Coordinates: 16°53′05″N 78°02′23″E / 16.884718°N 78.03978°E / 16.884718; 78.03978

నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా)

వికీపీడియా నుండి
(నవాబ్ పేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నవాబ్ పేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, నవాబ్ పేట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, నవాబ్ పేట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్​నగర్​ జిల్లా, నవాబ్ పేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°53′05″N 78°02′23″E / 16.884718°N 78.03978°E / 16.884718; 78.03978
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్​నగర్​ జిల్లా
మండల కేంద్రం నవాబ్ పేట
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 292 km² (112.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 52,061
 - పురుషులు 26,310
 - స్త్రీలు 25,751
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.41%
 - పురుషులు 52.33%
 - స్త్రీలు 26.21%
పిన్‌కోడ్ 509340

నవాబ్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.పునర్వ్యవస్థీకరణలో ఈ మండలం 32 గ్రామాలతో ఏర్పడింది.ఈ మండలం నుండి 10 గ్రామాలను వికారాబాదు జిల్లాలో 2021 ఏప్రిలో 24న కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలం పరిధిలో చేరినవి. తరువాత ఈ మండలంలో ప్రస్తుతం 25   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం నవాబ్‌పేట.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 52,061. ఇందులో పురుషుల సంఖ్య 26,310, స్త్రీల సంఖ్య 25,751.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 292 చ.కి.మీ. కాగా, జనాభా 64,929. జనాభాలో పురుషులు 32,914 కాగా, స్త్రీల సంఖ్య 32,015. మండలంలో 12,867 గృహాలున్నాయి.[4]

నీటిపారుదల[మార్చు]

మండలంలో 12 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 793 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[5]

పశుసంపద[మార్చు]

2007 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 35 వేల గొర్రెలు, 11 వేల మేకలు, 67 గాడిదలు, 338 పందులు, 844 కుక్కలు, 9900 కోళ్ళు, 6 వేల దున్నపోతులు ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎన్.వీరప్ప ఎన్నికయ్యాడు.[6]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

వికారాబాద్ జిల్లాలో చేరిన గ్రామాలు[మార్చు]

ఈ దిగువ వివరించిన 7 గ్రామాలు 2021 ఏప్రిల్ 24 నుండి ఈ మండలం నుండి వికారాబాద్ జిల్లా లోని చౌడాపూర్ మండలంలో విలీనం చేసారు.[7][8]

  1. కొత్తపల్లి
  2. మల్కాపూర్
  3. మరికల్
  4. కన్మన్‌కాల్వ
  5. చాకల్‌పల్లి
  6. పురుసంపల్లి
  7. మొగిలిపల్లి

మండల ప్రముఖులు[మార్చు]

  1. దాయపంతులపల్లి చెన్నదాసు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[9]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 28-07-2013
  7. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2021-05-13.
  8. "Notification to create two new mandals issued". The New Indian Express. Retrieved 2022-01-23.
  9. దాయపంతులపల్లి చెన్నదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 36

వెలుపలి లింకులు[మార్చు]