నూనె
వికీపీడియా నుండి
నూనె లేదా తైలం (ఆంగ్లం: Oil) ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే రసాయన పదార్ధాలు. ఇవి సాధారణంగా నీటిలో కరుగవు.
[మార్చు] రకాలు
- వంట నూనెలు (Cooking oils) : ఇవి నూనె గింజల నుండి తయారుచేస్తారు.
- కొబ్బరి నూనె (Coconut oil)
- వేరుశెనగ నూనె (Groundnut oil)
- నువ్వుల నూనె (Sesame oil)
- కుసుమ నూనె (Safflour oil)
- సూర్యకాంతం పువ్వు నూనె (Sunflower oil)
[మార్చు] వనస్పతి, వంట నూనెలతో సర్వరోగాలు
నూనెలోఅధికశాతంలో ట్రాన్స్ ఫ్యాట్ ఆమ్లాలున్నట్లు సీ.ఎస్.ఈ. అధ్యయనంలో వెల్లడయ్యింది. ట్రాన్స్‌ఫ్యాట్ ఆమ్లాలు రక్తంలో ఆరోగ్యకరమైన కొవ్వును తగ్గించడం వల్ల హృద్రోగాలు పెరిగే ప్రమాదముంది. డయాబెటిస్, అల్జీమర్స్, మహిళల్లో సంతాన సమస్యలు, రొమ్ము కేన్సర్ లాంటి రోగాలు రావడానికి కూడా అవకాశముంది. కానీ వంట నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో కంపెనీలు వాటి స్థాయిని తగ్గించడం లేదు. దాదాపు అన్ని కంపెనీల వనస్పతిలోనూ హానికారక ట్రాన్స్‌ఫ్యాట్లు నిర్దేశిత ప్రమాణం 2 శాతం కంటే 12 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆవనూనెలో ఇది ఒక శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు అవసరమైన శాతంలో ఒమెగా 3, 6, 9 లాంటి మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలింది.[1]