నల్లేరు
వికీపీడియా నుండి
| నల్లేరు | |
|---|---|
| నల్లేరు మొక్క. | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | మాగ్నోలియాప్సిడా |
| Order: | వైటేల్స్ |
| Family: | వైటేసి |
| Genus: | సిస్సస్ |
| Species: | సి. క్వాడ్రాంగ్యులారిస్ |
| Binomial name | |
| సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్ లి. |
|
నల్లేరు (లాటిన్ Cissus quadrangularis) ద్రాక్ష కుటుంబానికి చెందిన తీగ మొక్క. ఇది సాధారణముగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు. నల్లేరును వైద్యములో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి ఉపయోగిస్తారు.దగ్గు, కోరింత దగ్గు,శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె ,తేనె,వడియాలలో కలిపి వాడుతారు.
లక్షణాలు [మార్చు]
- రసయుతమైన చతుర్థకోణయుత కాండంతో నులితీగ సహాయంతో ఎగబ్రాకే పొద.
- అండాకారంలో గాని, మూత్రపిండాకారంలో గాని ఉన్న సరళ పత్రాలు.
- నిశ్చితగుచ్ఛాలలో అమరి ఉన్న లేత గోధుమ రంగు పుష్పాలు.
- ఎరుపు రంగు మృదు ఫలాలు.