నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | |
|
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
|
|
| పదవీ కాలము 2010- |
|
| ముందు | కొణిజేటి రోశయ్య |
|---|---|
| నియోజకవర్గము | పీలేరు |
|
|
|
| జననం | సెప్టెంబర్ 13 1960 (వయసు 51) |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
| నివాసము | హైద్రాబాద్ |
| మతం | హిందూ |
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత వున్నారు. 2010-నవంబర్ 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు.
విషయ సూచిక |
[మార్చు] వ్యక్తిగత జీవితం
రమణారెడ్డి కుమార్తె రాధికారెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమార్తె నీహారిక, కుమారుడు నిఖిలేష్ ఉన్నారు.
[మార్చు] రాజకీయ ప్రస్థానం
తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత,1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.
రాజకీయంగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో సన్నిహితంగా వుండేవాడు. వై.యస్.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.
[మార్చు] ముఖ్యమంత్రిగా
- 2010 (సెప్టెంబర్ 25-ప్రస్తుతం): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. [1]
[మార్చు] కాలరేఖ
- 2010 (సెప్టెంబర్ 25-ప్రస్తుతం): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
[మార్చు] గుర్తింపులు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ S. NAGESH KUMAR. Kiran Kumar Reddy takes oath as Andhra CM. The Hindu. తీసుకొన్న తేదీ: 25 November 2010.