నెల్లిమర్ల

వికీపీడియా నుండి
  ?నెల్లిమర్ల మండలం
విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్
నెల్లిమర్ల వద్ద తూర్పు కనుమలు
నెల్లిమర్ల వద్ద తూర్పు కనుమలు
విజయనగరం జిల్లా పటములో నెల్లిమర్ల మండలం యొక్క స్థానము
విజయనగరం జిల్లా పటములో నెల్లిమర్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°10′N 83°26′E / 18.1667, 83.4333
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నెల్లిమర్ల
జిల్లా(లు) విజయనగరం
గ్రామాలు 31
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
73,788 (2001)
• 36644
• 37144
• 51.08
• 61.90
• 40.41


నెల్లిమర్ల (ఆంగ్లం: Nellimarla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. [1]

విషయ సూచిక

పట్టణ స్వరూపం, జనాభా [మార్చు]

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉన్నది. దీని భౌగోళిక స్థానం 18.1667° N 83.4333° E.[2] సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు (626 అడుగులు).

2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19,352. ఇందులో పురుషులు 48% మరియు స్త్రీలు 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉన్నది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70% మరియు స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.

ఇదే 2001లో నెల్లిమర్ల మండలం జనాభా 73,753. ఇందులో పురుషుల జనాభా 36,657 కాగా మహిళల జనాభా 37,096. మండలం అక్షరాస్యత 51% ఉన్నది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62%, మహిళల అక్షరాస్యత 41% ఉన్నది.

వ్యవసాయం, నీటి వనరులు [మార్చు]

చంపావతి నదిపై "డెంకాడ ఆనకట్ట" 1965-68 కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సరిపల్లి గ్రామం వద్ద ఉంది. [3] లభ్యమైన నీటిలో 0.640 TMC నీరు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగం అవుతున్నది. ఇందువల్ల డెంకాడ, భోగాపురం మండలాలలో 5,153 ఎకరాల ఆయకట్టు స్థిరపడింది.

పరిశ్రమలు [మార్చు]

నెల్లిమర్ల జూట్‌మిల్లు రాష్ట్రంలో పెద్దదైన జనుపనార పరిశ్రమలలో ఒకటి. అకారణముగా అనెక సార్లు మూత పడడము వలన చెడ్డ పేరు గడించింది.

విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు [మార్చు]

  • సి.కె.ఎమ్.జి కాలేజి చుట్టుప్రక్కల ప్రసిద్ధి చెందింది.
  • మహారాజా వైద్య విద్యా సంస్థ 2003లో స్థాపించబడింది.

ఇతర విశేషాలు [మార్చు]

  • చంపావతి నది వడ్డున ఒక క్రీడా మైదానం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెల్లిమర్ల మంచి క్రీడా కేంద్రంగా ప్రసిద్ధం. వెల్లిమర్ల నుండి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారులు వచ్చారు.
  • నెల్లిమర్ల సమీంలోని మోడా గ్రామం ఇదివరకు పెన్మత్స జమీందారుల పాలనలో ఉండేది. ఇక్కడినుండి పెన్మత్స సాంబశివరాజు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • నెల్లిమర్ల లొ శ్రీ ఛక్ర జూనియర్ కాలేజ్ 2004 లొ స్తాపినఛబడెను దానికి ప్రిన్షపాల్ కనకల రాంబాబు ఎమ్.ఎస్.సి, బి.ఈడి

మండలంలోని పట్టణాలు [మార్చు]

  • నెల్లిమర్ల

మండలంలోని గ్రామాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు, వనరులు [మార్చు]

Vijayanagaram.jpg

విజయనగరం జిల్లా మండలాలు

కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస

"http://te.wikipedia.org/w/index.php?title=నెల్లిమర్ల&oldid=827070" నుండి వెలికితీశారు