నితిన్ గడ్కరి

వికీపీడియా నుండి
నితిన్ గడ్కరి
నితిన్ గడ్కరి

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు
Incumbent
Assumed office 
డిసెంబరు 25, 2009
ముందు రాజ్‌నాథ్ సింగ్

జననం మే 27 1957 (1957-05-27) (వయసు 55)
నాగ్పూర్,
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
భార్య/భర్త కామ్చన్ గడ్కరి
సంతానము నిఖిల్, సారంగ్, కెట్కి
వృత్తి న్యాయవాది, పారిశ్రామికవేత్త
మతం హిందూమతము
వెబ్‌సైటు nitingadkari.in

నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిస్రామికవేత్త మరియు రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు.[1] మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించాడు.[2]

విషయ సూచిక

[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం

నితిన్ గడ్కరి ఒక మద్యతరగతి బ్రాహ్మణ కుటుంబములో నాగ్పూర్ లో జన్మించాడు. చిన్న వయస్సులోనే భారతీయ జనతా యువమోర్చా మరియు భాజపా అనుబంధ విధ్యార్థి సంస్థ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్తులో పనిచేశాడు. క్రిందిస్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించాడు.[3] మహారాష్ట్రలోనే M.Com, L.L.B., D.B.Mలను పూర్తిచేశాడు.

[మార్చు] కుటుంబం

నితిన్ గడ్కరి భార్య కాంచన్. వారికి ముగ్గురు సంతానం, నిఖిల్, సారంగ్ మరియు కెట్కి. నితిన్ నాగ్పూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయం ప్రక్కనే నివాసముంటున్నాడు.[4]

[మార్చు] రాజకీయ జీవితం

1995 నుండి 1999 వరకు మహరాష్ట్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ సమయములోనే అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి పేరు సంపాదించాడు. తాను చేపట్టిన శాఖను పై నుండి క్రిందివరకు పూర్తిగా వ్యవస్థీకరించినాడు.[5]

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు