నాజర్ (నటుడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నాజర్ దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.

జననం[మార్చు]

మార్చి 5, 1958 లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం లో జన్మించాడు. ఆయన స్వగ్రామం నాన్న పేరు మహబూబ్ బాషా. అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. మైదానం నవల ఆయనకు ఎంతో ఇష్టం.

ఆయన భార్య పేరు కమిలా నాజర్. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్.

నటించిన తెలుగు సినిమాలు[మార్చు]

 1. దూకుడు
 2. శక్తి
 3. మోక్ష
 4. కొమరం పులి
 5. డాన్ శీను
 6. ఖలేజా
 7. వరుడు
 8. గోలీమార్
 9. కృష్ణార్జున
 10. శ్రీరామదాసు
 11. గౌతమ్ ఎస్.ఎస్.సి.
 12. భగీరథ
 13. అతడు
 14. అతిథి
 15. పోకిరి
 16. సై
 17. నాని
 18. ద్రోహి
 19. క్రిమినల్
 20. ఓం సాయిరాం
 21. ఆకాశమే హద్దు
 22. చంటి
 23. సింహాద్రి
 24. డాన్
 25. పంచాక్షరి
 26. ఆంధ్రావాలా
 27. రామ రామ కృష్ణ కృష్ణ
 28. అదుర్స్
 29. బావ
 30. మిస్టర్ పెర్ఫెక్ట్
 31. ఒక్కడున్నాడు
 32. మాతృదేవోభవ
 33. "బాదుషా