నిన్నే ప్రేమిస్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్నే ప్రేమిస్తా
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్. ఆర్. షిండే
నిర్మాణం ఆర్. బి. చౌదరి
తారాగణం మేకా శ్రీకాంత్,
సౌందర్య,
అక్కినేని నాగార్జున ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్
భాష తెలుగు

నిన్నే ప్రేమిస్తా 2000 సెప్టెంబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం ఘనవిజయం సాధించింది. ఎస్. ఎ. రాజ్‌కుమార్ అందించిన సంగీతం చిత్ర విజయంలో ప్రధనపాత్ర పోషించింది. నీ వరువవై ఎన అనే తమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. ప్రముఖ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి ఈ చిత్రంలో కథానాయిక నాన్న పాత్ర పోషించారు. తనతో పెళ్ళి నిశ్చయమైన ఆర్మీ ఆఫీసరు ప్రమాదంలో చనిపోయినా అతని కళ్ళు పొందిన మరో యువకుడిని ఆరాధించే యువతి కథ ఇది. కానీ ఆమెకు అతన్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉండదు.[1]

కథ[మార్చు]

కల్యాణ్ తన పెళ్ళి గురించి, కాబోయే భార్య గురించి కలలు కంటూ ఉంటాడు. అతనికి బ్యాంకు మేనేజరుగా పదోన్నతి వచ్చి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమలో ఉద్యోగం వస్తుంది. కానీ దారిలో అతను వెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగి అతని రెండు కళ్ళు కనిపించకుండా పోతాయి. మూడు నెలల తర్వాత కల్యాణ్ మళ్ళీ తన బావ రమేష్ తో కలిసి ఆ పల్లెటూరికి వస్తాడు. అక్కడ వారింటికి దగ్గర్లో ఉన్న మేఘమాల (సౌందర్య) వీరికి అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటుంది. వీరిని అభిమానంగా చూస్తుంటుంది. దీన్ని వాళ్ళిద్దరూ ప్రేమగా భావించి అతని తల్లి దండ్రులను (చంద్రమోహన్, సంగీత) పెళ్ళి సంబంధం మాట్లాడటానికి పిలిపిస్తాడు. కానీ మేఘమాల మాత్రం ఆ సంబంధం తనకిష్టం లేదని నేరుగా చెప్పేస్తుంది. శ్రీకాంత్ ఆమెను కారణం అడగ్గా తన గతం గురించి వివరిస్తుంది.

గతంలో మేఘమాలకు శ్రీనివాస్ తో సంబంధం నిశ్చయమై ఉంటుంది. మేఘమాల అతన్ని మనసారా అభిమానిస్తుంటుంది. కానీ ప్రమాదవశాత్తూ అతను బస్సు ప్రమాదంలో మరణిస్తాడు. అతని కళ్ళను శ్రీకాంత్ కు దానం చేస్తారు. తన ప్రియుడు కళ్ళ కోసమే వారిని అభిమానించానని చెబుతుంది.

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

1999 లో తమిళంలో నీ వరువాయ్ ఎన రాజకుమారన్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో పార్తిబన్, దేవయాని ప్రధాన పాత్ర పోషించారు. కేమియో పాత్రలో అజిత్ నటించాడు. ఇందులో నటీనటులు తెలుగు వారికి పెద్దగా పరిచయం లేనివారు కాకపోవడంతో నిర్మాత ఆర్. బి. చౌదరి తెలుగులో పునర్నిర్మాణం చేయాలనుకున్నాడు. శ్రీకాంత్, సౌందర్య, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలకు ఎంపిక కాగా కేమియో పాత్ర నాగార్జున చేయడానికి అంగీకరించాడు. అప్పటికే ఆర్. బి. చౌదరి నిర్మాతగా ఆయన నువ్వు వస్తానని అనే విజయవంతమైన చిత్రంలో నటించి ఉన్నాడు. చాలా ఏళ్ళుగా సహాయ దర్శకుడిగా పరిమితమైన ఆర్. ఆర్. షిండే ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇదే దర్శకుడు ఆ తర్వాత శ్రీకాంత్, సౌందర్య ముఖ్య పాత్రల్లో నా మనసిస్తారా అనే చిత్రాన్ని రూపొందించాడు కానీ అది విజయవంతం కాలేదు. తర్వాత కొన్నాళ్ళకే షిండే గుండెపోటుతో మరణించాడు.

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

  • కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
  • ప్రేమ ఎందుకనీ నేనంటే అంత ప్రేమ నీకు (గానం: రాజేష్ కృష్ణన్)
  • ప్రేమ లేఖ రాసెను నా మనసే
  • ఒక దేవత వెలిసిందీ నా కోసమే (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • గుడి గంటలు మోగిన వేళ (గానం: రాజేష్ కృష్ణన్

మూలాలు[మార్చు]

  1. "కళ్ళు బ్రతికించిన ప్రేమ - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-15. Retrieved 2020-09-16.