నీలిమా గుప్తె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలిమా గుప్తె
వృత్తిమహిళా శాస్త్రవేత్త

నీలిమా ఎం. గుప్తే భారతీయ భౌతిక శాస్త్రవేత్త . [1] ఆమె తన బి.ఎస్.సి. 1976 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి, M.Sc. 1978 లో ఐఐటి బొంబాయి నుండి, 1983 లో స్టోనీ బ్రూక్ వద్ద ఉన్న స్టేట్ యూనివర్సిటీ ఫ్ న్యూ యార్క్ నుండి పిహెచ్.డి. చేసింది. ఆమె తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేసింది. 1985 నుండి 1993 వరకు పూణే విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఉంది. తరువాత ఆమె మద్రాసు ఐఐటిలో భౌతిక శాస్త్ర ప్రొఫెసరుగా చేరింది. ఆమె పరిశోధనా ఆసక్తులు నాన్ లీనియర్ డైనమిక్స్ అండ్ ఖేయాస్ రంగంలో ఉన్నాయి.

ఆమె తన పరిశోధన, విద్యా కార్యక్రమాలతో పాటు, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ కు చెందిన 'ఉమెన్ ఇన్ ఫిజిక్స్' గ్రూప్ కార్యకలాపాల్లో కూడా పాల్గొంది. ఉమెన్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియాపై జీవిత చరిత్ర, ఆత్మకథ వ్యాసాల సంకలనం అయిన లీలావతి డాటర్స్లో ఆమెను చేర్చారు.

మూలాలు[మార్చు]

  1. "Dr. N. Gupte Faculty information". Archived from the original on 24 మార్చి 2014. Retrieved 24 March 2014.