నెమలి సింహాసనం

వికీపీడియా నుండి

నెమలి సింహాసనం (ఆంగ్లం : Peacock Throne), ఇంకనూ తఖ్త్-ఎ-తావూస్ (పర్షియన్ : تخت طاووس ), అర్థం; తఖ్త్ అనగా సింహాసనం, తావూస్ అనగా నెమలి. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ దీనిని నిర్మించాడు. దీనిని నాదిర్ షాహ్ అఫ్షారీ ద్వారా, ముహమ్మద్ రెజా షాహ్ పహ్లవీ వద్ద చేరినది.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి ఐన షాజహాన్ 17వ శతాబ్దంలో నిర్మించాడు. దీనిని దీవాన్ ఎ ఆమ్ లో వుంచాడు. దీనిలోనే కోహినూర్ వజ్రం అలంకరించబడి వుండేది. ఇది ఆరు అడుగుల పొడవూ మరియు నాలుగు అడుగుల వెడల్పూ గల 'తఖ్తా' (ఫలకం) పై నిర్మించబడింది. నలువైపులా నాలుగు బంగారు స్థంభాల కాళ్ళు గలవు, వీటి ఎత్తు 20 నుండి 25 అంగుళాలు. దీనిలో వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు మరియు పగడాలు పొదిగివున్నవి. 108 పెద్ద కెంపులు, 116 పచ్చలు పొదిగియున్నవి. దీని విలువ నేటి మార్కెట్ లో పదికోట్ల రూపాయలని, ఇంకో లెక్క ప్రకారం ఒక బిలియన్ అమెరికా డాలర్లు అనీ చెబుతారు. [1].

ఇరాన్ పాలక వంశానికి చెందిన నసీరుద్దీన్ షాహ్, నెమలి సింహాసనం ఎదుట.

నాదిర్షా దీనిని తనతో పాటు ఇరాన్ కు తీసుకెళ్ళాడు. ఇది ఇప్పుడు ఇరాన్ లోనే ఉన్నది.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] వనరులు మరియు బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు