నేలకొండపల్లి

వికీపీడియా నుండి

  ?నేలకొండపల్లి మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటములో నేలకొండపల్లి మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో నేలకొండపల్లి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నేలకొండపల్లి
జిల్లా(లు) ఖమ్మం
గ్రామాలు 22
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
62,220 (2001)
• 31103
• 31117
• 56.40
• 67.05
• 45.70



నేలకొండపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

నేలకొండపల్లి స్థూపం
నేలకొండపల్లి స్థూపం సమీప దృశ్యం

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.

పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని రూఢి అవుతున్నది.

ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరం గా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

[మార్చు] వ్యవసాయ విషయాలు

[మార్చు] గ్రామంలో సౌకర్యాలు

MANDAL REVENUE OFFICE and MANDAL DEVOLOPMENT OFFICE and A POLICE STATION and PRIMARY,HIGH SCHOOL and GOVT JUNIOR COLLEGE are there in NELAKONDAPALLY.

[మార్చు] దేవాలయములు

చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములు ఉన్నవి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి.

[మార్చు] రవాణా సౌకర్యాలు

నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉన్నది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉన్నది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడ లో ఉన్నవి.

[మార్చు] మండలంలోని గ్రామాలు


పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు