నిజాంపట్నం

వికీపీడియా నుండి
  ?నిజాంపట్నం మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో నిజాంపట్నం మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో నిజాంపట్నం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నిజాంపట్నం
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 8
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
60,930 (2001)
• 31210
• 29710
• 56.09
• 65.75
• 45.92


నిజాంపట్నం(Nizampatnam), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలోని ఒక మండలము మరియు ప్రాచీన ఓడ రేవు. పూర్వము దీనిని పెద్దపల్లి అని పిలిచేవారు. డచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమండల్ తీరము లో తమ మొదటి ఫ్యాక్టరీని 1606 లో ఇక్కడ నెలకొల్పినది. ఇక్కడ లినెన్ బట్ట తయారుచేసేవారు. డచ్చివారి ఫ్యాక్టరీ 1669 లో మూతపడినది. దక్షిణ భారతదేశములో మొదటి బ్రిటిషు వర్తక స్థావరము 1611 లో ఇక్కడ నెలకొల్పారు. 1621 లో బ్రీటిషు వారు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. నిజాం దీన్ని ఉత్తర సర్కారులలో భాగముగా ఫ్రెంచి వారికి రాసిచ్చాడు కాని 1759 లో సలాబత్ జంగ్ బ్రిటిషు వారి దత్తముచేశాడు. ప్రస్తుతం నిజాంపట్నం మండలం రేపల్లె శాసనసభ నియోజకవర్గం లో కొనసాగుతోంది. కిందటి (అనగా 2004 ) సార్వత్రిక ఎన్నికలలో ఈ మండలం కూచినపూడి నియోజకవర్గం లో ఉండటం జరిగింది. ఆ తరువాతి పునర్వ్యవస్తీకరణ సంఘం ఈ మండలాన్ని రేపల్లె నియోజకవర్గం లోకి మార్చడం జరిగింది. 2004 మరియు 2009 శాసనసభ ఎన్నికలలో కూచినపూడి మరియు రేపల్లె నుండి పోటి చేసి గెలిచిన మోపిదేవి వెంకట రమణారావు గారు ఈ గ్రామ వాస్తవ్యులే. ప్రస్తుతం వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో సాంకేతిక విద్య మరియు న్యాయ శాఖా మాత్యులుగా పని చేస్తున్నారు. ఈ మండలంలోని అడవులదీవి గ్రామానికి చెందిన బడుగు ప్రసాదరావు మాస్టర్ గారి పిల్లలు బి.డి.పాల్సన్ ఐ.ఏ.ఎస్. అధికారిగా ఉత్తర ప్రదేశ్ లో డి.ఐ.జీ.గా, బి.డి.యం. అంబేద్కర్ ఐ.ఐ.ఎస్. అధికారిగా హైదరాబాద్ దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

మండలంలోని గ్రామాలు [మార్చు]

రెఫరెన్సులు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నిజాంపట్నం&oldid=831233" నుండి వెలికితీశారు