పెళ్ళి

వికీపీడియా నుండి
(నిశ్చితార్థం నుండి దారిమార్పు చెందింది)
Wiktionary-logo-en.png
పెళ్ళి గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.


నూతన దంపతులు
.
Marriage Welcome Board
  • వివాహము అనగా పెండ్లి, పాణిగ్రహణము, కన్యాదానము, పరిణయము, కల్యాణము, సప్తపది అని పలు విధములుగా అర్ధములు ఉన్నవి. 'పెళ్ళి'కి ఇంగ్లీషు భాషలో "'మ్యారేజ్"' అని అర్ధము. (ఆంగ్లం: Marriage)
  • హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల జాతక సమ్మేళనము లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు మరియు 20 వింశతి (కూట) వర్గములు అనే వివాహ పొంతనములు చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.
  • ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, అందుబాటు, అవసరార్ధం, అవకాశం, ఆర్ధిక స్థితిగతుల, ఆకాంక్ష అయినదనిపించుకునేందుకు, తదితరాల మేరకు సంబంధము కలుపుకొని నిశ్చయించు కుంటున్నారు. ప్రస్తుతము వివాహ సంబంధములు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలో ఎక్కువగా ఆ కుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.
  • జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు చలం.

విషయ సూచిక

హిందూ వివాహ సంప్రదాయం [మార్చు]

హిందూ వివాహం-సౌగంధికా పరిణయం నుండి ఒక దృశ్యం
  • ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక సుసంస్కారములు జరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారుకాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉన్నది.వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.
  • తల్లిదండ్రుల అనుమతి లేకుండా 21 ఏళ్ళ లోపు వయసున్న యువతిని పెళ్లాడడం శిక్షార్హమైన నేరమని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది.

హిందూ వివాహ పద్ధతిలో తారసపడే కొన్ని పేర్లు, వాటి వివరణలు [మార్చు]

వధువు
  • హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.
వరుడు
  • త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.
పెళ్ళి చూపులు
  • తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన.
  • పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు.
ఆహ్వాన పత్రికలు
  • నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారంగా ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు|పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.
పెళ్ళి పిలుపులు

బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు మారిపోతుంది.

సరంజామా

పెళ్ళి సరంజామా కొనటం అనేది పెళ్ళి వారి ఇండ్లలో అన్నిటికంటే పెద్దపని. పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

కళ్యాణ మండపము

కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

నిశ్చితార్ధము

వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు.

నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు.

స్నాతకము

పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.

కాశీప్రయాణం

బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.

వరపూజ (ఎదురుకోలు)

కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.

గౌరీవృతం
మంగళ స్నానాలు
కన్యావరణము

బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.

మధుపర్కం

మధువు అంటే తేనె.కుమార్తెకు భర్తగా వరుని ఎంపిక తరువాత అతను వధువు తల్లి తండ్రికి సంప్రదాయం అనుసరించి పుత్ర సమానుడౌతాడు.వివాహానంతరం మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్ధము. ఇంతకు ముందు దీనిని ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతము దీనికి బదులుగా వరునికి పంచదార రుచి చూపిస్తున్నారు.

యజ్ఞోపవీతధారణ
మహాసంకల్పం
కాళ్ళు కడుగుట


సుముహూర్తం (జీలకర్ర, బెల్లం)

పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ మంత్రము పఠిస్తారు.

అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే! ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!
కాళ్ళు తొక్కించడం
కన్యాదానం

దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.

కన్యాం కనక సంఫన్నాం'కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం'బ్రహ్మలోక జగీషియా!!

పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా."అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా" భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది."వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది"అని కాశ్యప సంహిత.

దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుతుంది.

స్వర్ణ జలాభిమంత్రం
యోత్రేభంధనం
మంగళసూత్రధారణ

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!!

మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.

పెళ్ళి సమయంలో ఒక కార్యక్రమం
తలంబ్రాలు

మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

ప్రజాపతి స్త్రియాం యశః'ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం'తస్యాగ్నేభాజయేహమా!!
బ్రహ్మముడి


అంగుళీకాలు తీయడం

ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.

సప్తపది, పాణిగ్రహణం
సన్నికల్లుతోయం
రాజహోమం
స్థాలీపాకం
నాగవల్లి
సదస్యం
నల్లపూసలు

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

అరుంధతీ నక్షత్రం
అంపకాలు
సత్యనారాయణ వ్రతం
కంకణి విమోచనం
గర్భాధానం

గర్భాదానం అనగా స్త్రీ గర్భమును పురుషునికి దానం చేయుట. అంటే పురుషుడు తన వీర్యకణ విత్తనాలు నాటుటకు స్త్రీ తన మట్టి వంటి గర్భమును దానం చేయుట.గర్భాధానాన్ని శోభనం అని కూడా అంటారు.గర్భాదానం స్త్రీ యొక్క పుట్టింట 3 రాత్రులు, మెట్టినింట 3 రాత్రులు ఉండును. ఈ కార్యంలో భార్యా భర్తలు శారీకంగా కలుస్తారు.గర్భాదానం వలన సంతానం కలుగుతుంది.

వివాహం తరువాత నవదంపతులు శారీరకంగా ఒకటయ్యే మొదటి రాత్రి జరిపే సంభోగం, శోభనం అంటారు. ఇది నూతన జంటకు చాలా మధురమైనది. ఆ రాత్రిని శోభనరాత్రి అంటారు.

విందువినోదాలు

పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.

వివాహ వయస్సు [మార్చు]

స్త్రీకి సంతాన యోగ్యత 18 నుండి 25 వరకూ ఎక్కువగా ఉంటుంది. 25 నుండి 30 వరకూ సంతాన యోగ్యత తగ్గుతుంది. 30 పైబడిన తర్వాత చాలా అరుదుగా మాత్రమే సంతాన యోగ్యత ఉంటుంది. పురుషుడికి వీర్యకణాల ఉత్పత్తి 25 నుండి 70 సంవత్సరాల వరకూ ఉంటుంది. కనుక వివాహానికి స్త్రీకి కనీసం 18 సంవత్సరాలు, పురుషుడికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి, భార్యా భర్తల మధ్య 3 నుండి 10 సంవత్సరాల తేడా ఉండవచ్చు, భర్త కంటే భార్య చిన్న వయస్కురాలై ఉండాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని భావించేవారు. కాని నేడు నగరాల్లో స్త్రీలు 30 సంవత్సరాలు దాటితే గాని వివాహానికి సిద్ధం కావడం లేదు. ఫలితంగా సంతానం కోసం వైద్యుల చుట్టూరా తిరుగుతున్నారు.

క్రైస్తవ్యంలో వివాహం [మార్చు]

వివాహము అన్ని విషయములకంటే ఘనమైనది అని పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ - హెబ్రీయుల పుస్తకంలో 13 వ అధ్యాయం 4 వ వచనంగా వ్రాయబడినది.

ఇస్లాంలో వివాహం [మార్చు]

  • పెళ్ళి తప్పక చెయ్యాలని అందరు ప్రవక్తలు చెప్పారు. పెళ్ళి సగం విశ్వాసం అన్నారు. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది, సమాజాన్ని సక్రమంగా పట్టి ఉంచే వల అన్నారు. వివాహం స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు.
  • ముస్లిం పురుషుడు 10 స్త్రీలను పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం స్త్రీ మాత్రం ఒకే పురుషుడిని చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి [మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

గమనికలు [మార్చు]

  • పండిట్ మహేశ్వర శాస్త్రి రచించిన పుస్తకము: వేద హిందూ వివాహము[1] చూడండి.
  • [2] చూడండి.
  • [3] చూడండి.
  • [4] చూడండి.
"http://te.wikipedia.org/w/index.php?title=పెళ్ళి&oldid=809437" నుండి వెలికితీశారు