నూతన్ ప్రసాద్
వికీపీడియా నుండి
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1970వ మరియు 80వ దశకములో తెలుగు సినిమా రంగములో అలరారిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు.
1973 లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమాతో ఈయన చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన సిమాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చినది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక సినిమాలలో విలన్ పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన యొక్క విభిన్న డైలాగు డెలివరీ విలనిజానికి ఒక హాస్యవన్నె తెచ్చింది. ఈయన అనేక సినిమాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక సినిమాలో కథానాయకునిగా కూడా నటించాడు.
నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. చిత్రములో ఈయన నటన చాలా ప్రాచుర్యము పొందినది. 'బామ్మమాట బంగారుబాట' సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలుగుతున్నారు.
[మార్చు] చిత్ర సమాహారం
- ఆవారాగాడు (2000)
- మాస్టర్ (1997)
- బిగ్ బాస్ (1995)
- ఘరానా బుల్లోడు (1995)
- తాజ్ మహల్ (1995)
- కర్తవ్యం (1991) .... (ఎ.ఎస్.పి. రామమోహనరావు)
- బామ్మమాట బంగారుబాట (1990)
- రుద్రనేత్ర (1989)
- చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
- యుద్ధభూమి (1988)
- త్రినేత్రుడు (1988)
- ఖైదీ నెం. 786 (1988)
- ఆఖరి పోరాటం (1988)
- చిన్నోడు పెద్దోడు (1988)
- చూపులు కలసిన శుభవేళ (1988) .... (నాగలింగం)
- దొంగ కోళ్ళు (1988)
- ఘాయల్ షేరినీ (1988)
- కానూన్ కీ హథకడీ (1988)
- అహ! నా పెళ్ళంట ! (1987)
- నాకూ పెళ్ళాం కావాలి (1987)
- ప్రెసిడెంటు గారి అబ్బాయి (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- వేట (1986)
- కిరాతకుడు (1986) .... Baby
- కారు దిద్దిన కాపురం (1986)
- విజేత (1985) .... (నారాయణరావు, నరసింహరావు రెండవ కొడుకు)
- అడవి దొంగ (1985)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
- రక్త సింధూరం (1985) .... (దామోదరం)
- చిరంజీవి (1985)
- దొంగ (1985)
- చట్టంతో పోరాటం (1985) .... (జైలర్ హిట్లర్ శర్మ)
- ముచ్చటగా ముగ్గురు (1985)
- రుస్తుం (1984)
- ఇంటిగుట్టు (1984)
- మహానగరంలో మాయగాడు (1984)
- రోజులు మారాయి (1984)
- గూండా (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984) .... (భాస్కరం)
- మంత్రిగారి వియ్యంకుడు (1983)
- ఖైదీ (1983) .... (మునసబు)
- మగ మహారాజు (1983)
- ఆడవాళ్లే అలిగితే (1983)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- తాతయ్య ప్రేమలీలలు (1980)
- రాజాధిరాజు (1980) .... (సైతాన్)
- ఇంటింటి రామాయణం (1979)
- నా ఇల్లు నా వాళ్ళు (1979)
- సమాజానికి సవాల్ (1979) .... (నిలన్)
- ప్రాణం ఖరీదు (1978) .... (కరణం బుల్లబ్బాయి)
- ముత్యాల ముగ్గు (1975) .... (కృష్ణ - నిత్య పెళ్ళికొడుకు)
- అందాల రాముడు (1973) .... (గిరిబాబు)