నల్గొండ జిల్లా

వికీపీడియా నుండి
(నల్గొండ నుండి దారిమార్పు చెందింది)
  ?నల్గొండ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of నల్గొండ, India
అక్షాంశరేఖాంశాలు: 17°03′N 79°16′E / 17.05, 79.27
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 14,240 కి.మీ² (5,498 చ.మై)
ముఖ్య పట్టణము నల్గొండ
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
34,83,648 (2011)
• 245/కి.మీ² (635/చ.మై)
• 429000
• 1758061
• 1725587
• 57.84(2001)
• 70.19
• 45.07

నల్గొండ లేదా నల్లగొండ దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుగల జిల్లాకు రాజధాని. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన మెదక్ మరియు వరంగల్ జిల్లాలు, దక్షిణాన గుంటూరు మరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లాలు, తూర్పున ఖమ్మం మరియు కృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాలు సరిహద్దులు.

విషయ సూచిక

[మార్చు] జిల్లా చరిత్ర

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపేటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రదమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు. వాడపల్లి తీర్ధం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ఇది కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం.

[మార్చు] భౌగోళిక స్వరూపం

[మార్చు] నదులు

[మార్చు] ఆర్ధిక స్థితి గతులు

[మార్చు] డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1]. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).

1. బొమ్మలరామారం

2. తుర్కపల్లి

3. రాజాపేట

4. యాదగిరి గుట్ట

5. ఆలేరు

6. గుండాల

7. తిరుమలగిరి

8. తుంగతుర్తి

9. నూతనకల్లు

10. ఆత్మకూరు(S)

11. జాజిరెడ్డిగూడెం

12. శాలిగౌరారం

13. మోతుకూరు

14. ఆత్మకూరు(M)

15. వలిగొండ

16. భువనగిరి

17. బీబీనగర్

18. పోచంపల్లి

19. చౌటుప్పల్

20. రామన్నపేట

21. చిట్యాల

22. నార్కెట్‌పల్లి

23. కట్టంగూర్

24. నకిరేకల్

25. కేతేపల్లి

26. సూర్యాపేట

27. చివ్వెంల

28. మోతే

29. నడిగూడెం

30. మునగాల

31. పెన్‌పహాడ్‌

32. వేములపల్లి

33. తిప్పర్తి

34. నల్గొండ

35. మునుగోడు

36. నారాయణపూర్

37. మర్రిగూడ

38. చండూరు

39. కనగల్

40. నిడమానూరు 41. త్రిపురారం

42. మిర్యాలగూడ

43. గరిడేపల్లి

44. చిలుకూరు

45. కోదాడ

46. మేళ్లచెరువు

47. హుజూర్‌నగర్

48. మట్టంపల్లి

49. నేరేడుచర్ల

50. దామరచర్ల

51. అనుముల

52. పెద్దవూర

53. పెద్దఅడిశర్లపల్లి

54. గుర్రమ్‌పోడ్‌

55. నాంపల్లి

56. చింతపల్లి

57. దేవరకొండ

58. గుండ్లపల్లి

59. చందంపేట

నల్గొండ జిల్లాలో ఆ మండలం ఉన్న ప్రదేశమును చూపిస్తున్న పటము

[మార్చు] కొన్ని గణాంకాలు, వాస్తవాలు

[మార్చు] రవాణా వ్వవస్థ

[మార్చు] జనాభా లెక్కలు

జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ 32,38,000 (2001) • 252/కి.మీ² (653/చ.మై) • 429000 • 1646000 • 1591000 • 57.84 • 70.19 • 45.07

[మార్చు] సంస్కృతి

[మార్చు] పశుపక్ష్యాదులు

[మార్చు] విద్యాసంస్థలు

[మార్చు] ఆకర్షణలు

యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థానం
  • బుద్ధుడి శిల్పం  :-

హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.

ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.

  • నాగార్జున కొండ  :-

మానవ నిర్మిత సరస్సు మద్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.

129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.

  • యాదగిరిగుట్ట :-

మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాగగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండలోని బోంగిరి మరియు రైగిరి మద్యలో ఉన్నది. యాదర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఊగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తిల పూజలు అందుకుంటున్నాడు.

  • చంద్రవంక జలపాతము :-

ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.

ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు.


ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.

  • నందికొండ :-

నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.

  • పోచంపల్లి :-

1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  • పిల్లలమర్రి :-

ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.

  • రాచకొండ :-
  • గాజుల కొండ :-
  • ఏలేశ్వరం :-
  • ఫణిగిరి :-
  • భోంగిర్ ఫోర్ట్ :-
  • బంజారా ఆభరణాలు :-
  • మటంపల్లి :-
  • వడపల్లి :-
  •  :-
  • కొలనుపాక :-

ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.


  • పంగల్ :-
  • సుంకిశాల :-

[మార్చు] క్రీడలు

[మార్చు] ప్రముఖవ్యక్తులు

[మార్చు] బయటి లింకులు

te:నల్గొండ

[మార్చు] వనరులు

[మార్చు] మూలాలు

  1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నల్గొండ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు