నాగులవరం(బోగోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగులవరం నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నాగులవరం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రారంభ వేడుకలు, 2014,ఏప్రిల్-11వ తేదీన మొదలైనవి. 11 వతేదీ శుక్రవారం సాయంత్రం, భగవత్ ప్రార్థన, విష్వక్సేన పూజ నిర్వహించారు. 12 వతేదీ శనివారం నాడు, ఉదయం 10-30 గంటలకు క్షీరాధివాసం, మద్యాహ్నం 3 గంటలకు గ్రామోత్సవం నిర్వహించెదరు. ఈ గ్రామోత్సవంలో, నాగులవరం,చెన్నారెడ్డిపాళెం, కొత్తూరు ప్రాంతాలలో భక్తులు దేవతామూర్తులకు భక్తిశ్రద్ధలతో ఆహ్వానం పలికినారు. ఆలయం వద్ద హోమాలు, విశేషపూజలు నిర్వహించారు. అనేకమంది భక్తులు పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 13వ తేదీ ఆదివారం నాడు, ఉదయం 8-39 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం, శాస్త్రోక్తంగా, వేదమంత్రోచ్ఛారణలతో, విశేషపూజలు నిర్వహించారు. కలశప్రతిష్ఠాపన శాస్త్రోక్తంగా జరిగినది. మద్యాహ్నం 12 గంటలకు అన్నదానం, సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో, వివిధ ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గణేశం రమేష్ రెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు[మార్చు]