నవధాన్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Navadhanyalu nine grains for puja
నవధాన్యాలు
నవ ధాన్యాలు వివరంగా

నవధాన్యాలు అనగా తొమ్మిది రకాల ధాన్యాలు. అవి 1గోధుమలు 2యవలు 3పెసలు 4శనగలు 5కందులు 6అలసందలు 7నువ్వులు 8మినుములు 9ఉలవలు

నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజ గ్రహానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సెనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది[1]. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి వుండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి.

నవధాన్యాలను దైవకార్యాల్లోను, శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలోపోసి ఉంచడమనే ఆచారం ఉంది. అవి మొలకెత్తి బాగా పెరిగితే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని భావిస్తారు.[2]

నవధాన్యాలలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. వాటిని సమపాళ్లలో స్వీకరించినప్పుడే దేహానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల వాళ్లని కలుపుకు పోయినప్పుడే, పరిపూర్ణత ఏర్పడుతుందనే విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది[3].

మూలాలు[మార్చు]

  1. Selvi. "నవగ్రహాలు- నవధాన్యాలు.. ప్రాముఖ్యత ఏమిటి?". telugu.webdunia.com. Retrieved 2020-04-28.
  2. Krishna, Kishore. "నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావిస్తుంటారు". Retrieved 2020-04-28.
  3. "నవధాన్యాలు ." ap7am.com. Retrieved 2020-04-28.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]