నారాయణ్ ఆప్తే

వికీపీడియా నుండి

నారాయణ్ ఆప్తే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మరియు గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. నాథూరామ్ గాడ్సేతో పాటు ఇతను కూడా ఉరి తియ్యబడ్డాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. ఇతను స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అదే సమయంలో ఇతను గాంధీ మితవాద విధానాలని వ్యతిరేకించాడు. నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి హిందూ మహాసభలో ఆరేళ్ళు పని చేశాడు. భారత్-పాకిస్తాన్ విభజన విషయంలో గాంధీ పాకిస్తాన్ వైపు నిలబడడం వల్ల నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి గాంధీ హత్యలో పాల్గొన్నాడు. గాంధీ చనిపోతే భారత్-పాకిస్తాన్ పునరేకీకరణ చెందే అవకాశం ఉందనుకున్నాడు.