నీలేష్ కులకర్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీలేష్ కులకర్ణి (జననం 1973 ఏప్రిల్ 3, ముంబాయి) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసిన తొలి బంతికే వికెట్టును సాధించి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ప్రపంచం మొత్తం పై ఈ ఘనత సాధించిన బౌలర్లలో 12 వాడు. 1997-98లో శ్రీలంక పై కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్ లో కులకర్ణి ఈ ఘనత సాధించాడు. కానీ, ఇతను ఆ మ్యాచ్ లో మరో 70 ఓవర్లు బౌలింగ్ చేసిననూ తదుపరి వికెట్టు లభించలేదు. నాలుగేళ్ళ విరామం తర్వాత ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టులో 137 పరుగులకు ఒక్క వికెట్టు సాధించి 588 బంతుల తర్వాత తన రెండో వికెట్టు పడగొట్టాడు. దాంతో అతని అంతర్జాతీయ క్రీడా జీవితం ముగిసింది. ఆ తర్వాత ముంబాయి తరపున రంజీ ట్రోపిలో పాల్గొన్నాడు.