నిజామాబాదు లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం స్వరూపం అధికంగా మారిపోయింది. నిజామాబాదు జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 4 సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడిన జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోకి వెళ్ళగా కరీంనగర్ జిల్లాకు చెందిన 2 అసెంబ్లీ సెగ్మెంట్లు కోరుట్ల మరియు జగిత్యాల సెగ్మెంట్లు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి. [1] ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు కూడా రిజర్వుడు కిందికి రాకపోవడం ఈ లోక్‌సభ నియోజకవర్గం యొక ప్రత్యేకత.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గపు జనాభా : 18,66, 386
  • ఓటర్ల సంఖ్య : 12,71,976
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 14.03% మరియు 5.32%

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ ఎన్నికలు కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ సమీప ప్రత్యర్ధి పార్టీ ఆధిక్యత
మొదటి 1952 1952 - 1957 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ కాశీనాథరావు ముక్పాల్కర్ సోషలిస్టు పార్టీ 12243
రెండవ 1957 1957-62 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ గడ్డం రాజారాం స్వతంత్ర అభ్యర్ధి 37529
మూడవ 1962 1962-67 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ ఎం. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్ధి 27020
నాలుగవ 1967 1967-71 ఎమ్.నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థి హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ 20245
ఐదవ 1971 1971-77 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కె.అనంతరెడ్డి తెలంగాణా ప్రజాసమితి 59737
ఆరవ 1977 1977-80 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ గడ్డం గంగారెడ్డి బి.ఎల్.డి 159393
ఏడవ 1980 1980-84 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.ఎం.ఖాన్ జనతా పార్టీ 200315
ఎనిమిదవ 1984 1984-89 తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ ఎం.నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2547
తొమ్మిదవ 1989 1989-91 తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ పి.శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ 24099
పదవ 1991 1991-96 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 68348
పదకొండవ 1996 1996-98 గడ్డం ఆత్మచరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ మండవ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 43599
పన్నెండవ 1998 1998-99 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ గడ్డం ఆత్మచరణ్ రెడ్డి భారత జనతా పార్టీ 32756
పదమూడవ 1999 1999-04 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ శనిగరం సంతోష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 3436
పదునాలుగవ 2004 2004-09 మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ సయ్యద్ యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ 137871
పదిహేనవ 2009 2009-14 మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ బిగళ గణేష్ గుప్తా తెలంగాణా రాష్ట్ర సమితి 60390
పదహారవ 2014 2014- కవిత తెలంగాణా రాష్ట్ర సమితి మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 167184

2004 ఎన్నికలు[మార్చు]




Circle frame.svg

2004 ఎన్నికల ఫలితాలను చూఫే "పై" చిత్రం

  సయ్యద్ యూసుఫ్ ఆలీ (38.89%)
  యడ్ల రాము (2.70%)
  బైసా రామదాసు (1.90%)
భారత సాధారణ ఎన్నికలు,2004:నిజామాబాదు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ మధు గౌడ్ యాష్కీ 442,142 56.51 +7.46
తె.దే.పా సయ్యద్ యూసుఫ్ ఆలీ 304,271 38.89 -10.62
బసపా యడ్ల రాము 21,133 2.70
స్వతంత్ర అభ్యర్ది బైసా రామదాసు 14,893 1.90
మెజారిటీ 137,871 17.62 +18.08
మొత్తం పోలైన ఓట్లు 782,439 69.37 +0.49
కాంగ్రెస్ గెలుపు మార్పు +7.46

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.గణేష్ గుప్తా పోటీ చేస్తున్నాడు.[2] భారతీయ జనతా పార్టీ తరఫున సి.జంగయ్య పోటీలో ఉన్నాడు.[3] కాంగ్రెస్ పార్టీ తరఫున మధు యాస్కీకి టికెట్ లభించింది. [4] ప్రజారాజ్యం పార్టీ తరఫున పుంజుల విజయ్‌కుమార్ పోటీపడుతున్నాడు. [5]

2014 ఎన్నికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92795&subcatid=2&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009