఈ వ్యాధుల కారణం గానే వస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

వీరి గురించిన రచనలు[మార్చు]

  • అగర్వాల్, అనుజ , Gendered Bodies: The Case of the 'Third Gender' in India".In Contributions to Indian Sociology, new series, 31 (1997): 273–97.
  • అహ్మద్, మోనా మరియు దయనితా సింగ్ (ఛాయాచిత్రగ్రాహకుడు). Myself Mona Ahmed. స్కేలో ప్రచురణ, 15 సెప్టెంబరు 2001. ISBN 3-908247-46-2
  • గనాన్, షేన్ ప్యాట్రిక్. Translating the hijra: The symbolic reconstruction of the British Empire in India. PhD Thesis. అలబామా విశ్వవిద్యాలయము, 2009.
  • జామి, హుమరియా. "పాకిస్తాన్ లోని హిజ్రాల పరిస్థితి", జాతీయ మానసిక పరిశోధనాలయము, క్వైద్-ఇ-ఆజమ్ విశ్వవిద్యాలయము (nd, 2005?)
  • మల్లోయ్, రూత్ లోర్, మీన్ బాలాజీ మరియు ఇతరులు. Hijras: Who We Are. Toronto: థింక్ ఏషియా, 1997.
  • జాన్ మోనీ. Lovemaps. ఇర్వింగ్టన్ ప్రచురణ, 1988. Page 106. ISBN 0-87975-456-7
  • నంద, సెరేనా. Neither Man Nor Woman: The Hijras of India. వర్డ్స్ వర్త్ ప్రచురణ, 1998. ISBN 0-534-50903-7
  • తల్వార్, రాజేష్. The Third Sex and Human Rights. గ్యాన్ ప్రచురణాలయము, 1999. ISBN 81-212-0266-3

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నపుంసకుడు&oldid=863158" నుండి వెలికితీశారు