నల్లి

వికీపీడియా నుండి

నల్లి
Cimex lectularius
Cimex lectularius
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
తరగతి: కీటకాలు
వర్గము: Hemiptera
ఉపవర్గము: Heteroptera
కుటుంబము: Cimicidae
Kirkaldy, 1909
Genera & Species
Genus Cimex Genus Leptocimex Genus Haematosiphon Genus Oeciacus

నల్లులు (Bed bugs) దోమలాగా రక్తాహార కీటకాలు. ఇవి విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో లభించే నల్లి శాస్త్రీయ నామం 'సెమెక్స్ రొటండస్'. ఐరోపా, అమెరికా దేశాలలో ఉండే నల్లిని 'సిమెక్స్ లెక్ట్యులేరియస్' అంటారు.

నల్లులలో గుచ్చి పీల్చే రకమైన ముఖ భాగాలుంటాయి. ఇవి మానవుడి మీద బాహ్య విరామ పరాన్న జీవులుగా బతుకుతాయి. ఇది నిశాచర కీటకాలు. పగటిపూట ఇవి గృహోపకరణాల నెర్రెలలో, బల్లలు, సీట్ల పగుళ్ళలో దాగి ఉంటాయి. దేహాలు పృష్టోదరాల తలాల్లో చదునుగా ఉంటుంది. వీటిలో ముందు చెక్కలు క్షీణించి ఉంటాయి. వీటిని 'హెమీ ఎలిట్రా' అంటారు. వెనుక రెక్కలు లేవు. దుర్గంధ గ్రంధులు మధ్య వక్షం యొక్క ఉదర తలంలో కాళ్ళ మూల భాగంలో ఉంటాయి. ఒక్కసారి మానవ రక్తాన్ని పీల్చుకొంటే మళ్ళీ కొన్ని నెలలు ఆహారం గురించి పట్టించుకోదు. నల్లికి ఆహారం లభించకపోతే అది స్వజాతి భక్షణ కు దిగుతుంది. ఇది బొద్దింక మాదిరిగా హెమీమెటాబోలస్ కీటకం. దీనిలో అసంపూర్ణ రూపవిక్రియ జరుగుతుంది. అండాలనుంచి సరూప శాభకాలనే దశ ఏర్పడుతుంది. సరూప శాబకాలు అధిక సార్లు నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢ దశను చేరతాయి.

రిలాప్సింగ్ జ్వరం, టైఫస్ జ్వరం, ట్రెంచ్ జ్వరం, ప్లేగు కుష్టు వ్హాధులను కలిగించే వ్యాధిజనక జీవులకు నల్లి వాహక జీవిగా పనిచేస్తుంది.

[మార్చు] మూలాలు

  • Forsyth, Adrian. A Natural History of Sex: The Ecology and Evolution of Mating Behavior. Richmond Hill, Ontario: Firefly Books, 2001. ISBN 1-55209-481-2.
  • Goddard, Jerome A. The Physician’s Guide to Arthropods of Medical Importance (second edition). Boca Raton, Florida: CRC Press, 1993. ISBN 0-8493-5160-X.
  • MacQuitty, Miranda, and Lawrence Mound. Megabugs: The Natural History Museum Book of Insects. New York: Random House Children's Books, 1995. ISBN 1-898304-37-8, ISBN 1-85868-045-X.
  • Quammen, David. The Flight of the Iguana: A Sidelong View of Science and Nature. New York: Delacorte Press, 1988. ISBN 0-385-29592-8, ISBN 0-385-26327-9, ISBN 0-684-83626-2. Provides detail about Xylocaris maculipennis.
  • Smithereen Pest Control (Chicago, Illinois), employees of. Personal interviews. August 2005. (Used for semi-rewrite.)
  • Martin Leverkus, Ryan C. Jochim, Susanne Schad et al. Bullous allergic hypersensitivity to bed bug bites mediated by IgE against salivary nitrophorin. J. Invest. Dermatol. (2006) 126, 91-96.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు