నయాగరా జలపాతం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
నయాగరా జలపాతం (Niagara Falls) అమెరికా రాష్ట్రమైన న్యూయార్క్ మరియు కెనడా నగరాల మద్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
దీనికాపేరు ఎలా వచ్చిందన్న దానికి వివిధ సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రూస్ ట్రిగ్గర్ అనే ఇరాకీ శాస్త్రజ్ఞుడు అభిప్రాయాల ప్రకారం, 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి మ్యాప్ లో చూపించినట్లుగా ఈ ప్రాంతంలో నయాగరేగా అనే జాతికి చెందిన ప్రజలు నివసించేవారనీ, దాన్నుంచి ఈ జలపాతానికి ఈ పేరు వచ్చిఉండవచ్చునని అతడి భావన.
[మార్చు] పరిశ్రమలు, వాణిజ్యంపై దీని ప్రభావం
దీనివల్ల ఉత్పన్నమయ్యే అపారమైన శక్తిని విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చునని ఏనాడో గుర్తించడం జరిగింది. 1759 లో మొట్టమొదటి సారిగా అటువంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డేనియల్ జాన్‌కైర్ తన సామిల్ అవసరాలకోసం దీనిపై ఒక కాలువను నిర్మించాడు.
[మార్చు] భౌగోళిక స్వరూపం
నయాగరా జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది.ఒకటి హార్స్‌షూ ఫాల్స్ రెండవది అమెరికన్ ఫాల్స్ .హార్స్ షూఫాల్స్ ఎత్తు 173 అడుగులు.అమెరికన్ ఫాల్స్ ఎత్తు 70-100 అడుగులు.హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 2,600 అడుగులు,అమెరికన్ షూ ఫాల్స్ వెడల్పు 1,060 అడుగులు. ఫ్లో సీజన్లో జలపాతం నుండి పడే జలం ఒక సెకండుకు 2,02,000 ఘనపు అడుగులు.ఈ జలపాతం కెనడాలోని లేక్ ఎర్రీ సరసు నిండి పొర్లి ప్రవహించే నీటి వలన ఏర్పడింది.ఈ జలం నయాగరా జలపాతంగా పడి నయాగరా నదిగా ప్రవహించి ఒంటారియా సరసు చేరుకుంటుంది.ఇది వసంతకాలం చివరి భాగం లేక ఎండా కాలం ఆరంభంలో అత్యధికగా ప్రవహిస్తుంది.వేసవి కాలంలో 90% నీటిని హార్స్ షూ ఫాల్స్ లో వదిలి 10% నీటిని జలవినియోగానికి వాడుకుంటారు.హార్స్ షూ ఫాల్స్ పైభాగంలో లాకులను ఉపయోగించి నీటిని క్రమబద్దీకరిస్తారు.పగటి పూట 1,00,000 ఘనపు అడుగుల నీటిని రాత్రి మరియు చలికాలంలో 50,000 ఘనపు అడుగుల నీటిని జలపాతానికి వదిలివేస్తారు.నయాగరా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్వర్యంలో 1950లో జరిగిన ఒప్పందాన్ని అనుసరించి నీటిని క్రమబద్దీకరిస్తుంటారు.అమెరికన్ వైపునుండి కొంచం ప్రక్కకు తిరిగినట్లు కనిపించే ఈ జపాతం కెనడా నుండి చక్కగా ఎదురుగా కనిపిస్తుంది.ఈ జలపాతం టొరంటో నుండి రెండు గంటల వాహన ప్రయాణ దూరంలో ఉంది.
నయాగరా జలపాతం విస్‌కాన్‌సిన్ గ్లాసియర్స్ కరగటం కారణంగా 10,000 సంవత్సరాల పూర్వం నుండి ఏర్పడింది.ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్ ఈ కారణంగా ఏర్పడ్డాయని అభిప్రాయ పడుతున్నారు.మొత్తం చేరి బృహత్తర హిమ ఖండం ఏర్పడటంతోీవి కరిగినప్పుడు ఏర్పడే నీటిని క్రమ పరచడానికి నదీజలాల కాలువలను వెడల్ప చేసి సరసులు ఏర్పరచి ఆనకట్టలు నిర్మించారని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు.గ్లాసియర్ డ్రిఫ్ట్ క్రింద ఒక లోయ మునిగిపోయినట్లు శాస్త్రజ్ఞుల విశ్వాసం.
[మార్చు] చరిత్ర
నయాగరాకు ఈ పేరు రావటంలో భిన్నాప్రాయాలు ఉన్నాయి.ఇరోక్వియన్ స్కాలర్ బ్రూస్ ట్రిగ్గర్పరిశోధన అనుసరించి ఈ ప్రాంతంలో నివసించిన న్యూట్రల్ ఫెడరసీకి చెందిన ఉత్తర అమెరికా ఆదివాసులచే ఈ ప్రాంతం నయాగగరిగా గా వర్ణించ బడినట్లు 17శతాబ్ధపు చివరికాలా నికి చెందిన ఫ్రెంచి భౌగోళికచిత్రాలు ఆధారంగా తెలుస్తుంది.నయాగగరిగా పేరు నుండి నయాగరా వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.
1604లో ఫ్రెంచ్‌దేశస్థుడైనశామ్యుఏల్ డీ చాప్లెయిన్ కెనాడా పరిశోధనలో భాగంగా ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లు అతని వ్రాతలలో వర్ణించబడింది. మొదటిగా అతని సమూహంలోని సభ్యుల ద్వారా ఈ ప్రాంతంలోని జలపాతసౌందర్యం విని దానిని సందర్శించినట్లు వ్రాసుకున్నాడు.ఫిన్నిష్ స్వీడిష్ ప్రకృతి ఆరాధకుడు పెర్ కామ్ 17 వశతాబ్ధపు ఆరంభంలో ఈ ప్రదేశాన్ని చేరుకున్నట్లు అతను వ్రాసిన అనుభవాలు చెప్తున్నాయి.1677లో బెల్జియన్ ఫాదర్ లూయిస్ హెన్నెపిన్ ఈ ప్రదేశాన్ని పరిశీలించి దానిని గురించి వ్రాసుకున్నాడు.తరవాతి కాలంలో ఇక్కడకు చేరిన రెనె రాబర్ట్ కేవ్‌లియర్,సియూర్ డీ లాసెల్లె ల వలన ఈ జలపాతాలు యురోపియన్ల దృష్ట్ని ఆకర్షించాయి.హెన్నెపిన్ కంటే 35 సంవత్సరాల మునుపే ఫ్రెంచ్ జీసూట్ రివరెండ్ పౌల్ రాగ్యున్యూ కెనడాలోని హురాన్ ఫస్ట్ నేషన్ కోసం పనిచేస్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు విశ్వసనీయమైన ఆధారాలు చెప్తున్నాయి. న్యూట్రల్ నేషన్లో కొంతకాలం నివసించిన జీన్ బ్రీబ్యూఫ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు ఆధారాలూ చెప్తున్నాయి.
18వ శతాబ్ధంలో పర్యాటకం ప్రబలం కాసాగింది శతాబ్ధపు మద్యకాలంనాటికి అది ఇక్కడి ముఖ్య పరిశ్రమగా మారింది.19వ శతాబ్ధపు ఆరంభ కాలంలో నెపోలియన్ బొనాపార్ట్స్ సోదరుడు తన వివాహానంతరం సరికొత్త దంపతులుగా ఇక్కడకు వచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.1837 ది కెరోలి అఫైర్ సమయంలో తిరుగుబాటుదారులకు సరుకు చేరవేస్తున్న కెరోలిన్ ఓడను కాల్చి ఈ జలపాతంలో పడివేయబడింది.నయాగరాను దాటటానికి వంతన అవసరాన్ని గుర్తించి 1848లో ఒక వంతెనను నిర్మించి దానికి చార్ల్స్ ఎల్లెట్స్ నయాగరా బ్రిడ్జ్ గా నామకరణం చేశారు.1855లో ఈ వంతన స్థానంలో జర్మన్ పూర్వీకంగా కలిగిన జాన్ అగస్టస్ రోయ్‌బ్లింగ్స్చే నయాగరా ఫాల్ల్స్ సస్పెన్‌షన్ బ్రిడ్జ్పునర్నిర్మించబడింది.అమెరికన్ సివిల్ వార్ తరవాత న్యూయార్క్ సెంట్రల్ రైల్ రోడ్ నయాగరా జలపాతం ఉల్లాస యాత్రకు మరియు నూతనదంపతులకు విహారయాత్రకు అనువైనదిగా ప్రకటించి ప్రజాదరణ కలిగించారు.రైల్ ప్రయాణీకుల రద్దీ పెరిగిన తరవాత 1866లో రోయ్‌బ్లింగ్స్ కొయ్య మరియు రాళ్ళతో నిర్మించిన వంతెన స్థానంలో ప్రస్తుతం రైళ్ళు ను సహితం దాటిస్తున్న స్టీల్ వంతెన లెఫర్ట్ బక్‌చే నిర్మించబడింది.జలపాతం సమీపంలోని మొదటి స్టీల్ ఆర్చ్‌వే బ్రిడ్జ్ నిర్మాణం 1897లో పూర్తి అయింది.అమెరికా కెనడాదేశాలను కలిపే ఈ వంతెన పేరు వైర్ల్ పూల్ రాపిడ్ బ్రిడ్జ్ .ఈ వంతెనపై రైళ్ళు , వాహనాలు మరియు పాదచారులు ప్రయాణం చేయవచ్చు.ఇది కెనడా సరిహద్దు దళాల అధికారపరిమితిలో ఉంటుంది.నయాగరా జలపాతంకు అతి సమీపంలో మూడవ వంతెన రెయిన్ బో బ్రిడ్జ్ 1941 నయాగరా జలపాతం బ్రిడ్జ్ కమీషన్‌చే నిర్మాణం నిర్మించబడింది.ఈ వంతెనద్వారా ఇరుదేశాలప్రజలు అమెరికా మరియు కెనడాల సరిహద్దు పరిశోధనతో ప్రయాణిస్తూ ఉంటారు.మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆటోమొబైల్స్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుతో ఇక్కడి పర్యాటకరంగం గణనీయమైన అభివృద్ధిని సాధంచింది.
[మార్చు] వాణిజ్యమూ పరిశ్రమలు
నయాగరా జలపాతం యొక్క అపారశక్తి దీర్గకాలం నూడి ప్రముఖ విద్య్దుత్పత్తి వనరుగా గుర్తించబడింది.మొట్టమొదట 1759లో జాన్ కైరీ చిన్న కాలువను నిర్మించి అతని సామిల్ నడపటానికి కావలసిన విద్యుదుత్పత్తి చేయడం ప్రారంభించాడు.ఆ తరువాత 1805లో అగస్టస్ పీటర్ అండ్ పోర్టర్ న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం నుండి జలపాత ప్రాంతాలను కొన్న తరవాత ఇక్కడి కాలువను వెడల్పు చేసి తమ పరిశ్రమకు కావలసిన విద్య్త్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.1853లో కాగితాలపై రూపుదిద్దుకున్న జలౌత్పత్తి మరియు గనుల పరిశ్రమ ఎట్టకేకలకు 1881 నాటికి జాకబ్ స్కోల్‌కోఫ్ నాయకత్వంలో నిర్మాణపు పనులను పూర్తి చేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంబించింది.ఈ ప్రాజెక్ట్ నుండి జ్స్లపాతాన్ని మరియు సమీపంలోని ఊరిని ప్రకాశవంతం చేయడానికి కావలసినంత విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కాసాగింది.
నికోలా టెల్సా త్రీ ఫేస్ కరెంట్ పద్దతిని కనిపెట్టి ప్రత్యామ్నాయ పద్దతులలో విద్యుతుత్పత్తిని సాధించడంవలన సుదూరతీరాలకు కూడా విద్యుత్తును సరఫరా చేయడం సాధ్యమైంది.న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం నయాగరా జలపాతం సమీపంలో నికోలా టెల్సా కు జ్ఞాపక చిహ్న నిర్మాణాన్ని కావించింది.స్కోల్‌కోఫ్ సంస్థకు చెందిన ఉద్యోగి ప్రత్యామ్నాయ పద్దతులలో విద్యుదుత్పత్తి చేయడానికి రూపకల్పనకు అనుకూలంగా జార్జ్ వెస్టింగ్ హౌస్ ను బాడుగకు తీసుకోవడం వెస్టింగ్ హౌస్ ఆధ్వర్యంలో ప్రపంచపు తొలి ఎసి విద్యుత్ ఉత్పత్తి వినియోగం చేయడానికి పునాది వేసింది.టెల్సా మరియు ఎలెల్ నన్ శక్తివంతంగా 5% కంటే తక్కువ నష్టంతో రెండు మైళ్ళ దూరం వరకూ ఎసి విద్యుత్ సరఫరా చేయవచ్చని నురూపించారు.1896లో నాలుగు సంవత్సరాల అనంతరం జెపీమోర్గన్,జాన్ జాకబ్ అస్టర్ ఐవి మరియు వాడర్ బుల్ట్స్ ఆర్ధిక సహాయంతో వారు భూఅంతర్భాగ 1,00,000 అశ్వశక్తి(హార్స్ పవర్)విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు.ఈ ప్రాజెక్ట్ సాయంతో విద్యుత్తును 20 మైళ్ళ దూరంలో ఉన్న బఫెల్లో సిటీ వరకు విద్యుత్ సరఫరా చేసే శక్తిని సాధించారు.స్విజ్ సంస్థ ఫీచ్ అండ్ పిక్కర్డ్ ఈ ప్రాజెక్ట్కు కావలసిన సాంకేతిక సహాయం చేసింది.కెనడా దేశానికి చెందిన ప్రైవేట్ రంగ సంస్థలూ నయాగరా జలపాతం నుండి జలవిద్యుదుత్పత్తిని చేయడం ప్రారంభించాయి.చివరికి 1906లో కెనడా ప్రభుత్వం ప్రాజెక్టును కొనుగోలు చేసి ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకువచ్చి వివిధ పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయసాగింది.50%నుండి 75% నయాగరా నదీ ప్రవాహం టన్నెల్స్(భూ సొరంగం)ద్వారా ప్రవహింపచేసి జలవిద్యుదుత్పత్తి చేసి అమెరికా మరియు కెనడా దేశాల పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
నయగరా నది పై ఉన్న అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ కేంద్రం కెనడా దేశంలోని సర్ ఆడమ్ బెక్ 1 అండ్ 2, రాబర్ట్ మోసెస్ నయగరా పవర్ ప్లాంట్ మరియు అమెరికా వైపున్న లెవిస్టన్ పంప్ జనరేటింగ్ ప్లాంట్.నయాగరా విద్యుదుత్పత్తి శక్తి మొత్తం 4.4 జి డబ్ల్యూ వరకు ఉంటుంది.ఇందుకు సాంకేతిక సహాయం అందించిన ఘనత ఎడ్వర్డ్ డీన్ ఆడమ్స్‌కు చెందుతుంది .2005 ఆగస్ట్‌లో సర్ ఆడమ్ బెక్ సంస్థల భాద్యతలు స్వీకరించిన ఒంటారియా పవర్ జెనరేషన్ ప్లాంట్6.5 మైళ్ళ సొరంగనిర్మాణాన్ని విద్యుతుత్పత్తి కోసం నిర్మించనున్నట్లు ప్రకటించింది.ఇది 2009 నాటికి నిర్మాణపు పనులను పూర్తి చేసుకుని సర్ ఆడమ్ బెక్ విద్యుదుత్పత్తి శక్తిని 182 మెగా వాట్స్‌కు పెంచవచ్చని భావిస్తున్నారు.
[మార్చు] ప్రయాణసౌకర్యాలు
[మార్చు] సంరక్షణా ప్రయత్నాలు
నయాగరా జలపాతం రచయితల,కళాకారులకు,పరిశోధకులకు,చలన చిత్రతయారీ దారులకు విద్యుత్‌చ్చక్తి ఉత్పత్తిదారులకు ప్రేరణ కలిగిస్తూ తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది.ఇక్కడి జలపాత సౌందర్యం అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తుంటాయి.1870 వరకు పర్యాటకకేంద్రంగా మాత్రమే ఉన్న నయాగరా ఆతరవాత కాలంలో వాణిజ్యపరమైన అవసరాలకోసం ఆకర్షించడం మొదలైంది.వాణిజ్యపరమైన విద్యుత్తయారీకి గోట్ ఐలాం,డు రూపం మారిపోసాగింది.యుఎస్ కనసర్వేషన్ మూవ్‌మెంట్ సమయంలో సామాన్య ప్రజలు నయాగరాకు వచ్చి స్థిరపడటం మొదలైంది.హడ్సన్ రివర్ స్కూల్ కళాకారుడుఫెడరిక్ ఎడ్విన్ చర్చ్,ఫెడరిక్ లా ఆల్మ్‌స్టెడ్ ,మరియు కళాకారుడు హెన్రీ హబ్‌సన్ రిచర్డ్‌సన్ లాంటి ప్రముఖులూ వీరిలో ఉన్నారు.చర్చ్ అప్పటి కెనడా దేశ గవర్నర్‌జనరల్ లార్డ్ డ్యూఫరిన్దగ్గరకు వెళ్ళి పబ్లిక్ పార్క్ నిర్మాణానికి కావలసిన అంతర్జాతీయ చర్చలు జరపాలని ప్రతిపాదించాడు.
అమెరికన్ భాగంలోని గోట్ ఐలాండ్ పునరుద్దరణకు ఆ చర్చలు నాంది పలికాయి.
[మార్చు] బయటి లింకులు
- Niagara Falls - History of Power Historical and engineering data on the U.S. and Canadian power stations
- Geology of Niagara Falls
- Panorama Niagara Falls Panorama found at Queen's Park, Toronto.
- Niagara Falls Guidebooks from the 19th Century Digitally-recreated 19th century guidebooks
- Historic Niagara Digital Collections
- US Army Corps of Engineers The US Army Corps of Engineers completely blocked the flow of water over the American Falls in 1969.