నాగరికత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగరికత అనేది మానవులచే ఆవిర్భావం చెంది, పట్టణాభివృద్ధి, సామాజిక వర్గీకరణ, సామూహిక నడవడిక, కట్టుబాట్లు, సమాచార మార్పిడి (భాష, వ్రాత), ఇతర సాంకేతిక పురోగతులచే రూపొందబడిన ఒక క్లిష్ట సమాజము. నాగరికత ఎదుగుతున్నకొద్దీ వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలలో ఎడబాట్లు స్పష్టమవుతాయి. కొన్ని ప్రాంతాలు కేంద్రీకరణకు గురై ఆయా చోట్ల జనసాంద్రత పెరుగుతుంది. ఉత్పాదకత, వర్తకము పెరుగుతాయి, ఏదోవొక రకమైన డబ్బు వాడుకలోకి వస్తుంది. వివిధ కళలు సర్వసాధారణం అవుతాయి, వాటిలో నేర్పరితనం పెరుగుతుంది. భాష ఏర్పడుతుంది. క్లిష్టమైన కట్టడాలు స్థాపించబడతాయి. ఆలోచనలు, సిద్ధాంతాలు పెరిగి కట్టుబాట్లు, చట్టాలు ఆచరణలోకి వస్తాయి. వేట, పశుపెంపకం మొదలుకొని సహజ పర్యావరణం మీద పెత్తనం పెరగకలదు. చుట్టుప్రక్కల గల ఆదిమ/మొరట జనులు మీద కూడా ఇది చెలాయింపబడవచ్చు. ప్రాంత విస్తరణ ఆవశ్యకత వచ్చి, యుద్ధాలు కూడా తప్పకపోవచ్చు.

పెద్ద నాగరికతలు మానవ అక్కర్లకు ఆశ్రయం కలిగిస్తాయి. ఇందువలన ఇక్కడకు వలసలు పెరిగి, బహుళ సంస్కృతులు గలవు. దట్టమైన జనసాంద్రతలో వర్గీకరణ జరిగి కులాలు వంటివి ఏర్పడతాయి. పాలన, ప్రభుత్వం, శాసన చట్టాలు అమలులోకి వచ్చి, రాజ్యం లేదా జాతి అవతరణ పరిస్థితికి చేరవచ్చు.

వ్యుత్పత్తి[మార్చు]

నాగరికత అనేది ఒక సంస్కృత తత్సమము. నగరాలకు, పట్టణాలకు సంబంధించినది అని అర్థం. పాశ్చాత్త భాషలలో మొదట వాడబడిన civilization/civilisé అనే పదం లాటిన్ పదమైన civilis నుండి ఉద్భవించింది, సివిలిస్ అనగా నాగరికుడు లేదా పౌరుడు.

చరిత్ర[మార్చు]

సారవంతమైన చంద్రవంక.

చరిత్ర-పూర్వం[మార్చు]

నాగరికత ఏర్పడటానికి మొట్టమొదటిగా కావాల్సింది కొరతలేని మిక్కిలి ఆహార ఉత్పత్తి. అత్యంత ప్రాచీన వ్యవసాయం 11,000 ఏళ్ళ క్రిందట ప్రాశ్చిమాసియా ప్రాంతమున నైలు నది, టిగ్రిస్ నదుల మధ్య సారవంతమైన చంద్రవంకగా పిలవబడే సాగుభూమిలో గాని; 9000 ఏళ్ల క్రిందట పాపువా న్యూ గినీ వద్ద గాని జరిగిందని గుర్తించారు. ఈ కాలంలో సుమారు 5300 క్రి.పూ. నాడు మెసొపొటేమియా నాగరికతలో సాగునీటి కట్టడాలు జరిగాయి. ఇదే సమయంలో ఉర్, ఉరుక్ వంటి పట్టణాలు వెలుగులోకి వచ్చాయి, అత్యంత తోలి లిపులలో ఒకటైన క్యూనిఫార్మ్ లిపి కూడా ఇప్పుడే ఆవిర్భవించింది. ఈ సుమేరియన్ నాగరికతను భూమిపై నాగరికత వెలసిల్లుటకు, అభివృద్ధి చెందుటకు దోహదపడిన నాగరికతగా అంగీకరిస్తారు.

క్లాసికల్ ఆంటిక్విటి[మార్చు]

కర్ల్ జస్‌పెర్స్ అను జర్మన్ తత్వవేత్త ప్రకారం, ప్రాచీన నాగరికతలు ఆక్సియల్ యుగంలో తీవ్రమైనమైన ప్రభావాలకు లోనయ్యాయి. ఈ ప్రభావితాలకు కారణాలు ఋషులు, ప్రవక్తలు, మతపర సంస్కర్తలు, తత్వవేత్తలు. ఈ కాలం క్రీ.పూ. 600 నుండి 400, ప్రాంతాలు చైనా, భారత్, ఇరాన్, ఇస్రాయెల్, గ్రీకు. ఈ ప్రభావాలు నాగరికతల రూపురేఖలను శాశ్వతంగా మార్చివేశాయి.[1]. జూలియస్ జేనెస్ ప్రకారం ఈ నాగరికతలలో మార్పునకు కారణాలు "బైకామెరల్ మైండ్ అనే మానవ సిద్దాంతం తొలగిపోవడం", మానవ మేధస్సు విశాలం కావడం, హేతుబద్ద విధానాలు పెంపొందిపబడడము. విలియం హెచ్. మెక్‌నీల్ ప్రకారం, ఈ క్లాసికల్ యుగం, ప్రాచీన నాగరికతలకు, నేటి నాగరికతకు వారధి లాంటిది. ఇది చైనా నుండి మధ్యధరాసముద్రము వరకూ గల ప్రాంతాలనో తత్వములతోనూ ఆలోచనలతోనూ మతపరమైన భావనలతోనూ నింపివేసింది.

లక్షణాలు[మార్చు]

మార్క్సిస్టు పురాతత్వ శాస్త్రజ్ఞుడు గోర్డాన్ చైల్డ్ అందించిన నాగరికత నిర్వచనం నుండి ఒక నాగరికతకు కలిగే లక్షణాలు ఇవి.

  • కొరతలేని ఆహార ఉత్పత్తి: సాధారణంగా వ్యవసాయ పంటలు మిగులు ధాన్యాలు సమకూర్చి, నాగరికతకు మూల కారణాలుగా నిలిచాయి. పెద్దమొత్తంలో పండడం, నిల్వ ఉండగలడం వలన వరి, గోధుమ, జొన్న వంటి మొక్కలు నాగరికతలకు ప్రాణధారం పోశాయి. అయితే కేవలం సముద్ర వనరులతోనే మనుగడ పొందిన నాగరికతలు కూడా కొన్ని ఉన్నాయి.
  • జనసాంద్రత: ఆహార లభ్యత వలన జన, పాడి పశువుల సంఖ్య పెరుగుతుంది. కాని ఇతర జంతు సంపద, పర్యావరణం దెబ్బతినబడుతుంది.
  • ఉద్యోగరీత్య సామాజిక వర్గీకరణ: పాలకులు, పామరులు తదితర వర్గాలుగా సమాజం చీల్చబడుతుంది.  
  • పట్టణాభివృద్ధి: కాలువలు, రోడ్లు ఉంటాయి. సామూహిక స్థలాలు కూడా వెలుస్తాయి బావులు, సంతలు వంటివి
  • ఆలోచనలు: చుట్టూ పరిసరాల మీద అవగాహన, నమ్మకాలు, భక్తి వంటివి కలగడం.  
  • వ్రాత/లిపి: శిలా శాసనాలు వెయ్యబడతాయి. వ్యాపారులు, పండితులు తదితరులు ముహుర్తాలు, విశేషాలు వంటివి లిఖించడానికి వ్రాతపై ఆధారపడతారు.
  • లలితకళలు: నాటకాలు, చిత్రలేఖనం, జానపద గీతాలు
  • స్మారక కట్టడాలు: పిరమిడ్ లు, ఆలయాలు వంటివి
  • కంసాలి/కుమ్మరి పనులు: లోహ మిశ్రమాల లేదా బంక మట్టి పాత్రలు, సామగ్రి వాడుకు, గనులు తవ్వకం. అయితే ఇవి లేకుండా ఉన్న నాగరికతలు కూడా ఉన్నాయి (ఉదా: మెసో అమెరికన్ నాగరికతలు)

కొన్ని ముఖ్య నాగరికతలు[మార్చు]

క్రొత్త ప్రపంచం[మార్చు]

కరల్ నోర్టే చికోకు చెందినది. పశ్చిమార్ధగోళంలో అత్యంత ప్రాచీన నాగరికత.

క్లాసికల్ నాగరికతలపై ప్రభావం చూపగలిగిన నాగరికతలు

  • మధ్య తూర్పు నాగరికతలు
  • తూర్పు ఆసియా నాగరికతలు
  • ఆగ్నేయ ఆసియా నాగరికతలు
  • ఐరోపా నాగరికతలు

15, 16వ శతాబ్దాలలో ఐరోపా నావికులు అనేక ప్రాంతాలను పరిచయం చేయడము, ఈ ప్రాంతాల మధ్య వర్తక వాణిజ్యాలు సాధారణమవడం, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఐరోపా సంస్కృతికి చెందిన ప్రభుత్వాలను అనుకరించడం, పరిశ్రమలు, వాణిజ్యం, సంస్కృతి, ఇటు అమెరికానుండి అటు ఆస్ట్రేలీయా వరకు ఐరోపా సంస్కృతి వ్యాపించింది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. Tarnas, Richard (1993) "The Passion of the Western Mind: Understanding the Ideas that Have Shaped Our World View" (Ballatine Books)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాగరికత&oldid=2986308" నుండి వెలికితీశారు