నాగలాపురం

వికీపీడియా నుండి
వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం
  ?నాగలాపురం మండలం
చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పటములో నాగలాపురం మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో నాగలాపురం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నాగలాపురం
జిల్లా(లు) చిత్తూరు
గ్రామాలు 12
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
33,886 (2001)
• 16778
• 17108
• 63.58
• 74.35
• 53.18



నాగలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడికి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.

విషయ సూచిక

దేవాలయనిర్మాణం [మార్చు]

ఈ దేవాలయ ప్రాకారాలను శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములు జీర్ణోద్దరణ చేస్తోంది.

పండుగలు [మార్చు]

  • ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
  • జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
  • వైకుంఠ ఏకాశి
  • ఆండాళ్ళ నీరోత్సవం
  • భోగి
  • సంక్రాతి
  • కనుమ
  • రథసప్తమి
  • కంచిగరుడసేవ

బాహ్య లంకెలు [మార్చు]

  • తితిదే వెబ్ సైటు[1]


మండలంలోని గ్రామాలు [మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=నాగలాపురం&oldid=807854" నుండి వెలికితీశారు