నల్లమల గిరిప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లమల గిరిప్రసాద్

మాజీ శాసనసభ సభ్యుడు,
మాజీ రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1962-1967,
1992-1997
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 6, 1931
ఖమ్మం జిల్లా, మధిరమండలం, తొండల గోపవరం గ్రామం
మరణం మే 24,1997
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

నల్లమల గిరిప్రసాద్ సాయుధ తెలంగాణ పోరాటయోధుడు.[1]

కుటుంబం[మార్చు]

నల్లమల ప్రసాద్ ఖమ్మం జిల్లా, మధిరమండలం, తొండల గోపవరం గ్రామంలో ఏప్రిల్ 6, 1931లో జన్మించాడు. ఇతని తండ్రిపేరు నల్లమల రామయ్య. ఇతని భార్య పేరు ఎన్.కమలాదేవి. ఇతనికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]

ఉద్యమ జీవితం[మార్చు]

ఇతడు మద్రాస్‌ కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఆంధ్రా మహాసభ సాగిస్తున్న కార్యకలాపాలపట్ల ఆకర్శితులయ్యాడు. 1947లో చదువుకు స్వస్తిచెప్పి ఆంధ్రా మహాసభలోను, తర్వాత కమ్యూనిస్టుపార్టీలోను చేరాడు. నిజాం రాక్షస రజాకారుల మూకలు గ్రామాలపై పడి బీభత్సకాండ జరుపుతుండగా ప్రజలు తిరబడి సాయుధపోరాటానికి పిలుపునిచ్చినపుడు తుపాకి చేతబట్టి సాయుధుడయ్యాడు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు శేషగిరిరావును కాల్చి చంపినపుడు గిరిని తన పేరు ముందుంచుకుని నల్లమల ప్రసాద్‌, నల్లమల గిరిప్రసాద్‌గా మారి గిరి దళాన్ని ముుందుకు నడిపాడు. సాయుధ పోరాటం అనంతరం ఐదు సంవత్సరాల అజ్ఞాత జీవితం గడిపాడు. 1953లో అప్పటి ప్రభుత్వం గిరిప్రసాద్‌పై అనేక కేసులు నమోదుచేసి జైలుకు పంపింది. ఆ కేసులలో ఏదీ రుజువు కాలేదు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతడు 1953లో ఉద్యమ కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై ఏకదాటిగా 11 సంవత్సరాలపాటు పనిచేశాడు. 1962లో ఖమ్మం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో సిపిఐ చూపి సిపిఐ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు విశేష కృషిచేశాడు. ఇతడు 1978లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై 1991 వరకు పనిచేశాడు. విశాలాంధ్ర విజ్ఞానసమితి అధ్యక్షునిగా, 1992నుంచి రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు. 1992లో సి.పి.ఐ. జాతీయ కార్యదర్శిగా, 1996లో ఉపప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. స్వాతంత్ర్య సమరయోధుల స్క్రీనింగ్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన నల్లమల గిరిప్రసాద్ 1997, మే 24 న తుదిశ్వాస విడిచాడు.[3]

మూలాలు[మార్చు]

  1. ఏనుగు వెంకటేశ్వరరావు (2011-05-23). "నేడు గిరిప్రసాద్‌ 14వ వర్దంతి". విశాలాంధ్ర. Archived from the original on 2018-12-25. Retrieved 6 April 2015.
  2. http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/g.pdf
  3. మనతెలంగాణ, ఎడిటోరియల్ (24 May 2016). "దార్శనికుడు గిరిప్రసాద్". Archived from the original on 9 March 2019. Retrieved 9 March 2019.