నిఖిల్ సిద్దార్థ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నిఖిల్ సిద్దార్థ్
Nikhil-siddharth.jpg
నిఖిల్ సిద్దార్థ్
జన్మ నామం నిఖిల్ సిద్దార్థ్
జననం (1985-06-01) జూన్ 1, 1985 (వయస్సు: 29  సంవత్సరాలు)
Indiaహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేరు(లు) "బెగంపేట బోయ్"
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు జూన్ 1, 1985 లో జన్మించాడు.

నేపధ్యము[మార్చు]

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రం లో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో జూన్ 1 1985 న జన్మించారు. బేగం పేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.[1]యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు[2]. ఆయన హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.హాపీడేస్ చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[3]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హేపీడేస్ చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. అతడు యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.[4]

ఆయన ప్రస్తుత సినిమా స్వామి రా రా

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2006 హైదరాబాద్ నవాబ్స్ అతిధి పాత్ర[5]
2007 హ్యాపీ డేస్ రాజేశ్
2008 అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అంకిత్
యువత బాబు
2010 కళావర్ కింగ్
ఓం శాంతి తేజా
ఆలస్యం అమృతం
2011 వీడు తేడా 'కత్తి' శీను
2012 డిస్కో
2013 స్వామిరారా[6][7] సూర్య
2014 కార్తికేయ (సినిమా)

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]