నిస్సాన్
| రకం | Public (TYO: 7201; మూస:Pinksheets) |
|---|---|
| Founded | December 26, 1933 |
| వ్యవస్థాపకు(లు) |
|
| ప్రధానకార్యాలయం | Nishi-ku, Yokohama, Japan (Officially registered in Kanagawa-ku, Yokohama, Kanagawa) |
| Area served | Worldwide |
| కీలక వ్యక్తులు |
|
| పరిశ్రమ | |
| ఉత్పత్తులు | |
| ఆదాయం | |
| నిర్వహణ రాబడి | |
| Net income | |
| ఉద్యోగులు | 30,718 (non-consolidated basis) 175,766 (consolidated basis)[2] |
| విభాగాలు | |
| Subsidiaries | |
| వెబ్‌సైటు | www.nissan-global.com |
మూస:Nihongo (TYO: 7201) అనేది ఒక బహుళజాతి వాహన తయారీదారు, జపాన్‌లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది, క్లుప్తంగా దీనిని నిస్సాన్ గా గుర్తిస్తున్నారు. గతంలో ఇది నిస్సాన్ గ్రూపులో ఒక ప్రధాన సభ్య సంస్థగా ఉంది, అయితే కార్లోస్ ఘోసన్ (సిఈఓ) నేతృత్వంలో దీని యొక్క పునర్వవ్యవస్థీకరణ జరిగిన తరువాత, ఇప్పుడు మరింత స్వతంత్ర సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ సంస్థ "డాట్‌సన్" బ్రాండ్ పేరుతో గతంలో వాహనాల వ్యాపారం చేసింది, ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీదారుల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. ఆగస్టు 2009నాటికి కంపెనీ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం నిషి-కు, యోకోహామాలో ఉంది. 1999లో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ ఎస్.ఏతో నిస్సాన్ ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఈ ఒప్పందంలో భాగంగా నిస్సాన్‌లో 43.4% వాటా రెనాల్ట్ కొనుగోలు చేసింది, రెనాల్ట్‌లో నిస్సాన్ 15% వాటా పొందింది. 2008నాటికి ఈ వాటాల స్థాయిల్లో ఎటువంటి మార్పులు జరగలేదు. అమెరికా వాహన విక్రయాల్లో హోండా మరియు టయోటాలతోపాటు, ఆసియాకు చెందిన మోటారు వాహన తయారీదారులన్నింటి కంటే నిస్సాన్ యొక్క ప్రస్తుత మార్కెట్ వాటా అధికంగా ఉంది, చారిత్రాత్మకంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న యుఎస్-కు చెందిన "బిగ్ త్రీ" జీఎం, ఫోర్డ్ మరియు క్రిస్లెర్ కంపెనీలతో పోలిస్తే విక్రయాల్లో నిస్సాన్ వాటా నానాటికీ పెరుగుతోంది. స్వదేశీ మార్కెట్‌లో నిస్సాన్ మూడో అతిపెద్ద కార్ల తయారీదారుగా గుర్తించబడుతుంది, అతికొద్ది తేడాతో హోండా రెండో స్థానంలో మరియు టయోటా బాగా బలమైన స్థితితో మొదటి స్థానంలో ఉన్నాయి. సాధారణ స్థాయి మోడళ్లతోపాటు, ఇన్ఫినిటీ వంటి విలాసవంతమైన కార్లను కూడా నిస్సాన్ తయారు చేస్తోంది.
V6 విన్యాసం గల నిస్సాన్ విక్యూ (VQ) ఇంజిన్ వరుసగా 14 సంవత్సరాలు వార్డ్ యొక్క 10 అత్యుత్తమ ఇంజిన్‌లలో చోటు దక్కించుకుంది.
వివిధ మార్కెట్‌లలో సంస్థ పేరును పలురకాలుగా ఉచ్చరిస్తున్నారు. USలో బ్రాండ్ పేరు pronounced /ˈniːsɑːn/గా ఉండగా, UKలో దీని పేరు మూస:IPA-enగా ఉంది. జపనీస్ భాషలో దీని పేరు మూస:IPA-jaగా పలుకుతున్నారు.
చరిత్ర [మార్చు]
1914 నుంచి డాట్‌సన్ పేరు ప్రారంభం [మార్చు]
కంపెనీ యొక్క భాగస్వాముల కుటుంబ పేర్లకు కొత్త కారు పేరు క్లుప్తపదంగా ఉంది.:
1918లో దీని పేరును క్వాయిషిన్షా మోటార్‌కార్ కో. గా మార్చారు, 1925లో తిరిగి కంపెనీ పేరును డాట్ మోటార్‌కార్ కో. గా మార్చడం జరిగింది. డాట్ మోటార్స్ డాట్ మరియు డాట్‌సన్ ప్రయాణిక కార్లతోపాటు ట్రక్‌లను తయారు చేసింది. ఆ సమయంలో ప్రయాణిక కార్ల మార్కెట్‌లో దాదాపుగా వినియోగదారులెవరూ లేకపోవడంతో, ఉత్పత్తిలో ఎక్కువ భాగం ట్రక్కులు ఉండేవి. 1918 నుంచి మొదటి డాట్ ట్రక్కులను సైనిక మార్కెట్ కోసం తయారు చేశారు. 1920వ దశకంలో సైనిక మార్కెట్‌లో తక్కువ గిరాకీ ఉంది, అందువలన 1926లో ఈ కంపెనీ జపాన్‌లో అత్యంత విజయవంతమైన రెండో ట్రక్ తయారీదారు జిట్‌సుయో మోటార్స్‌తో విలీనం చేయబడింది.
1926లో టోక్యో-కు చెందిన డాట్ (DAT) మోటార్స్ ఒసాకా-కు చెందిన మూస:Nihongoతో (దీనిని జిట్‌సుయో మోటార్స్ గా కూడా గుర్తిస్తారు, దీనిని 1919లో కుబోటా అనుబంధ సంస్థగా స్థాపించారు) విలీనమైంది, విలీనం తరువాత కంపెనీ పేరు 1932 వరకు మూస:Nihongoగా ఉంది.
1931లో డాట్ ఒక కొత్త చిన్న కారును తయారు చేసింది, ఇది మొదటి "డాట్‍సన్" కారు, దీనికి డాట్ కుమారుడు అనే అర్థం వస్తుంది. 1933 తరువాత నిస్సాన్ పూర్తిగా డాట్ మోటార్స్‌ను తన నియంత్రణలోకి తీసుకుంది, అప్పటివరకు ఉపయోగించిన Datson (డాట్‌సన్) పేరులోని చివరి పదాన్ని sunగా మార్చారు, జపనీస్ భాషలో "son" అనే పదానికి "నష్టం" (損) అనే అర్థం కూడా ఉండటంతో ఈ మార్పు చేశారు, అందువలన కంపెనీ పేరు మూస:Nihongoగా మారింది.[3]
1933లో కంపెనీ పేరు నిప్పాన్‌లోకి స్థానికీకరించి మూస:Nihongoగా మార్చారు, ఆపై కంపెనీని యోకోహామాకు తరలించారు.
మొదటిసారి 1930వ దశకంలో నిస్సాన్ పేరు ఉపయోగం [మార్చు]
1928లో యెషిసుకే ఐకావా యాజమాన్య కంపెనీ నిప్పాన్ సాంగ్యో (జపాన్ ఇండస్ట్రీస్ లేదా నిప్పాన్ ఇండస్ట్రీస్)ను స్థాపించారు. నిస్సాన్ అనే పేరు 1930వ దశకంలో టోక్యో స్టాక్ మార్కెట్‌లో నిప్పాన్ సాంగ్యోకు ఉపయోగించే ఒక సంక్షిప్త నామం[4] నుంచి పుట్టింది. ఈ కంపెనీ టోబాటా కాస్టింగ్ మరియు హిటాచీలను చేర్చిన ప్రసిద్ధ నిస్సాన్ "జైబాట్సు"గా ప్రాచుర్యం పొందింది. ఈ సమయంలో నిస్సాన్ ఫౌండ్రీలు మరియు ఆటో విడిభాగాల వ్యాపారాలను నియంత్రించేది, అయితే ఐకావా 1933 వరకు ఆటోమొబైల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టలేదు.[5]
నిస్సాన్ చివరకు 74 కంపెనీల విలీనం చేసుకొని వృద్ధి చెందింది, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాలుగో అతిపెద్ద సంయుక్త సంస్థగా అవతరించింది.[6]
1931లో ఐకావా DAT మోటార్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేశారు, తరువాత 1933లో టోబాటా కాస్టింగ్ యొక్క ఆటోమొబైల్ విడిభాగాల విభాగంతో DAT మోటార్స్‌తో విలీనమైంది. టోబాటా కాస్టింగ్ ఒక నిస్సాన్ కంపెనీగా ఉండటంతో, నిస్సాన్ ఆటోమొబైల్ తయారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[7]
1934లో నిస్సాన్ మోటార్స్ స్థాపన [మార్చు]
1934లో ఐకావా, విస్తరించిన టోబాటా కాస్టింగ్ యొక్క ఆటోమొబైల్ విడిభాగాల విభాగాన్ని వేరు చేశారు, ఒక కొత్త అనుబంధ సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు, దీనికి ఆయన నిస్సాన్ మోటార్ (నిస్సాన్) అనే పేరు పెట్టారు. మూస:Nihongo. అయితే కొత్త కంపెనీ యొక్క వాటాదారులు జపాన్‌లో ఆటోమొబైల్ రంగం యొక్క భరోసాపై పెద్దగా నమ్మకం కలిగిలేరు. అందువలన టోబాటా కాస్టింగ్ వాటాదారుల వద్ద ఉన్న వాటాలన్నింటినీ జూన్ 1934లో ఐకావా కొనుగోలు చేశారు (నిప్పాన్ ఇండస్ట్రీస్ యొక్క మూలధనాన్ని ఉపయోగించి ఆయన ఈ వాటాల కొనుగోలు చేశారు). ఈ సమయంలో నిస్సాన్ మోటార్స్ పూర్తిగా నిప్పాన్ సాంగ్యో అండ్ హిటాచీ యాజమాన్య సంస్థగా మారింది.[8]
నిస్సాన్ జపాన్ సైన్యం కోసం ట్రక్కులు, విమానాలు మరియు ఇంజిన్‌లను తయారు చేసింది. కంపెనీ యొక్క ప్రధాన ప్లాంట్‌ను చైనాకు తరలించింది, జపాన్ చైనా భూభాగాన్ని ఆక్రమించిన తరువాత ఈ ప్రాంతంలో కంపెనీ ప్రధాన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. జపనీయుల యుద్ధ సన్నాహాల కోసం ఈ ప్లాంట్ యంత్రాలను తయారు చేసింది, ఆపై దీనిని అమెరికా మరియు రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 1947 నుంచి 1948 వరకు కంపెనీని నిస్సాన్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ గా పిలిచారు.
అమెరికాతో నిస్సాన్ ప్రారంభ సంబంధాలు [మార్చు]
కుబోటా యొక్క ప్రధాన డిజైనర్, అమెరికాకు చెందిన విలియం ఆర్. గోర్హామ్‌ను DAT పొందింది. 1908లో డెట్రాయిట్‌లో ఐకావా పర్యటన, ఈ అమెరికా డిజైనర్ సేవలు రెండూ నిస్సాన్ యొక్క భవిష్యత్‌ను బాగా ప్రభావితం చేశాయి.
అమెరికా నుంచి ఆధునిక వాహన తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ఎల్లప్పుడూ ఐకావా ఆసక్తి చూపేవారు, గోర్హామ్ ఈ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. అన్ని యంత్రాలు, వాహన నమూనాలు మరియు ఇంజిన్ నమూనాలు మొదట అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఎక్కువ భాగం సాధన సామాగ్రి గ్రాహమ్ కర్మాగారం నుంచి వచ్చాయి, ట్రక్కులు తయారు చేసేందుకు నిస్సాన్‌కు ఒక గ్రాహమ్ లైసెన్స్ కూడా ఉంది. నిస్సాన్ తరపున మిత్సుబిషి ఈ యంత్రాలను జపాన్‌కు దిగుమతి చేసేది[9], ఆపై కార్లను తయారు చేసిన మొట్టమొదటి కంపెనీగా నిస్సాన్ గుర్తింపు పొందింది. ఈ కార్లను నిస్సాన్ యొక్క యోకోహామా కర్మాగారంలో తయారు చేశారు.
ఫోర్డ్ మోటార్ కంపెనీతో అనుబంధం [మార్చు]
1993-2002 మధ్యకాలంలో నిస్సాన్ అమెరికాకు చెందిన ఫోర్డ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది, తమ యొక్క మెర్క్యూరీ విలేజెర్ మరియు నిస్సాన్ క్వెస్ట్ వాహనాల విక్రయాల కోసం ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టాయి. ఈ రెండు మినీవ్యాన్‌లను దాదాపుగా ఒకే రకమైన భాగాలతో తయారు చేయబడ్డాయి, అనేక పై మార్పుల మినహా మిగిలిన భాగాలన్నీ ఒకేరకంగా ఉంటాయి. 2002లో ఫోర్డ్ తమ యొక్క ఫ్రీస్టార్ మరియు మాంటెరే వాహనాల విక్రయాల కోసం ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. నిస్సాన్ ఆ తరువాత 2004లో కొత్త క్వెస్ట్ వాహనాన్ని విడుదల చేసింది, దీనిని సొంతగా తయారు చేసింది, దీనిలో ఫోర్డ్ నమూనాలను అసలు ఉపయోగించలేదు.
1992లో నిస్సాన్ టెర్రానో నాలుగు-చక్రాల వాహనాన్ని తిరిగి ఆవిష్కరించింది, ఇది పై మెరుగుల పరంగా మరియు యాంత్రికంగా ఫోర్డ్ మావెరిక్‌ను పోలివుంటుంది. ఈ రెండు కార్లను స్పెయిన్‌లో నిర్మించింది. 1998లో విక్రయాలు ఆశాజనకంగా లేకపోవడంతో మావెరిక్ తయారీని నిలిపివేసినప్పటికీ, నిస్సాన్ టెర్రానో మాత్రం బలమైన వ్యాపారాన్ని కనబరిచింది, 2005 వరకు దీని ఉత్పత్తి కొనసాగింది, ఆ తరువాత దీని స్థానంలో నిస్సాన్ పాత్‌ఫైండర్ వాహనాన్ని విడుదల చేశారు.
ఆస్టిన్ మోటార్ కంపెనీ [మార్చు]
హినో మరియు ఐసుజు మాదిరిగా, నిస్సాన్ కూడా ఒక వ్యవస్థాపక యూరోపియన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది, ఆటోమొబైల్ మరియు ఇంజిన్ నమూనాలను పొందేందుకు నిస్సాన్ ఈ చర్య చేపట్టింది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఆస్టిన్‌తో నిస్సాన్ ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టింది, ఆస్టిన్ తరువాత మోరీస్ మరియు ఇతరాల విలీనంతో బ్రిటీష్ మోటార్ కార్పొరేషన్‌గా అవతరించింది. 1930లో నిస్సాన్ ఆస్టిన్ 7ను నిర్మించడం ప్రారంభించింది, అయితే వారి లైసెన్స్‌కు చట్టబద్ధత ఆ సమయంలో చర్చనీయాంశంగా ఉండేది.
1952లో జపాన్‌కు చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ ఆస్టిన్‌తో ఒక చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది,[10] పాక్షికంగా నిర్మించిన భాగాలను దిగుమతి చేసుకొని సుమారుగా 2000 ఆస్టిన్ వాహనాలను పూర్తిగా సిద్ధం చేసి ఆస్టిన్ వ్యాపార చిహ్నంతో విక్రయించడానికి నిస్సాన్ ఈ ఒప్పందంలోకి అడుగుపెట్టింది. ఈ ఒప్పందం నిస్సాన్ అన్ని ఆస్టిన్ భాగాలను స్థానికంగా మూడేళ్లలో తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది, ఈ లక్ష్యాన్ని నిస్సాన్ అందుకుంది. నిస్సాన్ ఏడేళ్లపాటు ఆస్టిన్‌లను ఉత్పత్తి చేసి, విక్రయాలు జరిపింది. ఈ ఒప్పందం ఆస్టిన్ మేధోసంపత్తి హక్కులను ఉపయోగించుకొనే హక్కులను నిస్సాన్‌కు ఇచ్చింది, ఈ హక్కులను ఉపయోగించుకొని నిస్సాన్ తమ యొక్క డాట్‌సన్ శ్రేణి కార్లను అభివృద్ధి చేసింది. 1953లో బ్రిటీష్-నిర్మిత ఆస్టిన్‌లను నిర్మించి విక్రయించడం మొదలుపెట్టారు, అయితే 1955లో ఆస్టిన్ ఏ50ను నిస్సాన్ పూర్తిగా నిర్మించి జపాన్ మార్కెట్‌లో విక్రయాలకు అందుబాటులోకి తెచ్చింది, అయితే దీనికి కొత్త 1489 సిసి ఇంజిన్‌తో కొంచెం పెద్ద శరీర భాగం ఉంటుంది. 1953-1959 మధ్యకాలంలో నిస్సాన్ 20,855 ఆస్టిన్‌లను ఉత్పత్తి చేసింది.[11]
నిస్సాన్ తమ సొంత ఆధునిక ఇంజిన్ నమూనాలను మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ఆస్టిన్ మేధోసంపత్తి హక్కులను ఉపయోగించుకుంది, ఆస్టిన్ యొక్క A- మరియు B-శ్రేణి నమూనాలు దీనిలో భాగంగా అభివృద్ధి చేసింది. 1967లో కొత్త నమూనా A శ్రేణి ఇంజిన్ ద్వారా ఆస్టిన్-నుంచి పొందిన ఇంజిన్‌ల యొక్క గరిష్ట సమర్థతను నిస్సాన్ అందుకుంది. 1967లో నిస్సాన్ తన యొక్క కొత్త అత్యాధునిక నాలుగు సిలిండర్‌ల ఓవర్‌హెడ్ క్యామ్ (OHC) నిస్సాన్ ఎల్ ఇంజిన్‌ను పరిచయం చేసింది, ఇది మెర్సెడెజ్ - బెంజ్ OHC నమూనాలతో సారూప్యత కలిగివున్న ఈ ఇంజిన్ నిస్సాన్ రూపొందించిన ఒక పూర్తిస్థాయి కొత్త ఇంజిన్‌గా గుర్తింపు పొందింది. ఈ ఇంజిన్‌తో కొత్త డాట్‌సన్ 510 వాహనానికి బాగా ప్రాచుర్యం కల్పించింది, ఇది ప్రపంచవ్యాప్త సెడన్ మార్కెట్‌లో నిస్సాన్ కీర్తిప్రతిష్టలను పెంచింది. తరువాత 1969లో నిస్సాన్ డాట్‌సన్ 240జెడ్ స్పోర్ట్స్ కారును పరిచయం చేసింది, ఇది ఆరు సిలిండర్‌ల ఎల్ శ్రేణి ఇంజిన్‌ను ఉపయోగించింది. 240జెడ్ ఒక తక్షణ సంచలనంగా ఆటోమొబైల్ మార్కెట్‌లో నిస్సాన్‌కు ప్రపంచ శ్రేణి హోదాను కల్పించింది.[citation needed]
ప్రిన్స్ మోటార్ కంపెనీతో విలీనం [మార్చు]
1966లో ప్రిన్స్ మోటార్ కంపెనీతో నిస్సాన్ విలీనమైంది, తద్వారా కంపెనీ మరిన్ని ఉన్నత శ్రేణి కార్లను తీసుకొచ్చింది, దీంతో నిస్సాన్ కార్ల శ్రేణిలో స్కైలైన్ మరియు గ్లోరియా వంటి వాహనాలు వచ్చి చేరాయి. ప్రిన్స్ పేరును చివరకు తొలగించారు, తరువాతి స్కైలైన్ మరియు గ్లోరియా కార్లకు నిస్సాన్ పేరును మాత్రమే ఉపయోగించారు. అయితే ప్రిన్స్ పేరును మాత్రం ఇప్పటికీ కొన్ని జపనీస్ నిస్సాన్ డీలర్‌షిప్‌లలో ఉపయోగిస్తున్నారు. నిస్సాన్ ఒక కొత్త విలాసవంతమైన బ్రాండ్‌ను 1989లో అమెరికా మార్కెట్ కోసం విడుదల చేసింది, దీని పేరు ఇన్ఫినిటీ.
విదేశీ విస్తరణ [మార్చు]
1950వ దశకంలో, నిస్సాన్ ప్రపంచవ్యాప్త మార్కెట్‌లలోకి విస్తరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. నిస్సాన్ యాజమాన్యం వాటి డాట్‌సన్ చిన్న కార్ల శ్రేణి ఆస్ట్రేలియా మరియు ప్రపంచంలో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా పరిగణించబడిన అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి మార్కెట్‌లలో ఉన్న గిరాకీని తీరుస్తుందని భావించింది. 1959 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో నిస్సాన్ మొదట తమ కార్లను ప్రదర్శించింది, ఆ ఏడాది కొన్ని కార్లను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విక్రయించింది. కంపెనీ 1959లో యుకాటా కాటాయామా నేతృత్వంలో నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ U.S.A. పేరుతో ఒక US అనుబంధ సంస్థను స్థాపించింది. అత్యాధునిక సాంకేతిక పురోగమనాలతో సెడన్‌ల విభాగంలో నిస్సాన్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడం కొనసాగించింది, దీని కోసం డాట్‌సన్ ఫెయిరీలేడీ రోడ్‌స్టార్స్, రేస్-ల్లో విజయవంతమైన 411-శ్రేణి, డాట్‌సన్ 510 వంటి ఇటాలియన్ శైలి స్పోర్ట్స్ కార్లు మరియు ప్రపంచ శ్రేణి డాట్‌సన్ 240జెడ్ వంటి మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది, 1970నాటికి కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుల్లో ఒకదానిగా గుర్తింపు పొందింది.
1973 చమురు సంక్షోభం నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా (ముఖ్యంగా లాభదాయకమైన US మార్కెట్‌లో) వినియోగదారులు అధిక నాణ్యత గల చిన్న ఎకనమీ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ పెరుగుతున్న గిరాకీని అందుకునేందుకు, కంపెనీ మెక్సికో, ఆస్ట్రేలియా, తైవాన్ మరియు దక్షిణాఫ్రికా దేశాల్లో కర్మాగారాలను నిర్మించింది.
1964నాటి చికెన్ ట్యాక్స్ పరిధిలో దిగుమతి చేసుకున్న వ్యాపార వ్యాన్‌లపై 25% పన్ను విధించారు.[12] దీనికి స్పందనగా, నిస్సాన్, టయోటా మోటార్ కార్పొరేషన్ మరియు హోండా మోటార్ కార్పొరేషన్ 80వ దశకం ప్రారంభంలో USలోనే ప్లాంట్‌లను నిర్మించడం మొదలుపెట్టాయి.[12]
టెన్నెస్సీలోని స్మైర్నాలో నిస్సాన్ యొక్క ప్రారంభ అసెంబ్లీ ప్లాంట్ ఉంది, ఇక్కడ మొదట 720 మరియు హార్డ్‌బాడీ వంటి ట్రక్కులను మాత్రమే నిర్మించారు, అయితే అనేక కార్లు మరియు SUV శ్రేణి ఉత్పత్తుల పెరిగిపోయిన తరువాత అల్టిమా, మ్యాక్సిమా, ఎక్స్‌టెర్రా మరియు పాత్‌ఫైండర్‌ల నిర్మాణ కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభించారు. టెన్నెస్సీలోని డెచెర్డ్‌లో తరువాత ఒక ఇంజిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు, ఇటీవల మిసిసిపీలోని కాంటోన్‌లో రెండో అసెంబ్లీ ప్లాంట్‌ను స్థాపించారు.
నిస్సాన్ 1998లో తమ ప్రధాన కార్యాలయ భవనాల్లో ఒకదానిని మోరీ గ్రూపుకు $107.8 మిలియన్‌లకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.[13]
తమ యొక్క ఐరోపా వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎగుమతి సుంకాలు మరియు సరఫరా వ్యయాలను అధిగమించేందుకు ఐరోపాలో నిస్సాన్ ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించింది. ఒక విస్తృత పరిశీలన తరువాత, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న సుండర్‌ల్యాండ్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఎంపిక చేసింది, నైపుణ్యం ఉన్న కార్మికుల లభ్యత మరియు ప్రధాన నౌకాశ్రయాలకు చేరువలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని ప్లాంట్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. నిస్సాన్ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ (యుకే) లిమిటెడ్ పేరుతో 1986లో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2007నాటికి ఇది ఏడాదికి 400,000 వాహనాలను తయారు చేస్తుంది, ఐరోపాలో అత్యధిక వాహనాలు తయారు చేసే ఉత్పాదక కేంద్రంగా ఈ ప్లాంట్ గుర్తింపు పొందింది.
ఆస్ట్రేలియాలో ఆర్థిక ఇబ్బందులు (బిలియన్లలోకి చేరడంతో) కారణంగా 1980వ దశకంలో నిస్సాన్ తన ఉత్పాదక కార్యకలాపాలను నిలిపివేసింది. "బటన్ ప్లాన్" కారణంగా నిస్సాన్ యొక్క ఆస్ట్రేలియా కార్యకలాపాలు ప్రత్యేకంగా ఉంటాయి, ఇక్కడ నిస్సాన్ ఉత్పత్తులను పేర్లు మార్చి జనరల్ మోటార్స్ హోల్డెన్ మరియు ఫోర్డ్ కంపెనీల ద్వారా విక్రయిస్తున్నారు: పల్సర్‌ను హోల్డెన్ ఆస్ట్రాగా మరియు బ్లూబర్డ్‌ను ఫోర్డ్ కార్సైర్‌గా విక్రయించడం జరుగుతుంది.
2005లో, నిస్సాన్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది, ఇక్కడ నిస్సాన్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక అనుబంధ సంస్థను స్థాపించింది.[14] అంతర్జాతీయ భాగస్వామి రెనాల్ట్‌తో నిస్సాన్ చెన్నైలో ఒక ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు $920 మిలియన్‌ల పెట్టుబడి పెట్టింది, భారతీయ మార్కెట్‌లో వాహనాలు విడుదల చేసేందుకు మరియు ఐరోపాకు చిన్న కార్లను ఎగుమతి చేసేందుకు చెన్నైలో ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.[15]
చైనాలో 2009లో నిస్సాన్ సుమారుగా 520,000 కొత్త వాహనాలను విక్రయించింది, డోంగ్‌ఫెంగ్ మోటార్ కంపెనీతో ఉమ్మడి వ్యాపారం ద్వారా నిస్సాన్ చైనా మార్కెట్‌లో కార్యకలాపాలు సాగిస్తుంది, ఇక్కడ కంపెనీ 3 లేదా 4 సంవత్సరల్లో 1 మిలియన్ వాహనాలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు డోంగ్‌ఫెంగ్-నిస్సాన్ తమ ఉత్పాదక కేంద్రాన్ని గువాంగ్‌ఝౌలో విస్తరిస్తుంది, దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద నిస్సాన్ కర్మాగారంగా అభివృద్ధి చేస్తున్నారు, విస్తరణ పూర్తయ్యేనాటికి ఇది ఉత్పాదక సామర్థ్యం పరంగా అతిపెద్ద నిస్సాన్ కర్మాగారంగా గుర్తింపు పొందనుంది.[16]
ట్రక్కులు [మార్చు]
నిస్సాన్ టైటాన్ 2004లో విడుదలైంది, ఇది పూర్తి-స్థాయి పికప్ ట్రక్, దీనిని ఉత్తర అమెరికా మార్కెట్ కోసం తయారు చేశారు, ఈ ట్రక్ నిస్సాన్ ఆర్మడా మరియు ఇన్ఫినిటీ QX56 SUVలతో నిస్సాన్ ఎఫ్-ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది.
టైటాన్‌లో 32 వాల్వ్ 5.6 L VK56DE V8 ఇంజిన్ ఉంటుంది, ఇది 317 hpని సృష్టిస్తుంది, ఇది సుమారుగా 9500 పౌండ్‌ల ఈడ్చుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. నిస్సాన్ నాలుగు ప్రాథమిక ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులోకి వచ్చింది, అవి: XE , SE , ప్రో-4X , మరియు LE . ఒక్క స్థాయి మధ్య ట్రక్ అందించే సదుపాయాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. Edmunds.com దీనిని ఉత్తమ పూర్తిస్థాయి ట్రక్కుగా గుర్తించింది. 2004లో టైటాన్‌కు నార్త్ అమెరికా ట్రక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్ లభించింది.
రెనాల్ట్‌తో భాగస్వామ్యం [మార్చు]
1999లో నిస్సాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది, దీంతో నిస్సాన్ ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ ఎస్.ఏ.తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.[17]
మార్చి 27, 1999న రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్య ఒప్పందం పై సంతకం జరిగింది, జపాన్ మరియు ఫ్రాన్స్ కార్ల తయారీదారుల మధ్య ఇటువంటి ఒప్పందం ఒకటి కుదరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ రెండు దేశాల సంస్థలకు సొంత విలక్షణ కార్పొరేట్ సంస్కృతి రియు బ్రాండ్ గుర్తింపు ఉన్నాయి. ఇదే ఏడాది రెనాల్ట్ తమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కార్లోస్ ఘోసన్‌ను నిస్సాన్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది, నిస్సాన్ డీజిల్‌లో 22.5% వాటాను కొనుగోలు చేసింది. తరువాతి సంవత్సరం, నిస్సాన్‌లో ఉన్నతస్థాయి జపనీస్ అధికారులను విధులు నుంచి తొలగించారు.
రెనాల్ట్-నిస్సాన్ భాగస్వామ్యం తరువాతి సంవత్సరాల్లో మరింత బలపడింది, రెనాల్ట్ 44.3% నిస్సాన్ వాటాలను కొనుగోలు చేసింది, ఇదిలా ఉంటే నిస్సాన్ వద్ద రెనాల్ట్ వాటాలు 15% ఉన్నాయి, అయినప్పటికీ ఫ్రాన్స్‌లో చట్టబద్ధమైన నియంత్రణ కారణంగా నిస్సాన్‌కు ఓటు లేదా బోర్డు ప్రాతినిధ్యం ఉండదు.
సిఈఓ ఘోసన్ యొక్క నిస్సాన్ పునరుద్ధరణ ప్రణాళికలో (NRP) భాగంగా కంపెనీ పూర్తిగా కోలుకుంది, దీనిని ఆర్థికవేత్తలు చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ పునరుద్ధరణగా పరిగణిస్తున్నారు, నిస్సాన్ మరియు ఇన్ఫినిటీ మోడల్ శ్రేణుల్లో నాటకీయంగా విక్రయాలు పెరగడంతో కంపెనీకి రికార్డు స్థాయి లాభాలు వచ్చాయి. 2001లో కంపెనీ NRP విజయం కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని నిస్సాన్ 180ని ఆవిష్కరించింది. 180లో ఏర్పాటు చేసిన లక్ష్యాల్లో అదనంగా 1 మిలియన్ కార్ల విక్రయాలు, 8% నిర్వహణా లాభాలు పొందడం మరియు ఎటువంటి వాహన రుణాలు లేని స్థాయికి చేరుకోవడం భాగంగా ఉన్నాయి. జపనీస్ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కంపెనీ పునరుద్ధరణకు ప్రధాన కారకుడిగా జపాన్‌లో ఘోసన్ మంచి పేరు సాధించారు. ఘోసన్ మరియు నిస్సాన్ పునరుద్ధణలు జపనీయుల మాంగా మరియు జనరంజక సంక్కృతిలో కీర్తించబడుతున్నాయి. నిస్సాన్‌కు పునరుజ్జీవనం కల్పించడంలో ఆయన సాధనలను జపాన్ ప్రభుత్వం కూడా సముచిత రీతిలో సత్కరించింది, 2004లో జపాన్ ప్రభుత్వం ఆయనకు జపాన్ మెడల్ ఆఫ్ బ్లూ రిబ్బన్‌ను అందించింది.[18]
నిస్సాన్-రెనాల్ట్ భాగస్వామ్యంలో మొదటి ఉత్పత్తి నిస్సాన్ ప్రిమెరా, ఇది 2001లో విడుదలైంది, 2000లో ఆవిష్కరించబడిన రెనాల్ట్ లాగునాతో ఇది ఛేసిస్ పంచుకుంటుంది. తరువాత, నిస్సాన్ యొక్క మైక్రా, నోట్ మరియు వెర్సా మోడళ్లు విడుదలయ్యాయి, ఇవి కూడా కొంత వరకు రెనాల్ట్ క్లియో యొక్క యాంత్రిక నమూనాను పంచుకుంటున్నాయి.
డైమ్లెర్ మరియు రెనాల్ట్ రెండింటినీ చేర్చేందుకు భాగస్వామ్య విస్తరణ [మార్చు]
ఏప్రిల్ 7, 2010న, డైమ్లెర్ ఏజీ నిస్సాన్ మరియు రెనాల్ట్ రెండు కంపెనీల నుంచి 3.9% వాటాలకు బదులుగా తమ యొక్క 3.9% వాటాలను ఇచ్చిపుచ్చుకుంది. ఈ త్రైపాక్షిక భాగస్వామ్యం సాంకేతిక మరియు అభివృద్ధి వ్యయాల పంపిణీని పెంచేందుకు వీలు కల్పించింది, అంతేకాకుండా అంతర్జాతీయ సహకారం మరియు పరస్పర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.[19] డైమ్లెర్‌తో భాగస్వామ్యాన్ని బ్యాటరీ/ఎలక్ట్రిక్ సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
నిస్సాన్ మోటార్ కో - నిస్సాన్ కంప్యూటర్ కార్పొరేషన్ [మార్చు]
డిసెంబరు 1999లో, నిస్సాన్ కంప్యూటర్ అధ్యక్షుడు ఉజీ నిస్సాన్ నుంచి $10,000,000 నష్టపరిహారాన్ని కోరుతూ నిస్సాన్ మోటార్స్ ఒక కేసు పెట్టింది. డిసెంబరు 2002లో నిస్సాన్ పేరును మరియు తన యొక్క Nissan.com మరియు Nissan.net పేర్ల ఉపయోగాన్ని నియంత్రించేందుకు ఒక నిషేధాజ్ఞను కోరుతూ ఉజీ నిస్సాన్ కేసు పెట్టారు.
2004లో తొమ్మిదో అప్పీల్స్ సర్క్యూట్ కోర్టు కేసుపై పునర్విచారణకు అప్పీలు చేయడానికి నిస్సాన్ కంప్యూటర్‌కు వీలు కల్పించింది, దీని ఫలితంగా నిస్సాన్ మోటార్స్‌కు గతంలో అనుకూలంగా వచ్చిన తీర్పులు ప్రతికూలంగా మారాయి.[20]
ఫిబ్రవరి 5, 2008న ఈ కేసుపై తుది తీర్పు వచ్చింది, ఈ తీర్పు ఏ పక్షానికి ఆధిపత్యం ఇవ్వలేదు, వ్యయాలు చెల్లించాలని నిస్సాన్ కంప్యూటర్‌కు సూచించింది.[21] ఈ తీర్పు తరువాత వెంటనే నిస్సాన్ మోటార్స్ మార్చి 2008లో కంప్యూటర్ పరికరాల కోసం దాఖలు చేసిన వ్యాపార చిహ్న దరఖాస్తు విఫలమైంది,[22] UDRP ద్వారా డొమైన్‌ను పొందేందుకు చేసిన ప్రయత్నంగా దీనిని కొందరు భావిస్తున్నారు, తరచుగా వ్యాపార చిహ్న యజమానులకు అనుకూలంగా నిర్ధారణలు చేసే ఒక మధ్యవర్తిత్వ ప్యానల్‌గా యుడిఆర్‌పి గుర్తింపు పొందింది.
ఇటీవలి వార్తలు [మార్చు]
2010లో టయోటాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిస్సాన్ సొంత హైబ్రిడ్ టెక్నాలజీని విడుదల చేసింది. టయోటా యొక్క ప్రస్తుత హైబ్రిడ్ టెక్నాలజీ కంటే నిస్సాన్ యొక్క ఈ సంకర సాంకేతిక పరిజ్ఞానం తక్కువ సంక్లిష్టతతో మరియు మరింత సమర్థవంతమైనదిగా గుర్తింపు పొందింది.[citation needed]
ఏప్రిల్ 7, 2010న డైమ్లెర్ ఏజీ నిస్సాన్ మరియు రెనాల్ట్ రెండింటిలోని 3.9% వాటాలకు బదులుగా తన యొక్క 3.9% వాటాలను ఇచ్చిపుచ్చుకుంది. ఈ త్రైపాక్షిక భాగస్వామ్యం సాంకేతిక పరిజ్ఞానం మరియు అభివృద్ధి వ్యయాలను సమర్థవంతంగా పంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు, అంతర్జాతీయ సహకారం మరియు పరస్పర అభివృద్ధి చర్యలను ప్రోత్సహిస్తోంది.[19]
UKలో నిస్సాన్ నోట్ మరియు ఖష్గాయ్ రెండింటినీ సుండర్‌ల్యాండ్, టైన్ & వేర్‌లోని తమ యొక్క యుకే కర్మాగారంలో ఉత్పత్తి చేసింది. జనవరి 9, 2009న సుండర్‌ల్యాండ్ ప్లాంట్‌లో 1,200 ఉద్యోగాలు తొలగించనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. కార్ల విక్రయాల్లో తిరోగమనంతోపాటు, ఆర్థిక కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఐరోపాలో నిస్సాన్ యొక్క ఉత్పాదక విభాగం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ ట్రెవోర్ మాన్ మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్యకలాపాలను సమం చేస్తుందని చెప్పారు.[23]
నిస్సాన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో రోస్లైన్ వద్ద ఉన్న తమ కర్మాగారంలో కూడా కార్లను తయారు చేస్తుంది.
నిస్సాన్ ఉత్తర అమెరికా విభాగం తన ప్రధాన కార్యాలయాన్ని జులై 2006లో కాలిఫోర్నియాలోని గార్డెనా నుంచి టెన్నెస్సీలోని నాష్‌విల్లేకు మార్చింది. అమెరికాలోని నిస్సాన్ యొక్క నూతన ప్రధాన కార్యాలయం జులై 22, 2008న కూల్ స్ప్రింగ్స్ (నాష్‌విల్లే, టెన్నెస్సీ)లో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారుగా 1500 మంది ఉద్యోగాలు ఈ కార్యాలయంలో పని చేస్తున్నారు.
జీఎం మరియు రెనాల్ట్-నిస్సాన్ మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వాటాదారు కిర్క్ కెర్కోరియాన్ చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు జూన్ 30, 2006న జనరల్ మోటార్స్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. అయితే అక్టోబరు 4, 2006న జీఎం మరియు నిస్సాన్ చర్చలను నిలిపివేశాయి, నిస్సాన్ నుంచి జీఎంకు చెల్లింపులపై అభిప్రాయబేధాలు కారణంగా ఈ చర్చలు నిలిచిపోయాయి.
మే 17, 2006న నిస్సాన్ జపాన్‌లో అట్లాస్ 20 హైబ్రిడ్ ట్రక్‌ను విడుదల చేసింది. కంపెనీ 2006 హాన్నోవెర్ ఫెయిర్‌లో ఒక క్యాబ్‌స్టార్ హైబ్రిడ్ ట్రక్‌ను విడుదల చేసింది.
ఆగస్టు 2009లో కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని టోక్యో నుంచి తిరిగి యోకోహామాకు మార్చారు.
ఫిబ్రవరి 23, 2008న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (భారతదేశం)తో మహీంద్రా-రెనాల్ట్-నిస్సాన్ మూడు సంస్థలతో కూడిన ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సార్టియం ఒక అవగాహనా ఒప్పందం (MoU)పై సంతకం చేసింది, మద్రాస్ శివారు ప్రాంతమైన ఓరగాడంలో ఒక ఉత్పాదక కేంద్రాన్ని నిర్మించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
భారతదేశానికి చెందిన ప్రధాన వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్ (ఫ్రాన్స్) మరియు నిస్సాన్ (జపాన్) సంస్థలతో కూడిన కన్సార్టియం ప్రాథమికంగా రూ.4000 కోట్ల పెట్టుబడితో ప్రతి ఏడాది కార్లు, యుటిలిటీ వాహనాలు మరియు విడిభాగాలతోపాటు సుమారుగా 50,000 ట్రాక్టర్లు తయారు చేసేందుకు ఒక ఉత్పాదక కేంద్రాన్ని నిర్మించింది. ఈ ప్రాజెక్టు తమిళనాడు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)ని ఏడాదికి రూ.18,000 కోట్లు మేర పెంచడంతోపాటు, 41,000 ఉద్యోగాలు సృష్టిస్తుందని అంచనా వేశారు.
నిస్సాన్ 1996లో ఫ్యూయల్-సెల్ వెహికల్స్ (FCVలు) అభివృద్ధి చేయడం ప్రారంభించింది, 2003 ఆర్థిక సంవత్సరంలో పరిమిత సంఖ్యలో ఎక్స్-ట్రయిల్ FCV విక్రయాలను ప్రారంభించింది.
2002లో టయోటా మరియు నిస్సాన్ హైబ్రిడ్ టెక్నాలజీలపై ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి, 2004లో నిస్సాన్ ఆల్టిమా హైబ్రిడ్ నమూనాను ఆవిష్కరించింది.
వాహన ఉపసంహరణలు [మార్చు]
మార్చి 2, 2010న నిస్సాన్ బ్రేక్ పెడళ్లు మరియు గ్యాస్ గేజ్‌లను సరిచేసేందుకు 540,000 వాహనాలను వెనక్కు తీసుకుంది. USలో బ్రేక్ పెడల్ ఉపసంహరణలు దాదాపుగా 179,000 వాహనాలను ప్రభావితం చేశాయి, మధ్యప్రాచ్యం, కెనడా, రష్యా మరియు మరికొన్ని ఇతర దేశాల్లో సుమారుగా 26,000 వాహనాలు ప్రభావితమయ్యాయి.
2008 నుంచి 2010 మధ్యకాలంలో నిస్సాన్ టైటాన్ పికప్‌లు, ఇన్ఫినిటీ QX56 మరియు నిస్సాన్ ఆర్మెడా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు మరియు 2008 మరియు 2009 సంవత్సరాల్లో కొన్ని నిస్సాన్ క్వెస్ట్ మినీవ్యాన్‌లను కూడా ఉపసంహరించుకుంది.[24]
2004-2006 ఆర్మెడాలు మరియు టైటాన్‌లు, 2005–2006 ఇన్ఫినిటీ QX56లు మరియు ఫ్రాంటియర్‌లు, ఆగస్టు 2003 మరియు జూన్ 2006 మధ్యకాలంలో తయారు చేసిన పాత్‌ఫైండర్‌లు మరియు ఎక్స్‌టెర్రాలతోపాటు, పలు ట్రక్కులు మరియు SUVలను కూడా ఉపసంహరించుకుంటామని నిస్సాన్ ప్రకటించింది. ఇంజిన్ నియంత్రణ మాడ్యూల్‌లలో ఎలక్ట్రికల్ రిలేలు విఫలమయ్యే అవకాశం ఉండటం మరియు ఈ కారణంగా ఇంజిన్ తిరిగి పని చేయకుండా సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ ఉపసంహరణలను ప్రకటించింది. ఈ ఉపసంహరణలు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2,200,000 కార్లను ప్రభావితం చేసింది. [25]
పర్యావరణ చరిత్ర [మార్చు]
నిస్సాన్ లీఫ్ గురించి ప్రకటనలు వెలువడడానికి ముందు నిస్సాన్ మోటార్స్‌కు ఎటువంటి పర్యావరణ చరిత్ర లేదు, దీని యొక్క పోటీలో కూడా లేదు. అభివృద్ధి, ఉత్పత్తి మరియు ఎలక్ట్రిక్ ఆటోమొబైళ్ల వ్యాపారంపై కొత్తగా దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్‌లో ఈ వైఖరిలో మార్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. US తీరప్రాంత మార్కెట్‌లలో మార్చి 2010 నుంచి నిస్సాన్ ఎలక్ట్రిక్ కార్‌లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది, జూన్ 2011 నుంచి US అంతర్గత ప్రాంతాల్లో కూడా వీటి విక్రయాలకు ప్రణాళికలు రచిస్తోంది. తమ యొక్క EV మోడల్ నిస్సాన్ లీఫ్ గరిష్టంగా
మూస:Convert/mi/h వేగం ప్రయాణించగలదని మరియు ప్రతి ఛార్జ్‌కు 100 మైళ్లు ప్రయాణిస్తుందని నిస్సాన్ వెల్లడించింది. కారును పూర్తిగా ఛార్జ్ చేసేందుకు ఎనిమిది గంటల సమయం పడుతుందని సూచించింది. నిస్సాన్ యొక్క కారు ఒక లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. తక్కువ దూర ప్రయాణాలకు ఉద్దేశించిన ఈ వాహనం, సుదూర ప్రయాణాలకు ఉపయోగపడే సాంప్రదాయిక కారులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడదు. మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా నిస్సాన్ కారు కూడా కాలుష్య కారకాలను ఉద్గారం చేయదు. ఈ కార్లను నిర్వహించడంలో జరిగే కాలుష్యం ఏదైనా ఉందంటే అది కారును ఛార్జ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తి వలనే జరుగుతుంది, ఇది కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన మార్గంపై ఆధారపడివుంటుంది.[26] వ్యయ విశ్లేషణ ఆధారంగా జీవ ఇంధనం మరియు ఇథనాల్ ఆధారిత కార్లకు బదులుగా నిస్సాన్ 100 శాతం ఎలక్ట్రిక్ కార్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది.[27] మే 12, 2009న నిస్సాన్ కంపెనీ తమ యొక్క ఒప్పామా ప్లాంట్ నుంచి EVలను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది, 2010 చివరినాటికి ఏడాదికి 50,000 యూనిట్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. EVల కోసం బ్యాటరీలను ఆటోమోటివ్ ఎనర్జీ సప్లై కార్పొరేషన్ సరఫరా చేస్తుంది, ఈ ఉమ్మడి సంస్థను నిస్సాన్ (51%), NEC కార్పొరేషన్ (42%) మరియు NEC టోకిన్ కార్పొరేషన్ (7%) ఏర్పాటు చేశాయి.[28]
నాయకత్వం [మార్చు]
నిస్సాన్ యొక్క అధ్యక్షులు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లు:
- 1933–1939 యోషిసుకే ఐకావా
- 1939–1942 మసాసుకే మురాకామీ
- 1942–1944 జెన్షిచి అసహరా
- 1944–1945 హారుతో కుడో
- 1945 టాకెషి మురాయామా
- 1945–1947 సౌజీ యామామోటో
- 1947–1951 టైచీ మినౌరా
- 1951–1957 జెన్‌షిచి అసహరా
- 1957–1973 కాట్‌సుజీ కవామతా
- 1973–1977 టాడాహిరో ఐవాకోషి
- 1977–1985 టకాషి ఐషిహారా
- 1985–1992 యుటాకా కుమే
- 1992–1996 యోషిఫ్యూమ్ తసుజీ
- 1996–2000 యోషికాజు హనావా
- 2000–ప్రస్తుతం కార్లోస్ ఘోసన్
ఉత్పత్తులు [మార్చు]
ఆటోమోటివ్ ఉత్పత్తులు [మార్చు]
- ప్రధాన వ్యాసాలు: నిస్సాన్ వాహనాల జాబితా మరియు నిస్సాన్ ఇంజిన్‌ల జాబితా.
నిస్సాన్ విస్తృత శ్రేణి ప్రధాన స్రవంతి కార్లు మరియు ట్రక్‌లను తయారు చేసింది, మొదట దేశీయ వినియోగం కోసం వీటిని తయారు చేసింది, 1950వ దశకం నుంచి తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేసింది. 1953లో కంపెనీలో ఒక ప్రధాన సమ్మె జరిగింది.
పలు చిరస్మరణీయ స్పోర్ట్స్ కార్‌లను కూడా నిస్సాన్ తయారు చేసింది, వీటిలో డాట్‌సన్ ఫెయిర్‌లేడీ 1500, 1600 మరియు 2000 రోడ్‌స్టెర్‌లు భాగంగా ఉన్నాయి, మరో స్పోర్ట్స్ కారు జెడ్-కార్, ఇది 1969లో అందుబాటు ధరలో వచ్చిన స్పోర్ట్స్ కారుగా గుర్తింపు పొందింది; జీటీ-ఆర్ అనే ఒక శక్తివంతమైన ఆల్-వీల్-డ్రైవ్ స్పోర్ట్స్ కారును కూడా కంపెనీ తయారు చేసింది.
1985లో నిస్సాన్ ఒక ట్యూనింగ్ డివిజన్ NISMO ను సృష్టించింది, ఇటువంటి కార్ల రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు మరియు పనితీరు అభివృద్ధి చేసేందుకు దీనిని స్థాపించింది. నిస్మోస్ యొక్క తాజా నమూనాల్లో ఒకటి 370Z నిస్మో.
1982 వరకు నిస్సాన్ వాహనాలు అత్యధిక ఎగుమతి మార్కెట్‌లలో డాట్‌సన్ బ్రాండ్ పేరుతో విక్రయించబడ్డాయి. 1989 నుంచి నిస్సాన్ ఉత్తర అమెరికాలో తమ యొక్క విలాసవంతమైన మోడళ్లను ఇన్ఫినిటీ బ్రాండ్‌తో విక్రయించింది.
నిస్సాన్ ఒక చిన్న శ్రేణి కీ కార్‌లను కూడా విక్రయిస్తుంది, ప్రధానంగా ఇర జపనీస్ తయారీదారులు సుజుకీ లేదా మిత్సుబిషిలతో ఒక ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా వీటి విక్రయాలు జరుపుతుంది. నిస్సాన్ ఈ కార్‌లను అభివృద్ధి చేయడం లేదు. జపనీస్ దేశీయ కార్ల నమూనాల అభివృద్ధి కోసం నిస్సాన్ ఇతర తయారీదారులు మజ్డా, సుబారు, సుజుకీ మరియు ఐసుజులతో కలిసి పని చేస్తుంది.
చైనాలో నిస్సాన్ 2006నాటి నిస్సాన్ లివినా జెనిస్‌తోపాటు ఇతర కార్లను డోంగ్‌ఫెంగ్ మోటార్ గ్రూపుతో భాగస్వామ్యంతో తయారు చేస్తోంది. నిస్సాన్ లివినా జెనిస్ ప్రపంచవ్యాప్తంగా మధ్యతరహా కార్ల శ్రేణిలో మొట్టమొదటిగా గుర్తించబడుతుంది, గువాంగ్‌ఝౌ అంతర్జాతీయ మోటారు వాహన ప్రదర్శనలో ఇది ప్రపంచం ముందు ఆవిష్కరించబడింది.
నిస్సాన్ ఖాష్‌గాయ్ SUVని దక్షిణాఫ్రికాలో ఆవిష్కరించింది, దీనితోపాటు కొత్త మోటార్‌స్పోర్ట్ ఖాష్‌గాయ్ కార్ గేమ్స్‌ను కూడా విడుదల చేసింది.
2010లో నిస్సాన్ మరో ట్యూనింగ్ డివిజన్ IPL ను సృష్టించింది, ఈసారి తమ ప్రీమియం/విలాసవంతమైన బ్రాండ్ ఇన్ఫినిటీ కోసం దీనిని ఏర్పాటు చేసింది.
విద్యుత్ వాహనాలు [మార్చు]
నిస్సాన్ 2010లో ఐరోపాలో విద్యుత్ కార్లు ఆవిష్కరించనుంది, వివిధ దేశాల్లో వివిధ వ్యాపార మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.[29]
నిస్సాన్ మోటార్ కో. ఒక లిథియం-అయాన్ బ్యాటరీని అభివృద్ది చేయడం దాదాపుగా పూర్తి చేసింది, దీనిలో లిథియం నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ (NMC)ను ఉపయోగించారు. నూతన వ్యవస్థ నిస్సాన్/AESC యొక్క ప్రస్తుత మాంగనీస్ స్పినెల్ సెల్ కంటే దాదాపుగా రెట్టింపు సామర్థ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.[30]
నూతన నిస్సాన్ లీఫ్ కారు ఉత్తర అమెరికా, ఐరోపా మరియు జపాన్ దేశాల్లో 2010 చివరి నుంచి అందుబాటులోకి రానుంది. UKలోని సుండర్‌ల్యాండ్ ప్లాంట్‌లో కొత్త లీఫ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేయనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. సుండర్‌ల్యాండ్ ప్లాంట్‌లో ఏడాదికి 50,000 వాహనాల తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పనున్నారు.[31]
ఆటోమోటివ్ యేతర ఉత్పత్తులు [మార్చు]
ఆటోమోటివ్ పరిశ్రమకు వెలుపల నిస్సాన్ అనేక వ్యాపారాలు చేసింది, ముఖ్యంగా టు-కా మొబైల్ ఫోన్ సర్వీస్ (దీనిని 1994లో స్థాపించింది), దీనిని DDI మరియు జపాన్ టెలికామ్ (ఇప్పుడు ఈ రెండు సంస్థలు KDDI కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి) కంపెనీల్లో 1999లో విలీనం చేశారు. టోహాట్సు కార్పొరేషన్‌తో కలిసి నిస్సాన్ మెరైన్ అనే ఉమ్మడి యాజమాన్య సంస్థను నిస్సాన్ కలిగివుంది, ఈ సంస్థ బోట్లు మరియు ఇతర సాగర పరికరాల కోసం మోటార్‌లు తయారు చేస్తుంది.
అంతర్జాతీయ విక్రయాల గణాంకాలు [మార్చు]
| సంవత్సరం | అంతర్జాతీయ విక్రయాలు |
|---|---|
| 1998 | 2,555,962 |
| 1999 | 2,629,044 |
| 2000 | 2,632,876 |
| 2001 | 2,580,757 |
| 2002 | 2,735,932 |
| 2003 | 2,968,357 |
| 2004 | 3,295,830 |
| 2005 | 3,597,851 |
| 2006 | 3,477,837 |
| 2007 | 3,675,574 |
| 2008 | 3,708,074 |
| 2009 | 3,358,413 |
ఉత్పాదక ప్రదేశాలు [మార్చు]
నిస్సాన్ యొక్క అంతర్జాతీయ కార్పొరేట్ వెబ్‌సైట్ నుంచి సేకరించిన సమాచారం.[32]
జపాన్
- ఒప్పామా, యోకోసుకా, కానాగావా (ఒప్పామా ప్లాంట్ & రీసెర్చ్ సెంటర్)
- కామినోకావా, టోచిగి (టోచిగి ప్లాంట్)
- కాండా, ఫుకువోకా (క్యుషు ప్లాంట్ & నిస్సాన్ శాటాయ్ క్యోషు ప్లాంట్)[33]
- కానగావా-కు, యోకోహామా, కానాగావా (యోకోహామా ప్లాంట్)
- ఐవాకీ, ఫుకుషిమా (ఐవాకీ ప్లాంట్)
- హిరాట్సుకా, కానాగావా (నిస్సాన్ శాటాయ్ షోనాన్ ప్లాంట్)
- నాగోయా, ఐచీ (ఆచీ మెషిన్ ఇండస్ట్రీ ఆట్సుటా & ఇటోకు ప్లాంట్స్)
- మాట్సుసాకా, మీ (ఐచీ మెషిన్ ఇండస్ట్రీ మాట్సుసాకా ప్లాంట్)
- టసు, మీ (ఐచీ మెషిన్ ఇండస్ట్రీ టసు ప్లాంట్)
- ఉజీ, క్యోటో (ఆటో వర్క్స్ క్యోటో)
- ఏజియో, సైటామా (నిస్సాన్ డీజిల్ మోటార్, ప్రస్తుతం వోల్వో గ్రూపు యాజమాన్యంలో ఉంది)
- సాముకావా, కానాగావా (నిస్సాన్ కోకీ[అచేతన లింకు])
- జామా, కానాగావా (195లో జామా ప్లాంట్ మూసివేయబడింది, ప్రస్తుతం నిస్సాన్ యొక్క చారిత్రక మోడళ్లకు గ్లోబల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు నిల్వ విభాగంగా ఉంది)
ఇండియా
- ఒరగాడం, చెన్నై
బ్రెజిల్
- సావో జోస్ డాస్ పిన్‌హైస్, పరనా
ఇండోనేషియా
- చికాపెక్, పశ్చిమ జావా
ఇరాన్
- కారజ్, టెహ్రాన్
మలేషియా
- సెగమ్‌బట్, కౌలాలంపూర్
- సెరెన్‌డాహ్, సెలన్‌గోర్
మెక్సికో
- ఆగ్వాకాలియెంటెస్, ఆగ్వాస్కాలియెంటెస్
- సెర్నావాకా, మోరెలోస్
మొరాకో
- టాంజైర్, టాంజైర్ మెడ్ పోర్ట్ (నిర్మాణంలో ఉంది, రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్)
ఈజిప్ట్
- 6 ఆఫ్ అక్టోబర్ సిటీ, 6 ఆఫ్ అక్టోబర్ గవర్నరేట్
పాకిస్థాన్
- కరాచీ, సింధ్
ఫిలిప్పీన్స్
- శాంటా రోసా సిటీ, లాగునా
దక్షిణాఫ్రికా
- రోస్లైన్
స్పెయిన్
- బార్సిలోనా
- ఏవీలా
థాయ్‌ల్యాండ్
- బాంగ్నా, సాముత్‌ప్రాకార్న్
రిపబ్లిక్ ఆఫ్ చైనా
- తైపీ, తైవాన్
యునైటెడ్ కింగ్‌డమ్
- సుండర్‌ల్యాండ్, కౌంటీ డుర్హామ్, నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- సైర్నా, టెన్నెస్సీ
- కాంటోన్, మిసిసిపీ
- డెచెర్డ్, టెన్నెస్సీ
రష్యా
- సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా (పూర్తి 2010)
వీటిని కూడా చూడండి [మార్చు]
- ఆటెక్
- అశోక్ లేల్యాండ్ నిస్సాన్ వాహనాలు
- నిస్సాన్ డీజిల్
- నిస్సాన్ గ్రూపు
- డాట్‌సన్
- రెనాల్ట్
- ఇన్ఫినిటీ
- జాట్కో
- డోంగ్‌ఫెంగ్ మోటార్ కంపెనీ
- డోంగ్‌ఫెంగ్ నిస్సాన్-డీజిల్ కంపెనీ
- నిస్సాన్ వాహనాలు జాబితా
- నిస్సాన్ ఇంజిన్‌ల జాబితా
- నిస్సాన్ వ్యాపార రంగాలు
- లారెన్స్ హార్ట్‌నెట్
- ప్రాజెక్ట్ బెటర్ ప్లేస్
- NEC
- నిస్సాన్ ఇంజిన్ మ్యూజియం
- యోకోహామా ఎఫ్. మారినోస్
- కార్లోస్ ఘోసన్
- యుటాకా కాటాయామా
- నిస్సాన్ స్టేడియం
- నిస్మో
- యులోన్
గమనికలు మరియు సూచనలు [మార్చు]
- ↑ 1.0 1.1 1.2 http://www.nissan-global.com/EN/DOCUMENT/PDF/FINANCIAL/REFERENCE/CONSOLIDATION/2009/2009results_summary_124_e.pdf
- ↑ NISSAN | CORPORATE INFORMATION | Outline of Company TOP
- ↑ కుసుమానో పేజి 33
- ↑ కుసుమానో పేజీలు 28
- ↑ కుసుమానో పేజీలు 28, 30, 33
- ↑ కుసుమానో పేజీలు 28, 30
- ↑ కుసుమానో పేజీలు 30.
- ↑ కుసుమానో, పేజి 37
- ↑ "ఆఫుల్" (1935-01-21)- సేకరణ తేదీ 2007-06-11
- ↑ కాసుమానో
- ↑ కుసుమానో, పేజీలు 90-92
- ↑ 12.0 12.1 "To Outfox the Chicken Tax, Ford Strips Its Own Vans", The Wall Street Journal, Matthew Dolan, September 22, 2009, September 23, 2009.
- ↑ షుచ్‌మ్యాన్, లిసా. "నిస్సాన్ విల్ సెల్ బిల్డింగ్ ఇన్ టోక్యో టు మోరీ గ్రూప్ ఫర్ $107.8 మిలియన్." ది వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం, సెప్టెంబరు 25, 1998. సేకరణ తేదీ మార్చి 8, 2010.
- ↑ "Nissan - Corporate Information". Nissan.in. Retrieved 2009-12-04.
- ↑ "Nissan launches 2 new cars in India- Automobiles-Auto-News By Industry-News-The Economic Times", Economictimes.indiatimes.com, 2009-09-16. Retrieved on 2009-12-04.
- ↑ "Nissan’s Second Guangzhou Factory Breaks Ground". ChinaAutoWeb.com. Retrieved 2010-05-21.
- ↑ "Nissan Global".[అచేతన లింకు]
- ↑ 平成16年春の褒章受章者名簿 METI మూస:Ja icon
- ↑ 19.0 19.1 "Daimler, Nissan and Renault announce three-way tie-up", BBC News, April 7, 2010. Retrieved on May 20, 2010.
- ↑ కేస్ CV-99-12980-DDP యునైటెడ్ స్టేట్స్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్, నైన్త్ సర్క్యూట్
- ↑ Nissan.com ఫైనల్ జడ్జ్‌మెంట్
- ↑ USPTO ట్రేడ్‌మార్క్ అప్లికేషన్
- ↑ "AUDIO: Nissan boss' message to workers". Sunderland Echo. Retrieved 2009-04-27.
- ↑ "Nissan recalls 540,000 vehicles to fix brake pedals, petrol gauges", 3 March 2010. Retrieved on 3 March 2010.
- ↑ Smith, Aaron. "Nissan recalling 747,000 vehicles in U.S", CNN, October 28, 2010.
- ↑ Vlasic, Bill. "Nissan Plans Electric Car in U.S. by '10", The New York Times, May 13, 2008. Retrieved on May 20, 2010.
- ↑ నిస్సాన్ బెట్స్ ఆన్ ఎలక్ట్రిక్ కార్స్, నాట్ బయోఫ్యూయల్స్ | టెక్ న్యూస్ బ్లాగ్ - CNET News.com
- ↑ "Nissan to build electric vehicles at Oppama Plant". Nissan. 2009-05-12.
- ↑ http://www.autonews.com/article/20090304/ANE02/903039915/1164
- ↑ "Report: Nissan On Track with Nickel Manganese Cobalt Li-ion Cell for Deployment in 2015". Green Car Congress. Retrieved 2009-12-04.
- ↑ న్యూ స్టేట్స్‌మ్యాన్ - నిస్సాన్ టు బిల్డ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇన్ UK
- ↑ "Nissan Facilities Overseas". Retrieved 2008-07-01.
- ↑ నిస్సాన్ శాటాయ్ : కంపెనీ హిస్టరీ(1990-2009). సేకరణ తేదీ ఏప్రిల్ 16, 2010
- Cusumano, Michael A. (1985). The Japanese Automobile Industry. Harvard University Press. ISBN 0-674-47255-1.
బాహ్య లింకులు [మార్చు]
| Wikimedia Commons has media related to: Nissan |
- నిస్సాన్ అంతర్జాతీయ వెబ్‌సైట్
- నిస్సాన్ ఇండియా వెబ్‌సైట్
- నిస్సాన్ USA వెబ్‌సైట్
- నిస్సాన్ వ్యాపార వాహనాలు - ఉత్తర అమెరికా
- నిస్సాన్ ఆల్-ఎలక్ట్రిక్ కార్ - నిస్సాన్ లీఫ్
- నిస్సాన్/ఇన్ఫినిటీ న్యూస్ రూమ్ - సమగ్ర మోడల్, రీకాల్ మరియు బులిటన్ సమాచారం
మూస:Nissan మూస:Modern North American Nissan vehicles మూస:Modern North American Nissan trucks మూస:Modern European Nissan vehicles మూస:Nissan Sportscar Racers మూస:Infiniti మూస:Japanese Automobile Industry మూస:TOPIX 100
- అచేతన బాహ్యలింకులు గల అన్ని వ్యాసాలు
- అచేతన బాహ్యలింకులు గల వ్యాసాలు from April 2010
- Articles with invalid date parameter in template
- All articles with unsourced statements
- Articles with unsourced statements from September 2007
- Articles with unsourced statements from January 2011
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- నిస్సాన్
- బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు
- సంఘటిత సంస్థలు
- జపాన్‌లో మోటారు వాహన తయారీదారులు
- కానాగావాకు చెందిన కంపెనీలు
- టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో ఉన్న కంపెనీలు
- ట్రక్కుల తయారీదారులు
- జపాన్‌కు చెందిన ఆటోమోటివ్ కంపెనీలు
- జపాన్‌కు చెందిన కార్ల తయారీదారులు
- 1933లో స్థాపించబడిన సంస్థలు
- ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు