Coordinates: 14°45′41″N 78°30′42″E / 14.761354259572862°N 78.5117393328157°E / 14.761354259572862; 78.5117393328157

నరసింహాపురం (ప్రొద్దుటూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసింహాపురం
—  రెవిన్యూ గ్రామం

<!-

- images and maps ----------->  —
నరసింహాపురం is located in Andhra Pradesh
నరసింహాపురం
నరసింహాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°45′41″N 78°30′42″E / 14.761354259572862°N 78.5117393328157°E / 14.761354259572862; 78.5117393328157
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ప్రొద్దుటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516362
ఎస్.టి.డి కోడ్

నరసింహాపురం, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం లోని, పెద్దశెట్టిపల్లె పంచాయితీకి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామంలోనే అతి పురాతనమైన నరసింహ స్వామి దేవాళయం ఉంది

భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ప్రొద్దుటూరు పట్టణానికి పడమర దిశలో, ప్రొద్దుటూరు - జమ్మలమడుగు రహదారి లో, ప్రొద్దుటూరు నుండి 6 కి.మీ ల దూరంలో ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఒకటి ఉంది. గుడియందలి శిల్ప కళని గమనించినట్లయితే విజయనగర రాజుల చివరి కాలంలో అనగా 17వ శతాబ్దం చివరలో నిర్మించినట్లుగా అనుకోవచ్చు. గుడి నిర్మాణానికి దారితీసిన కథ ఈ విధంగా చెప్పుకుంటారు.

పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రామ దక్షిణ వాహినిగా ప్రవహించు పెన్నానదిలో శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహం కొట్టుకొని రాగా కొందరు ప్రొద్దుటూరు, రామేశ్వరం నివాసులు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళుటకు ప్రయత్నించిరి. అపుడు కొత్తపేట గ్రామానికి చెందిన సంజమ్మ రెడ్డి గారి పూర్వీకులు, దిబ్బిరెడ్డి మొదలగు వారు, ఇక్కడ దొరికిన విగ్రహం ఇక్కడే వుండాలని పట్టుబట్టి ఆ విగ్రహాన్ని కొత్తపేట గ్రామానికి తలలించ ప్రయత్నము చేసిరి. మార్గమద్యంలో భక్తులు అలసట చెంది విగ్రహాన్ని ఇప్పుడు శ్రీ లక్ష్మినరసింహస్వామి వున్నచోట నిలిపి వుంచిరి. మరల ఆ భక్తులు ఆ విగ్రహాన్ని తీసుకు వెళ్ళుటకు ప్రయత్నించగా ఆవిగ్రహం కదలకుండా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. దానితో సంజమ్మ రెడ్డి గారి పూర్వీకులు ఇదే శ్రీలక్ష్మినృసింహస్వామి ఉండవలసిన చోటు అని గ్రహించి అక్కడ దేవాలయాన్ని కట్టించిరి. దైవ నిత్య పుజా కైంకర్యార్థం కొందరు ప్రజలకి గుడిసెలు వేసుకొనుటకి అనుమతించారు రెడ్డిగారు. అప్పుడు "శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం" కేంద్రంగా నరసింహకొట్టాలు (కొట్టాలు అనగా బోద గడ్డితో తయారయిన గుడిసెలు) అనే క్రొత్తగ్రామం వెలసినది. ఈ మధ్య కాలంలో నరసింహాపురం అని మారింది. తరువాత గ్రామం మధ్యలో వున్న ""శ్రీ లక్ష్మినరసింహస్వామి కాలక్రమంలో ఈ గ్రామానికి చివరికి వచ్చాడు అని పెద్దలు చెప్పేవారు.

గుడిని ఈ మధ్య అభివృద్ధి చేశారు. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒకానొక పవిత్ర వనంగా చెప్పబడిన గుడి పరిసరాలలోని పెద్ద పెద్ద వృక్షములు కొట్టివేయబడినవి.

ప్రతి వైశాఖ మాసంలో నరసింహ జయంతికి కళ్యాణం, కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం జరుగుతింది. ప్రతి మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.

శివాలయము[మార్చు]

నరసింహాపురంకి పడమటి దిశలో పొలాలలో ఒక పురాతన శివాలయము ఉంది. ఇందులోని శివలింగమును ఆంజనేయుడు ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటారు. ముక్తి రామేశ్వరం కథలోని ఆంజనేయునిచే తెప్పించబడిన పంచ శివలింగాలలో ఇది ఒకటి పెద్దలు చెప్పుదురు. ఇక్కడ శివలింగము సాధారణంగా కనిపించే శివలింగాల వలే గుండుగా కాకుండ భిన్న ఆకారంలో ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో 90 శాతం ప్రజలు తొగటవీర క్షత్రియ కులానికి చెందిన వారై ఉన్నారు. వీరి వృత్తి చేనేత. వీరి కుల దైవం చౌడేశ్వరీ దేవి. వీరు పట్టు వస్త్రాలు అనగా చీరలు, పావడాలు, అలానే నూలు వస్త్రాలగు చీరలు, లుంగీలు మొదలగునవి నేస్తారు.ఊరికి ఉత్తర దిశలో హరిజనులు కలరు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]