నారాయణదత్ తివారీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నారాయణదత్ తివారీ
NDTiwari.jpg
ఆంధ్రప్రదేశ్ గవర్నర్
పదవీ కాలం
2007 - డిసెంబరు 26, 2009
Preceded by రామేశ్వర్ ఠాకూర్
Succeeded by ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ‎
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి
పదవీ కాలం
1986-1987
ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్
పదవీ కాలం
1976 - 1977, 1984 - 1985, 1988 - 1989
ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్
పదవీ కాలం
2002–2007
వ్యక్తిగత వివరాలు
జననం (1925-10-18) అక్టోబరు 18, 1925 (age 88)
బాలూటి గ్రామం, నైనిటాల్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్
మతం హిందూ
As of November 07, 2008

నారాయణదత్ తివారీ (జ. అక్టోబర్ 18, 1925) భారత జాతీయ కాంగ్రేసు రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా, మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తివారీ 2007 ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆగష్టు 22న గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.[1] డిసెంబరు 26, 2009న గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించాడు.

పితృత్వ వివాదం[మార్చు]

1967 నుండి 1980 మధ్య తివారీ పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నతివారీ, 3 కృష్ణమెనన్ మార్గ్ లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. ఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్జ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధము వారి కుమారుడు రోహిత్‌ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో 29 ఏళ్ళ వయసులో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానములో దావా వేశాడు. కోర్టు నోటీసుకు జవాబిస్తూ తివారీ తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించాడు మరియు రోహిత్ కోరినట్టు డి.ఎన్.ఏ పరీక్షకు అంగీకరించలేదు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Tiwari sworn in as Andhra Governor", పి.టి.ఐ (ది హిందూ), ఆగష్టు 22, 2007.
  2. ఎన్‌.డి.తివారీ నా కన్నతండ్రి - ఈనాడు పత్రికలో వార్త అక్టోబర్ 16, 2008
  3. Paternity suit on ND Tiwari - ది టెలిగ్రాఫ్ (కోల్కతా) అక్టోబర్ 15, 2008