Coordinates: 16°30′24″N 80°43′20″E / 16.5066°N 80.7222°E / 16.5066; 80.7222

నిడమానూరు (విజయవాడ గ్రామీణ)

వికీపీడియా నుండి
(నిడమానూరు (విజయవాడ గ్రామీణ మండలం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నిడమానూరు
పరిసరం
ఎహెచ్ -45 పై నిడమనూర్ బోర్డుని చూపుతోంది
ఎహెచ్ -45 పై నిడమనూర్ బోర్డుని చూపుతోంది
నిడమానూరు is located in Andhra Pradesh
నిడమానూరు
నిడమానూరు
Location in Andhra Pradesh, India
Coordinates: 16°30′24″N 80°43′20″E / 16.5066°N 80.7222°E / 16.5066; 80.7222
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంవిజయవాడ గ్రామీణ
Population
 (2011)
 • Total10,375
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521104
ప్రాంతీయ+91-(0)866
Vehicle registrationAP-16

నిడమానూరు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. కృష్ణా జిల్లాలోని విజయవాడకు పరిసర ప్రాంతం.ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

మెట్రోపాలిటన్ ప్రాంతం[మార్చు]

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[2]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఎనికెపాడు, గూడవల్లి, గంగూరు, ముస్తాబాద్ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2001 ఊారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 8,210 - అందులో పురుషుల సంఖ్య 4,135 - స్త్రీల సంఖ్య 4,075 - గృహాల సంఖ్య 2,070

రవాణా సౌకర్యాలు[మార్చు]

నిడమానూరు జాతీయ రహదారి 16 లో ఉంది.[3][4]

బస్సు సౌకర్యం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడ, ఏలూరు నుండి ఈ గ్రామానికి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు సేవలను నడుపుతుంది.

రైలు వసతి[మార్చు]

నిడమానూరు రైల్వే స్టేషన్ రైలు సేవలను అందిస్తుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[5][6] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాలకు జిల్లాలోనే రెండవ అతిపెద్ద పాఠశాలగా గుర్తింపు ఉంది. ఈ పాఠశాల వార్షికోత్సవం 2015,ఫిబ్రవరి-25వ తేదీనాడు నిర్వహించెదరు.
  2. ఈ పాఠశాలలో, 2014, అక్టోబరు-25న, ఎన్.టి.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్, వీరమాచనేని నాగేశ్వరరావు,రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి పథకాన్ని ప్రారంభించారు.
  3. ప్రసాదంపాడుకు చెందిన కె.భీంకుమార్, 1992 వ సంవత్సరంలో, నిడమానూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, 10వ తరగతి చదివినారు. వీరికి ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టాను అందజేసినారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్[మార్చు]

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్[మార్చు]

భారత ప్రభుత్వం యొక్క మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ స్థాపించబడింది.[7]

మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

కృష్ణా నది నుండి పుట్టుకొచ్చే రైవస్ కెనాల్ గ్రామంలో నుండి ప్రవహిస్తుంది. ఈ కాలువ నీటిపారుదల, త్రాగునీటికి ప్రధాన వనరుగా ఉంది.[3][4]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ కి 2021 జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా శీలం రంగారావు సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. గతంలో 2006 నుండి 2011 వరకు సర్పంచిగా పనిచేసాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం.

ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్వవసాయం.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
  3. 3.0 3.1 "Many bridges in Vijayawada need immediate attention".
  4. 4.0 4.1 "Canal bunds hot beds for growth of slums spotlight". The Hindu. 23 August 2007. Retrieved 28 March 2017.
  5. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 19 March 2016. Retrieved 7 November 2016.
  6. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.
  7. "School of Planning and Architecture, Vijayawada". Archived from the original on 2014-09-08. Retrieved 2017-05-20.

వెలుపలి లింకులు[మార్చు]