నిఘంటువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెలుగు అకాడమి వారి తెలుగు కన్నడ నిఘంటువు

నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచినది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు.

క్రీ.శ.1900 సంవత్సరానికి పూర్వపు తెలుగు మరియు ఇతరభాషల నిఘంటువులు[మార్చు]

సంవత్సరం, నిఘంటు నిర్మాత, నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం.

 • 1818: డబ్ల్యు. బ్రవున్‌, A Vocabulary of Gentoo and English, మద్రాస్‌.
 • 1821: ఎ.డి. కేంప్‌బెల్‌, A Dictionary of the Teloogoo Language, మద్రాస్‌.
 • 1835: జె.సి.మోరిస్‌, A Dictionary, English and Teloogoo, మద్రాస్‌.
 • 1839: డబ్ల్యు. కార్పెంటర్‌, A Dictionary of English synonyms, లండన్‌.
 • 1841: సి. రామకృష్ణ శాస్త్రులు, A Vocabulary, in English and Teloogoo, మద్రాస్‌.
 • 1841: జె. నికోలాస్‌, A Vocabulary of English and Teloogoo, మద్రాస్‌.
 • 1844: ఇ. బాల్పోర్‌, Vocabularies Telagoo, కలకత్తా .
 • 1847: డబ్ల్యు. ఇల్లియట్‌, Language of the Goands with terms in Telugu, కలకత్తా .
 • 1849: బి.హెచ్‌. హాడ్జ్‌సన్‌, Vocabularies of Southern India, కలకత్తా .
 • 1852: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, A DICTIONARY, Telugu and English, మద్రాస్‌.
 • 1854: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, బ్రౌణ్య మిశ్రభాషా నిఘంటువు A Dictionary of the Mixed Telugu మద్రాస్‌. [1]
 • 1862: రెవరండ్‌ పెర్సివల్‌, Telugu - Eng1ish DICTIONARY, మద్రాస్‌.
 • 1868: సర్‌.ఏ.జె. ల్యాల్‌, A Vocabulary in Hindustani, English, Telugu, నాగపూర్‌.
 • 1886: రెవరండ్‌ పెర్సివల్‌, Anglo-Telugu Dictionary, మద్రాస్‌.
 • 1889: వీరస్వామి మొదలియార్‌, Vocabulary in English and Telugu, మద్రాస్‌.
 • 1891: పి. శంకర నారాయణ, English - Telugu Dictionary, మద్రాస్‌. [2]
 • 1898: జి.డబ్ల్యు. టేలర్‌, An English-Telugu Vocabulary, మద్రాస్‌.
 • 1900: పి. శంకర నారాయణ, Telugu - English Dictionary, మద్రాస్‌.
 • 1900: పి. హోలర్‌, Telugu Nighantuvulu, రాజమండ్రి.

1900 తరువాతి నిఘంటువులు[మార్చు]

శబ్దరత్నాకరము.తెలుగు-తెలుగు నిఘంటువు
వావిళ్ల నిఘంటువు, 1949 [3]
తెలుగు వ్యుత్పత్తి కోశం
 • శబ్దరత్నాకరము :తెలుగు-తెలుగు నిఘంటువు;సంకలనము:బి.సీతారామ చార్యులు.మొదటి ప్రచురణ:1996.ముద్రణ:అసియన్ ఎడ్యుకెసనల్ సర్విసెస్,న్యూఢిల్లి.

లకంసాని చక్రధరరావు ,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.

 1. అ-ఔ (1978) 412 పేజీలు, పొట్టి శ్రీరాములు కిఅంకితం.ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు.12219 పదాలు.
 2. క-ఘ(1981) 455 పేజీలు, కట్టమంచి రామలింగారెడ్డి కి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట.19670 పదాలు
 3. చ-ణ (1981) 277 పేజీలు, ........... కిఅంకితం, ఆవుల సాంబశివరావు ముందుమాట.11000 పదాలు
 4. త-న (1985) 440పేజీలు, వాసిరెడ్డి శ్రీకృష్ణ కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.16000 పదాలు.
 5. ప-భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్య కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.19000 పదాలు.
 6. మ (1987) 268 పేజీలు, ఎమ్.ఆర్.అప్పారావు కి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట.9754 పదాలు
 7. య-వ (1989) 272 పేజీలు, ఆవుల సాంబశివరావు కి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు.10132 పదాలు
 8. శ-హ (1995) 315 పేజీలు, కోనేరు రామకృష్ణారావు కి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. 6651పదాలు. 3904(అ-హ) అనుబంధం.

ఆంతర్జాల నిఘంటువు[మార్చు]

తెలుగు-తెలుగు నిఘంటువులు
ఆంగ్లం-తెలుగు నిఘంటువులు
 • అక్షర మాల నిఘంటువు [8],
 • బ్రౌణ్య ఆంగ్లం-తెలుగు నిఘంటువు . స్వేచ్ఛ యూనికోడ్ లోకి మార్చిన ( ప్రజోపయోగ పరిధిలో ) [9]
 • లిటిల్ మాస్టర్స్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, సంకలనం:ఎస్ కె వెంకటాచార్యులు, జనవరి1992, [10]
 • సాహితి ఆన్ లైన్ నిఘంటువులు [11] ఇందులో బ్రౌన్, వేమూరి నిఘంటువులు ఉన్నాయి. ఇవి తెలుగు, తెలుగు (ISCII) మరియు యూనికోడ్లో పనిచేస్తుంది.
 • వేమూరి. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు - 2002 (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే )[12]
తెలుగు-ఆంగ్లం నిఘంటువులు
 • గ్విన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు నిఘంటువు [13]. తెలుగు పదాలు ఇంగ్లీషులిపిలో వున్నాయి.
 • బ్రౌన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు [14] తెలుగు లిపి వాడబడిన 1903 ప్రచురణ.
 • పి.శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు -(గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే) [15]
 • వెబ్స్టర్స్ తెలుగు -ఆంగ్లం [16]


బహు భాషా నిఘంటువులు
 • ఆంధ్రభారతి నిఘంటువు [17] ద్వారా వివిధ తెలుగు నిఘంటువులను యూనికోడ్తో వెతకవచ్చు.


 • భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం నిఘంటువు: ఆంగ్లం నుండి తెలుగుకు, కన్నడ మరాఠి మరియు బెంగాలి నుండి హిందీ ఉర్దూ కు, మరియు ఇంకా ఎన్నో భారతదేశభాషల నుండి వివిధమైన భాషలకు తర్జుమా చేయుటకు భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం, ఐఐఐటి, హైదరాబాదు ,[18] నిఘంటువులు [19] తయారుచేసింది. అయితే ఇవి యూనికోడ్ కు ముందు తరానివి, పాత కోడింగ్ పద్ధతులు (ISCII, Shusha, RomanReadabale, itrans, RomanWX కోడులు అంటే ఇంగ్లీషు అక్షరాల వాడి తెలుగు రాయాలి)వాడబడినవి.
 • విక్షనరీ వ్యాసము, [20]
 • గూగుల్ అనువాదం [21]

ప్రత్యేకమైన నిఘంటువులు[మార్చు]

 • పారిభాషిక పదకోశం, గణిత, సాంఖ్యక శాస్త్రాలు, (పారిభాషిక పదావళి-2), తెలుగు అకాడమి, 1973
 • పారిభాషిక పదకోశం, భౌతిక శాస్త్రం, (పారిభాషిక పదావళి-8), తెలుగు అకాడమి, 1979
 • పారిభాషిక పదకోశం, జంతుశాస్త్రం, (పారిభాషిక పదావళి- ), తెలుగు అకాడమి,
 • పారిభాషిక పదకోశము-, సంకలనం. తిరుమల వెంకట రంగాచార్యులు, ప్రకాశకులు కాశీనాధుని నాగేశ్వరరావు,1936, ఆంధ్ర గ్రంథమాల-27 ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు [22]
 • ఆధునిక వ్యవహార పదకోశము, బూదరాజు రాధాకృష్ణ[23]
 • పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ పరిష్కర్త: బూదరాజు రాధాకృష్ణ,,2004 [24]
 • తెలుగు పర్యాయపద నిఘంటువు సంకలనం:ఆచార్య జి.ఎన్.రెడ్డి, జూన్ 1990, విశాలాంధ్ర పబ్లిషర్స్ ( మే 1998)
 • పాలనా పరిభాష [25]
 • మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ పరిభాష [26]
 • తరచూవాడేస్థానికీకరణ పదాలు (FUEL)[27]

కొత్త పదాల సృష్టి, సమన్వయం[మార్చు]

ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు(క్లుప్త సందేశ సేవ(SMS), ఇంగ్లీషు భాషా, సమాచార సాధనాలు, దృశ్య శ్రవణ మాధ్యమాలు లో ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుక) ప్రజల జీవనశైలి, వారి భాషపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగు భాషని సజీవంగా పుంచడానికి, కొత్తగా తయారయ్యే పరభాషా పదాలకి అనుగుణంగా తెలుగు పదాల నిర్మాణం జరగాలి. దీనికి ప్రస్తుతం ఎవరికి వారే యమూనాతీరే అన్నట్లుగా జరుగుతున్న పనిని కొంతవరకు సమన్వయం చేస్తున్న జాల స్థలాలున్నా [28] [29] [30] [31] [32] [33] మరింత మెరుగు చేయటానికి తెలుగు భాషా సంస్ధలు ముందుకి రావాలి.

నిఘంటువుల భవిష్యత్[మార్చు]

ప్రింట్‌ రూపంలో ఉన్న నిఘంటువులకు గిరాకీ తగ్గిపోతోంది కాబట్టి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉండేలా ఆక్స్‌ఫర్డ్ ప్రెస్‌ వ్యూహం మార్చింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

 1. బ్రౌణ్య మిశ్రభాషా నిఘంటువు అర్కైవ్.ఆర్గ్ లో
 2. లో పిశంకరనారాయణ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు
 3. , వావిళ్ల నిఘంటువు,1949(భారత డిజిటల్ లైబ్రరీ)
 4. శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 6 సంపుటం(మ-లౌ) (డిఎల్ఐ లో)
 5. శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 7సంపుటం(వ-వ్రై) (డిఎల్ఐ లో)
 6. శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 8 సంపుటం(శ-హ్వ) (డిఎల్ఐ లో)
 7. శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు (తెలుగునిఘంటువు జాలస్థలిలో)
 8. అక్షర మాల నిఘంటువు (అందుబాటులో లేదు, గ్రూప్ కి వెళుతుంది)
 9. బ్రౌణ్య ఆంగ్లం-తెలుగు నిఘంటువు
 10. లిటిల్ మాస్టర్స్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు
 11. సాహితి ఆన్ లైన్ నిఘంటువులు
 12. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు - వేమూరి (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే)
 13. చికాగో విశ్వవిద్యాలయము వారు ప్రచురించిన గ్విన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు
 14. చికాగో విశ్వవిద్యాలయము వారు ప్రచురించిన బ్రౌన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు
 15. తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - పి.శంకరనారాయణ (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే)
 16. వెబ్స్టర్స్ తెలుగు -ఆంగ్లం
 17. ఆంధ్రభారతి నిఘంటువు
 18. భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం (Language Technologies Research Centre), ఐఐఐటి, హైదరాబాదు
 19. భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం, ఐఐఐటి, హైదరాబాదు నిఘంటువులు
 20. విక్షనరీ సైటు
 21. గూగుల్ అనువాదం
 22. పారిభాషా పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు
 23. ఆధునిక వ్యవహార పదకోశము, బూదరాజు రాధాకృష్ణ, ప్రాచీ ప్రచురణలు
 24. పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ పరిష్కర్త: బూదరాజు రాధాకృష్ణ,ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ,2004
 25. అధికార భాషా సంఘం పాలనా పరిభాష
 26. మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ పరిభాష
 27. తరచూవాడేస్థానికీకరణ పదాలు(FUEL)
 28. తెలుగుపదం.ఆర్గ్
 29. ప్లైలీగాట్
 30. ఓపెన్ ట్రాన్
 31. లాంచ్పాడ్ తెలుగు స్థానికీకరణ జట్టు
 32. ట్రాన్సలేట్ వికీ
 33. ఫర్టాల్
"https://te.wikipedia.org/w/index.php?title=నిఘంటువు&oldid=1545126" నుండి వెలికితీశారు